Ashu Reddy Pregnant: తల్లి కాబోతున్న అషు.. పిచ్చ కొట్టుడు కొట్టిన తల్లి.. అలా బయటకు వచ్చిన వీడియో

సోషల్ మీడియా వాడకం పెరిగే కొద్దీ ఎంతో మంది అమ్మాయిలు ఫుల్ ఫేమస్ అవుతున్నారు. తద్వారా తరచూ వార్తల్లో నిలవడంతో పాటు వరుసగా ఆఫర్లను సైతం అందుకుంటున్నారు. అలాంటి వారిలో తెలుగు పిల్ల అషు రెడ్డి ఒకరు. చాలా కాలం క్రితమే తెలుగు వాళ్లకు సుపరిచితురాలు అయిన ఈ బ్యూటీ.. ఈ మధ్య కాలంలో మరింత హల్‌చల్ చేస్తోంది. ఫలితంగా బుల్లితెరపై అవకాశాలను అందుకుంటూ ముందుకు వెళ్తోంది. అదే సమయంలో సోషల్ మీడియా ద్వారా అందాలను ఆరబోస్తూ హాట్ టాపిక్ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా అషు రెడ్డి ప్రెగ్నెంట్ అంటూ ఓ వీడియో బయటకు వచ్చింది. అంతేకాదు, ఆమెను వాళ్ల అమ్మ పిచ్చ కొట్టుడు కొట్టింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం!

జూనియర్ సమంత.. సినిమా ఎంట్రీ

జూనియర్ సమంత.. సినిమా ఎంట్రీ

చాలా కాలం క్రితమే డబ్‌స్మాష్ వీడియోల ద్వారా అషు రెడ్డి విపరీతంగా పాపులర్ అయింది. చూడ్డానికి అచ్చం స్టార్ హీరోయిన్ సమంతలా ఉండడంతో ఈమెను కొన్ని లక్షల మంది ఫాలో అయ్యేవారు. అలా అప్పట్లోనే ఈ బ్యూటీ ఫేమస్ అయింది. దీంతో 'ఛల్ మోహనరంగ' అనే మూవీ ఛాన్స్ పట్టేసింది. అయితే, ఈ మూవీ తర్వాత ఆమెకు అవకాశాలు వచ్చినా ఒప్పుకోలేదు.

బిగ్ బాస్‌తో రీఎంట్రీ ఇచ్చిన బ్యూటీ

బిగ్ బాస్‌తో రీఎంట్రీ ఇచ్చిన బ్యూటీ

'ఛల్ మోహనరంగ' తర్వాత అషు రెడ్డి విదేశాలకు వెళ్లింది. అప్పటి నుంచి చాలా కాలం పాటు ఆమె పెద్దగా కనిపించలేదు. కానీ, సోషల్ మీడియా ద్వారా యాక్టివ్‌గా ఉండేది. ఈ క్రమంలోనే బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ద్వారా రీఎంట్రీ ఇచ్చింది. అయితే, గతంలో కంటే బొద్దుగా మారింది. దీని వెనుక ఫెయిల్యూర్ లవ్ స్టోరీ ఉందని చెప్పి అందరినీ అవాక్కయ్యేలా చేసింది.

వాళ్లతో లవ్ ట్రాకులు... ఫుల్ ఫేమస్

వాళ్లతో లవ్ ట్రాకులు... ఫుల్ ఫేమస్

కొంత కాలంగా అషు రెడ్డి తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. బిగ్ బాస్ షో తర్వాత రాహుల్ సిప్లీగంజ్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు కనిపించిన ఈ బ్యూటీ.. అతడితో డేట్‌కు వెళ్లడం పార్టీలు చేసుకోవడం వంటివి చేసేది. ఆ తర్వాత ప్రముఖ కమెడియన్ ఎక్స్‌ప్రెస్ హరితో లవ్వాట కొనసాగిస్తున్నట్లు కలరింగ్ ఇచ్చింది. అతడికి ఓ కాస్ట్లీ బైక్‌ను కూడా కొనిచ్చి డౌట్లను పెంచేసింది.

ఆ షోలలో రచ్చ చేస్తున్న అషు రెడ్డి

ఆ షోలలో రచ్చ చేస్తున్న అషు రెడ్డి

బుల్లితెరపై అషు రెడ్డి వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. ఇందులో భాగంగానే 'కామెడీ స్టార్స్' షోలో రచ్చ చేస్తోంది. ఇందులో ఎక్స్‌ప్రెస్ హరి టీమ్‌లో స్కిట్లు చేస్తోంది. అదే సమయంలో 'హ్యాపీ డేస్' అనే షోతో యాంకర్‌గానూ మారింది. ఇందులో ప్రస్తుతం నిఖిల్‌తో కలిసి సందడి చేస్తోంది. వీటితో పాటు అషు రెడ్డి కొన్ని స్పెషల్ ఈవెంట్లు, షోలలో గెస్టుగానూ వస్తోంది.

అందులో మాత్రం ఎప్పుడూ బిజీగా

అందులో మాత్రం ఎప్పుడూ బిజీగా

అషు రెడ్డి సోషల్ మీడియాలో చేసే హడావిడి అంతా ఇంతా కాదు. దీని ద్వారానే తన ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్‌లో ఉండే ఈ బ్యూటీ.. అప్పుడప్పుడు ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ తెగ సందడి చేస్తోంది. మరీ ముఖ్యంగా పవన్ కల్యాణ్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ పోస్టులు పెడుతోంది. దీంతో ఈమెను ఫాలో అయ్యే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది.

గర్భవతి అంటూ వీడియోతో సందడి

గర్భవతి అంటూ వీడియోతో సందడి

అషు రెడ్డి తరచూ యూట్యూబ్‌లో సైతం వీడియోలను అప్‌లోడ్ చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే తాజాగా తన ఛానెల్‌లో గర్భవతి అయ్యానంటూ ఓ వీడియోను వదిలింది. వాస్తవానికి ఆమె తన తల్లి దగ్గర ప్రాంక్ వీడియోను ప్లాన్ చేసింది. అందుకు అనుగుణంగానే భయపడుతున్నట్లు నటిస్తూ ప్రెగ్నెంట్ అయ్యానని ఆమెకు చెప్పింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Recommended Video

#Spirit : ఆ సినిమా బడ్జెట్‌లో సగం ప్రభాసే తీసుకుంటున్నాడట! || Filmibeat Telugu
పిచ్చకొట్టుకు కొట్టిన తల్లి.. వీడియో

పిచ్చకొట్టుకు కొట్టిన తల్లి.. వీడియో

అషు రెడ్డి ప్రెగ్నెంట్ అయ్యానంటూ ప్రాంక్ వీడియో చేయడంతో వాళ్ల అమ్మ ఇది నిజమేనని నమ్మేశారు. ఇంకేముంది కూతురిని పిచ్చ కొట్టుడు కొట్టారు. చేత్తో కాలితో తన్నుతూ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. చివరికి తన భర్తకు కాల్ చేస్తానంటూ ఫోన్ తీసుకుని వచ్చారు. దీంతో అషు రెడ్డి ఇదంతా ప్రాంక్ అని చెప్పేసింది. అయినప్పటికీ ఆమె చాలా సేపు సీరియస్ అవుతూనే ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X