’పవన్‌ కళ్యాణ్‌ని 2 గంటలు పిసికేశా .. ఆ ఒక్క మిస్టేక్‌తో ‘

బిగ్‌బాస్ రియాలిటీ షో ద్వారా పాపులర్ అయిన నటీమణుల్లో అషురెడ్డి కూడా ఒకరు. అచ్చు గుద్దినట్లు సమంతలా ఉండటంతో ఈ అమ్మడికి జూనియర్ సమంత అనే పేరు కూడా వచ్చింది. బిగ్‌బాస్ తర్వాత కొన్నాళ్లు హడావుడి కనిపించినప్పటికీ తర్వాత అషురెడ్డి కనిపించడం లేదు. ఇటీవల జబర్దస్త్ వర్ష హోస్ట్‌గా ఓ ఛానెల్‌లో ఓ పాడ్‌కాస్ట్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న అషురెడ్డి తన కెరీర్, బ్రేకప్ తదితర అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

అమెరికాలో స్థిరపడిన అషురెడ్డి తొలుత టిక్ టాక్ వీడియోలు, డబ్‌స్మాష్, రీల్స్‌తో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా బాగా పాపులర్ అయ్యారు. యూత్‌లో సెపరేట్ క్రేజ్ ఉండటంతో ఆమెకు బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో అవకాశం దక్కింది. అమెరికాలో ఉన్నప్పుడే నితిన్ హీరోగా వచ్చిన ఛల్ మోహన్ రంగా సినిమాలో ఛాన్స్ దక్కడంతో అందులో నటించింది అషురెడ్డి. ఈ దెబ్బతో మనసు సినిమాల వైపు మళ్లడంతో జాబ్ వదిలేసి వెంటనే ఇండియాకు వచ్చేసింది అషురెడ్డి. ఆ తర్వాత టీవీ షోలలో యాంకర్‌గా, కంటెస్టెంట్‌గా, సినీ నటిగా బిజీ అయ్యింది.

ashu reddy meets pawan kalyan bigg boss contestant open up on her break up

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌ పడిచచ్చిపోయే అషురెడ్డి అప్పట్లో తన ప్రైవేట్ పార్ట్స్‌పై పవర్ పేరును పచ్చబొట్టు పొడిపించుకోవడంతో ఆమె వార్తల్లోకెక్కింది. పవన్ ఒప్పుకుంటే ఆయనకు నాలుగో భార్యగా కూడా ఉంటానని అప్పట్లో ఓపెన్‌గా స్టేట్‌మెంట్ ఇచ్చి కలకలం రేపింది. తాజాగా వర్ష పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న అషురెడ్డి నాడు పవన్ కళ్యాణ్‌ను కలిసిన సంగతి, ఆయనతో మాట్లాడిన విషయాలు పంచుకుంది. హరిహర వీరమల్లు షూట్ జరుగుతున్నప్పుడు , ఆ పక్క సెట్‌లోనే నా సినిమా షూటింగ్ జరుగుతోందని అషురెడ్డి తెలిపారు. ఆయనను కలిసేందుకు వెళ్లగా పవన్ కళ్యాణ్ రమ్మన్నారని చెప్పారు.

నా పేరు టాటూ వేయించుకుంది నువ్వే కదా అని గుర్తుపట్టడంతో నాకు రెండు నిమిషాలు ఏం అర్ధం కాలేదని అషురెడ్డి అంది. పక్కన కూర్చోబెట్టి టీ ఇచ్చారని.. ఆ కాసేపటికీ ఖుషిలో మీరు భూమిక నడుము చూడటం నచ్చలేదని చెప్పడంతో ఆయన కాసేపు నవ్వుకున్నారని ఆమె తెలిపింది. పవన్ చేతి మీద త్రిశూలం గుర్తున్న టాటూ ఉంటుందని దాన్ని నేను చూడొచ్చా అని చేయి తీసుకుని పిసికేశానని, ఓ రకంగా చెప్పాలంటే తాను పవన్‌ని ఫ్లర్ట్ చేశానని అషురెడ్డి చెప్పింది. మమ్మల్ని ఓ పది నిమిషాల్లో పంపించేస్తారని అనుకున్నామని కానీ రెండు గంటల పాటు కూర్చోబెట్టి మాట్లాడారని.. వెళ్లేటప్పుడు ఆయన దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకున్నానని ఆమె తెలిపింది.

ఇక తన బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ గురించి కూడా అషు ఓపెన్ అయ్యింది. ఇద్దరం ఇగో వల్ల విడిపోయామని ఓ రోజు ఫ్రెండ్స్‌ బయటికి వచ్చినప్పుడు అతను కూడా వచ్చాడని ఆ రోజు వెళ్లకపోయినా బాగుండేదని , ఆ తర్వాత బ్రేకప్ అయ్యిందని అషురెడ్డి చెప్పింది. దీంతో తాను డిప్రెషన్‌లోకి వెళ్లానని అందులో నుంచి బయటికి రావడానికి కొంతమంది ఫ్రెండ్స్ తనకు సాయం చేశారని అషురెడ్డి వెల్లడించింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: ashu reddy pawan kalyan bigg boss
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X