For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కమెడియన్‌తో అలాంటి పని చేసిన అషు రెడ్డి: ఏకంగా ఇంట్లోనే ఎంజాయ్.. అలా బయటకొచ్చిన మేటర్

  |

  అషు రెడ్డి.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా ఈ అమ్మడు కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో హల్‌చల్ చేసేస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ సెన్సేషన్ అవుతోంది. తద్వారా వరుసగా ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ బ్యూటీ మరింతగా చెలరేగిపోతూ రచ్చ రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే ఓ కమెడియన్‌తో లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు వ్యవహరిస్తోంది. దీంతో మరింతగా హాట్ టాపిక్ అయిపోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా అతడితో కలిసి అషు రెడ్డి ఎంజాయ్ చేసింది. ఆ సంగతులు మీకోసం!

  జూనియర్ సమంతలా అషు రెడ్డి పాపులర్

  జూనియర్ సమంతలా అషు రెడ్డి పాపులర్

  దేశ వ్యాప్తంగా డబ్‌స్మాష్ వీడియోలు ఎంతగా పాపులర్ అయ్యాయో అందరికీ తెలిసిందే. వీటి ద్వారానే అషు రెడ్డి కూడా వెలుగులోకి వచ్చింది. చూడ్డానికి అచ్చం సమంతలా కనిపించడంతో ఈమెకు జూనియర్ సమంత అనే పేరు కూడా వచ్చింది. అదే సమయంలో ఫాలోయింగ్ కూడా భారీగా పెరిగిపోయింది. దీంతో నితిన్ నటించిన 'ఛల్ మోహనరంగ'లో నటించే అవకాశాన్ని అందుకుంది.

  ఎప్పుడూ అందులోనే.. పవన్ పేరుతో రచ్చ

  ఎప్పుడూ అందులోనే.. పవన్ పేరుతో రచ్చ

  అషు రెడ్డికి అంత పేరు రావడానికి కారణం సోషల్ మీడియానే. దాదాపు పదేళ్లుగా ఈ అమ్మడు అందులో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన వ్యక్తిగత వివరాలను పంచుకుంటూ నిత్యం ఫాలోవర్లతో టచ్‌లో ఉంటోంది. ఇక, పవన్ కల్యాణ్‌పై ఉన్న ప్రేమను తరచూ ఏదో రకంగా బయట పెడుతోంది. తద్వారా ఎన్నో సార్లు వివాదాల్లో చిక్కుకుని రచ్చ రచ్చ చేసేసిందామె.

  కమెడియన్లతో కలిసిపోయి హల్‌చల్ చేస్తూ

  కమెడియన్లతో కలిసిపోయి హల్‌చల్ చేస్తూ


  స్టార్ మా ఛానెల్‌లో 'కామెడీ స్టార్స్' అనే షో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఇందులో అప్పటి హీరోయిన్ శ్రీదేవి, శేఖర్ మాస్టర్ జడ్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. వర్షిణి యాంకరింగ్ బాధ్యతలు నిర్వహిస్తోంది. అవినాష్‌, చమ్మక్ చంద్ర, జోర్ధార్ సుజాతతో పాటు అషు రెడ్డి కూడా ఇందులో హల్‌చల్ చేస్తోంది. ఈ క్రమంలోనే షూటింగ్ స్పాట్‌లో తీసిన కొన్ని వీడియోలను వదులుతోంది.

  అతడితో వ్యవహారం.. ముద్దులు.. హగ్గులు

  అతడితో వ్యవహారం.. ముద్దులు.. హగ్గులు

  'కామెడీ స్టార్స్'కు గ్లామర్ టచ్ ఇచ్చే పనిలో భాగంగా.. అషు రెడ్డిని ఫుల్ టైమ్ ఆర్టిస్టుగా తీసుకున్నారు. దీంతో ఆమె స్కిట్లలో నటిస్తూ సందడి చేస్తోంది. అదే సమయంలో ఎక్స్‌ప్రెస్ హరికి హగ్గులు, ముద్దులు పెట్టి అక్కడున్న వారితో పాటు ప్రేక్షకులను షాక్‌కు గురి చేసింది. ఆ తర్వాత కూడా అదే కంటిన్యూ చేసింది. దీంతో వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ సాగుతోందన్న టాక్ వినిపిస్తూనే ఉంది.

  కమెడియన్‌తో రిలేషన్‌పై అషు రెడ్డి వివరణ

  కమెడియన్‌తో రిలేషన్‌పై అషు రెడ్డి వివరణ


  అషు రెడ్డి.. రవితో కలిసి 'హ్యాపీ డేస్' అనే డైలీ షో చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి ఎక్స్‌ప్రెస్ హరి స్క్రిప్టు రైటర్‌గా పని చేస్తుండగా.. జబర్ధస్త్ అజయ్ ఇందులో కీలక పాత్రను చేస్తున్నాడు. వీళ్లంతా కలిసి కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో లైవ్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హరి తనకు అన్నయ్యలాంటి వాడని చెప్పి.. అతడితో ఉన్న రిలేషన్‌పై అషు రెడ్డి క్లారిటీ ఇచ్చింది.

  కమెడియన్‌తో అలాంటి పని చేసిన అషు రెడ్డి

  కమెడియన్‌తో అలాంటి పని చేసిన అషు రెడ్డి

  కమెడియన్ హరి తనకు సోదరుడు లాంటి వాడని చెబుతోన్న అషు రెడ్డి.. తరచూ అతడితో ట్రాక్ ఉన్నట్లు నటిస్తోంది. క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా ఎన్నో విధాలుగా స్కిట్లు చేసి అనుమానాలు పెంచేస్తోంది. దీంతో ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలియక జనాలు తలలు పట్టుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఎక్స్‌ప్రెస్ హరితో చేసిన ఓ పని గురించి ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టిందీ బ్యూటీ.

  Recommended Video

  Akhanda Movie తో మరో స్టార్ హీరో కి లైఫ్ ఇవ్వబోతున్న బాలయ్య బాబు!! || Filmibeat Telugu
  ఏకంగా ఇంట్లోనే.. బయటకు వచ్చిన మేటర్

  ఏకంగా ఇంట్లోనే.. బయటకు వచ్చిన మేటర్

  ఖాళీ సమయంలో ఎక్స్‌ప్రెస్ హరితో ఎంజాయ్ చేస్తున్నట్లు తాజాగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఫొటోను పెట్టింది అషు రెడ్డి. ఇంతకీ ఏంటంటే.. ఆమె కామెడీ స్టార్స్ డైరెక్టర్ సంతోష్, ఎక్స్ ప్రెస్ హరితో పాటు మరొకరితో కలిసి తన ఇంట్లో అష్టాచెమ్మా ఆడింది. నాలుగు వైపులా ఆడుతున్న వాళ్ల పేర్లను ట్యాగ్ చేసింది. దీనికి సంబంధించిన ఫొటోను వదిలింది. దీంతో ఈ మేటర్ బయటకు వచ్చింది.

  English summary
  Ashu Reddy is a born-American actress and model who made her film debut in a Telugu movie in 2018. She is also known as junior Samantha because of her hot look and appearance. After completing her graduation in 2016.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X