Don't Miss!
- Finance
India imf: శభాష్ ఇండియా అంటూ IMF ప్రశంసలు.. ప్రపంచ ఆర్థికంలో మన వాటా ఎంతంటే..?
- News
మోదీ సర్కార్‌పై బీఆర్ఎస్ ప్రత్యక్ష యుద్ధం..!!
- Sports
INDvsNZ: టీమిండియాకు సంప్రదాయ వెల్ కమ్.. వీడియో షేర్ చేసిన బీసీసీఐ
- Automobiles
ఎట్టకేలకు హైరైడర్ CNG విడుదల చేసిన టయోటా.. ధర ఎంతంటే?
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
Ashu Reddy: యాంకర్ రవితో అషు రెడ్డి లాంగ్ డ్రైవ్.. నెట్టింట్లో హాట్ వీడియో వైరల్
ఇటీవల కాలంలో ఓల్డ్ నుంచి యంగ్ జనరేషన్ వరకు సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఎవరికైనా అందుబాటులో, తమ విషయాలను షేర్ చేసుకోవాలంటే ఈ సోషల్ మీడియా చక్కగా ఉపయోగపడుతుంది. అందులోను ముఖ్యంగా ఇన్ స్టా గ్రామ్. ఇక అప్ కమింగ్ హీరో, హీరోయిన్లకు తమ టాలెంట్ చూపించుకోడానికి ఇదొక మంచి ఆప్షన్. ఇలా.. సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది పాపులర్ అయ్యారు. అలా పాపులర్ అయిన వాళ్లలో అషు రెడ్డి ఒకరు. జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న ఈ భామ నిత్యం సోషల్ మీడియాలో హాట్ పిక్స్ వదులుతుంటుంది. ఈసారి ఒక వీడియో రిలీజ్ చేసి అట్రాక్ట్ చేసింది.

అతి తక్కువ సమయంలోనే..
చిన్న పెద్దా అంటూ తేడా లేకుండా వినియోగంలో ఉంటుంది సోషల్ మీడియా. ఈ సామాజిక మాధ్యమం ద్వారా పాపులర్ అయిన అందమైన తెలుగు అమ్మాయిల్లో అషు రెడ్డి ఒకరు. అందానికి అందం.. టాలెంట్‌కు టాలెంట్ ఉన్న బ్యూటిఫుల్ అమ్మాయి కావడం వల్ల అతి తక్కువ సమయంలోనే సూపర్ పాపులర్ అయిపోయింది. సోషల్ మీడియాలో అషు రెడ్డి చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిత్యం హాట్ ఫొటోలతో రచ్చ చేస్తుంటుంది ఈ బోల్డ్ బ్యూటి.

సమంతలా ఉందే అని..
ఇన్ స్టా గ్రామ్, టిక్ టాక్ లేని సమయంలో ఎక్కువగా పాపులర్ అయినవి డబ్‌స్మాష్ వీడియోలు. సోషల్ మీడియా ఎక్కువగా వాడకం లేని సమయంలో పాపులర్ అయిన ఈ డబ్ స్మాష్ ల ద్వారా వెలుగులోకి వచ్చిన అచ్చమైన తెలుగు అందమే అషు రెడ్డి. ఈ డబ్ స్మాష్ వీడియోలలో అషురెడ్డిని చూసి అనేక మంది నెటిజన్లు ఆమె చూడటానికి అచ్చం హీరోయిన్ సమంతలా ఉందని కాంప్లిమెంట్ ఇచ్చారు. దీంతో అషు రెడ్డి ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది.

పోలీస్ గా అషు రెడ్డి..
జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అషు రెడ్డి అత్యధిక ప్రజాదరణ పొందుతున్న బిగ్ బాస్ సీజన్ 3 అండ్ ఓటీటీ (నాన్ స్టాప్) లో పాల్గొన్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ షో తర్వాత మరింత స్పీడు పెంచేసింది ఈ హాట్ బ్యూటి. ఇందులో భాగంగానే ఇప్పటికే పలు ప్రాజెక్టులను సైతం లైన్‌లో పెట్టుకుంది. ఇటీవలే ఫోకస్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో అషు రెడ్డి పోలీస్ ఆఫీసర్ పాత్రలో అలరించింది. ఇందులో సీనియర్ హీరోయిన్ సుహాసిని కూడా నటించారు.

నెటిజన్లకు స్ట్రాంగ్ వార్నింగ్..
ఇక ఇటీవల మరోసారి బుల్లితెరపై తన అందంతోపాటు డ్యాన్స్ తో కొన్ని రోజులు అలరించింది అషు రెడ్డి. బీబీ జోడీ అనే డ్యాన్స్ రియాలిటీ షోలో మెహబూబ్ కు జోడీ కట్టిన ఈ భామ అనారోగ్యం కారణంగా మానేసింది. అందుకు ఇటీవల సోషల్ మీడియా వేదికగా వివరణ కూడా ఇచ్చింది. తన హెల్త్ పై కామెంట్స్ చేసిన నెటిజన్లకు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది ఈ బోల్డ్ బ్యూటి. అయితే డ్యాన్స్ షోకి దూరంగా ఉన్న అషు రెడ్డి సోషల్ మీడియాలో మాత్రం డ్యాన్స్ రీల్స్ పోస్ట్ చేస్తుంటుంది.
ఎలాంటి డ్రెస్సులు వేసినా..
సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫొటోలు, వీడియోలతో హీట్ పెంచుతుంటుంది బోల్డ్ బ్యూటి అషు రెడ్డి. అలాగే తరచూ విదేశీ పర్యటనలతో ఎంజాయ్ చేస్తుంటుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే అషు రెడ్డి దుబాయ్, మియామీ, మాల్దీవ్స్, యూరప్, అమెరికా వంటి తదితర టూరిస్ట్ ప్లేస్ లకు కూడా వెళ్లొచ్చింది. ఎక్కడికి వెళ్లినా.. ఎలాంటి డ్రెస్సులు వేసిన తన గ్లామర్ తో మాత్రం ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటుంది ఈ భామ.
యాంకర్ రవితో..
ఇక ఇటీవల ఫొటోలతో పాటు వీడియోలు కూడా చేస్తుంది అషు రెడ్డి. తాజాగా పోస్ట్ చేసిన వీడియోలో యాంకర్ రవితో కలిసి ఓ వీడియో చేసింది. ఇందులో ఇద్దరు స్కూటీపై కూర్చుని లాంగ్ డ్రైవ్ పోదామా అంటూ ఉండే లవ్ టుడే పాటకు రీల్ చేశారు. ఈ వీడియోలో చినిగిన జీన్స్ తో థైస్ కనిపించేలా హాట్ గా దర్శనమిచ్చింది అషు రెడ్డి. అలాగే మరొక వీడియోలో తన క్లీవేజ్ షో చేస్తూ మరింత హాట్ గా దర్శనమిచ్చింది అషు రెడ్డి. ప్రస్తుతం ఈ వీడియోలో నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.