Ashu Reddy: పారిస్ లో రచ్చ చేస్తున్న అషు రెడ్డి.. హాట్ ఫొటోలతో వైరల్
ప్రస్తుతం ఓల్డ్ నుంచి యంగ్ జనరేషన్ వరకు సోషల్ మీడియా వాడకం బాగా పెరిగింది. ఎవరికైనా అందుబాటులో ఉండి తమ వ్యక్తిగత, కెరీర్, ప్రమోషన్స్ వంటి తదితర విషయాలను షేర్ చేసుకోవాలంటే ఈ సోషల్ మీడియా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఇక అప్ కమింగ్ హీరో హీరోయిన్లకు తమ టాలెంట్ చూపించుకోడానికి ఇదొక మంచి ప్లాట్ ఫామ్. దీంతో ఈ సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది పాపులర్ అయ్యారు. అలాంటి వారిలో తెలుగు అమ్మాయిలు కూడా ఉన్నారు. ఇంటర్నెట్ ద్వారా ఎక్కువ గుర్తింపు సాధించిన తెలుగు అమ్మాయిల్లో అషు రెడ్డి ఒకరు. అందానికి అందం.. టాలెంట్‌కు టాలెంట్ ఉన్న బ్యూటిఫుల్ అమ్మాయి కావడంతో అతి తక్కువ సమయంలోనే సూపర్ పాపులర్ అయిపోయింది. ఇటీవల ఫోకస్ సినిమాతో అలరించిన ఈ చిన్నది ప్రస్తుతం పారిస్ లో ఎంజాయ్ చేస్తూ హాట్ గా పిక్స్ వదులుతోంది.

'ఛల్ మోహనరంగ'లో అవకాశం..
అషు రెడ్డి మొదట డబ్ స్మాష్ వీడియోల ద్వారా పరిచయమైంది. చూడ్డానికి అచ్చం సమంతలా ఉండడంతో ఒక్కసారిగా ఫేమస్ అయింది ఈ బ్యూటి. ఆమెకు జూనియర్ సమంత, బుల్లితెర సమంత అని పేర్లు కూడా పెట్టారు. దీంతో ఆమె క్రేజ్ ఒక్కసారిగా అమాంతం పెరగడంతో ఆఫర్లు వెల్లువెత్తాయి. ఇందులో భాగంగానే నితిన్ హీరోగా, మేఘా హీరోయిన్ గా నటించిన 'ఛల్ మోహనరంగ' అనే మూవీలో నటించింది అషురెడ్డి.

షోలో అంతగా ప్రభావం చూపని అషు..
ఛల్ మోహన్ రంగ సినిమా తర్వాత పలు వ్యక్తిగత కారణాలతో అమెరికా వెళ్లి కెరీర్‌కు బ్రేక్ ఇచ్చేసింది ఈ బోల్డ్ బ్యూటి. యూఎస్‌లో ఉన్న సమయంలో అషు రెడ్డి గ్లామర్ ఫీల్డుకు దూరంగా ఉందనే చెప్పుకోవాలి. అయితే, కొద్ది రోజుల తర్వాత ఇండియాకు తిరిగి వచ్చిన అషు రెడ్డి ప్రముఖ తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ మూడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా అవకాశం అందుకుంది. ఈ షోలో అంతగా ప్రభావాన్ని చూపకపోయినా తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంది.

బోల్డ్ గా వ్యవహరించడం..
బిగ్ బాస్ షోలో పాల్గొన్న తర్వాత యాంకర్ గా మారింది ఈ బ్యూటి. కామెడీ స్టార్స్, హ్యాపీ డేస్ వంటి షోస్ కి వ్యాఖ్యతగా (యాంకర్) వ్యవహరించింది. అనంతరం బిగ్ బాస్ తెలుగు ఓటటీ సీజన్ లో మరోసారి అవకాశం దక్కించుకుంది ఈ చిన్నది. ఇందులో మరింత రెచ్చిపోయిన అషు రెడ్డిని బోల్డ్ బ్యూటిగా ముద్దుగా పిలుచుకున్నారు. తరచూ షోలో బూతులు మాట్లాడడం.. బోల్డుగా కనిపించడం వంటివి చేసి హైలైట్‌గా నిలిచింది.

విదేశీ పర్యటనలో ఫుల్ బిజీ..
బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్‌లో ఫినాలేకు చేరకుండానే అషు రెడ్డి ఎలిమినేటై నిరాశ ఎదుర్కొంది. నాన్ స్టాప్ సీజన్ ఫినాలేకు చేరుకోకపోయిన షో ద్వారా మాత్రం మరింత పాపులర్ అయింది. దీంతో కెరీర్ లో చాలా అవకాశాలు వచ్చనట్లు సమాచారం. సినిమాలు కాకుండా అషు రెడ్డి ఎక్కువగా విదేశీ పర్యటనలతో ఫుల్ బిజీగా ఉండేది. దుబాయ్, మియామీ, మాల్దీవ్స్ వంటి తదితర టూరిస్ట్ ప్లేస్ లో చక్కర్లు కొడుతూ తెగ ఎంజాయ్ చేసింది.
షాపింగ్ ఎంజాయ్ చేస్తూ..
ప్రస్తుతం మరోసారి ఫారెన్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది ఈ బ్యూటి. మొన్నటిదాక మాల్దీవ్స్ లో హాట్ హాట్ ఫొటోలు షేర్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు పారిస్ లో సందడి చేస్తోంది. అక్కడ ఎక్కువగా షాపింగ్ చేస్తూ వెకేషన్ ని ఆస్వాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఎప్పటిలానే సోషల్ మీడియాలో హాట్ పిక్స్ తో అట్రాక్ట్ చేసే ఈ బ్యూటి తాజాగా మరోసారి మరికొన్ని ఫొటోలు వదిలింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బ్లాక్ డ్రెస్ లో హాట్ గా..
పారిస్ లో ఉన్న అషు రెడ్డి ఇంతకుముందు ఈఫిల్ టవర్ దగ్గర దిగిన పిక్స్ షేర్ చేయగా.. తాజాగా బ్లాక్ డ్రెస్ లో సూపర్ హాట్ గా ఉన్న ఫొటోలు బయటకు వదిలింది. బ్లాక్ ఔట్ ఫిట్ లో అషు రెడ్డి అందాలు మెరుస్తున్నాయి. ఈ ఫొటోల్లో క్లీవేజ్ షోతోపాటు థైస్ షో ఘాటుగా ఉంది. మరికొన్ని ఫొటోల్లో రెడ్ షర్ట్ వేసుకుని అతి చిన్న షార్ట్ ధరించి రోడ్డు పక్కన కూర్చుని థైస్ అందాలు పరచింది. ఆమె పక్కన బ్యాగ్స్ చూస్తుంటే అప్పుడే షాపింగ్ చేసి అలసిపోయినట్లుగా కనిపిస్తోంది.

పోలీస్ గా అషు రెడ్డి..
ఇవేకాకుండా ఏదో మాల్ లో గ్లోబ్ పై చేతులు ఆనించి బ్లూ కలర్ డ్రెస్ లో అందాలను ఆరబోసింది బోల్డ్ బ్యూటి అషు రెడ్డి. ప్రస్తుతం ఆమె పారిస్ లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇక ఆమె సినిమాల విషయానికొస్తే ఇటీవలే ఫోకస్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో అషు రెడ్డి పోలీస్ ఆఫీసర్ పాత్రలో అలరించింది. ఇందులో సీనియర్ హీరోయిన్ సుహాసిని కూడా నటించారు.


Click it and Unblock the Notifications











