For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అషుతో డేటింగ్ గురించి రాహుల్ కామెంట్స్… ఏడుస్తున్నానంటూ అషు ఎమోషనల్!

  |

  బిగ్ బాస్ సీజన్ 3 విజేత కావడంతో రాహుల్ సిప్లిగంజ్ కి బాగా కలిసొచ్చింది. ఎందుకంటే బిగ్ బాస్ కి వెళ్ళడానికి ముందు దాకా చాలా సినిమాల్లో పాటలు పాడిన రాహుల్ తెర వెనుకే ఉండిపోయాడు తప్పితే.. తెరపైకి వచ్చింది లేదు. కానీ బిగ్ బాస్ సీజన్ విజేత కావడంతో రాహుల్ సిప్లిగంజ్ క్రేజ్ మరింత పెరిగింది. నిజానికి ఒకరకంగా చెప్పాలంటే బిగ్ బాస్ షోకి వెళ్లడం ద్వారా లాభపడి.. ఆఫర్లు దక్కించుకున్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా? అంటే అది రాహుల్ సిప్లిగంజ్ మాత్రమే అని చెప్పక తప్పదు.

  అప్పుడు పునర్నవి

  అప్పుడు పునర్నవి

  ఇక హౌస్ లో ఉండగా పునర్నవితో లవ్ ట్రాక్ నడిపిన రాహుల్ బయటకు వచ్చాక మాత్రం ఆమెతో పెద్దగా కనిపించింది లేదు. అనూహ్యంగా అషురెడ్డితో ఎక్కువగా కనిపిస్తూ ఆమెతో ఫోటోలు పెడుతూ తమ మధ్య ఏదో ఉందనే భ్రమ కల్పించడంలో సక్సెస్ అయ్యారు. తాజాగా వీరిద్దరి డేటింగ్ కి సంబంధించి రాహుల్ కామెంట్స్ చేయగా దానికి అషురెడ్డి ఆసక్తికరంగా స్పందించింది. ఆ వివరాల్లోకి వెళితే.

  అషురెడ్డితో ప్రేమలో ఉన్నాడేమో

  అషురెడ్డితో ప్రేమలో ఉన్నాడేమో

  బిగ్ బాస్ కంటెస్టెంట్ రాహుల్ సిప్లిగంజ్ తనతో పాటు హౌస్ మెట్ అయిన అషురెడ్డితో ప్రేమలో ఉన్నాడేమో అనిపించేలా వీరిద్దరూ తమ తమ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వివిధ రకాల పోస్టులు పెట్టారు. దానికి ఊతం ఇచ్చే లాగా వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు, అలాగే అషురెడ్డిని రాహుల్ సిప్లిగంజ్ ఎత్తుకున్న ఫోటోలు సైతం వైరల్ అయ్యాయి. ఆ మధ్య ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో సైతం ఈ ఇద్దరు పాల్గొని మరింత సందేహాలు పెంచారు.

   రిలేషన్ గురించి ఓపెన్

  రిలేషన్ గురించి ఓపెన్

  ఆ ఇంటర్వ్యూలో తమ రిలేషన్ గురించి ఓపెన్ అయ్యారు. ఇద్దరం స్పెషల్ ఫ్రెండ్స్ అని చెప్పుకున్నారు. అయితే అదే షోలో రాహుల్ కోసం ‘పిలగా.. పిలగా.. భూలోకం మొత్తంలో నువ్వే నాకు తోడు.. నీ కోసం వచ్చేస్తా ఎందాకైనా చూడు.. ఇక ఇద్దరమూ ఆడేద్దామూ క్రేజీగా ఈ షోలో' అంటూ పాట పాడింది అషు రెడ్డి. ఆ తర్వాత రాహుల్ ఆమెను దగ్గరకు తీసుకుని ఇంటర్వ్యూ మధ్యలో హగ్ ఇచ్చాడు. నా కోసం అషు రెడ్డి.. పిలగా అని పాట పాడుతుంటే నా హార్ట్ బీట్ రైజ్ అయిపోతుంది.. అంటూ చెప్పడం ఆ తర్వాత ఇద్దరి మధ్య ఏముంది అని అడిగితే ‘కెమిస్ట్రీ చదువుకుంటున్నాం.. ఫిజిక్స్ అనుకుంటున్నాం.. హిస్టరీలు రిపీట్ చేసుకుంటున్నాం..' అని రాహుల్ చెప్పడం వీరి మధ్య ఏదో ఉందనే సందేహాలు పెంచింది.

  అషు రెడ్డి చాలా స్పెషల్

  అషు రెడ్డి చాలా స్పెషల్

  అలాగే తాజాగా మరో ఇంటర్వ్యూలో రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ తనకు అషు రెడ్డి చాలా స్పెషల్ అని చెప్పుకొచ్చాడు. ఆమె చూపించే కేరింగ్ అంటే తనకు ఇష్టమని పేర్కొన్నారు. చూడడానికి ఒక బొమ్మలాగా ఉంటుంది కానీ ఆమె మనసు చాలా మంచిది అని చెప్పుకొచ్చాడు. తమ మధ్య డేటింగ్ లాంటిది ఏమీ లేదని తాను ఇద్దరు స్నేహితులు అని ఆయన చెప్పుకొచ్చాడు. ఇక ఆయన చేసిన కామెంట్స్ కు అషురెడ్డి ఆసక్తికరంగా స్పందించింది. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఆమె ఈ వీడియోని మెన్షన్ చేసి థాంక్యూ నాకు ఏడుపు వచ్చేస్తుంది నువ్వు ఎప్పటికీ స్పెషల్ రాహుల్ అంటూ చెప్పుకొచ్చింది.

  Akhanda Movie తో మరో స్టార్ హీరో కి లైఫ్ ఇవ్వబోతున్న బాలయ్య బాబు!! || Filmibeat Telugu
  ఇద్దరూ బిజీ బిజీ

  ఇద్దరూ బిజీ బిజీ

  ఇక ఇటీవల రవి - శ్యామల హోస్ట్ చేసిన బిగ్ సెలెబ్రిటీ ఛాలెంజ్ షోలో రాహుల్ కనిపించారు. ఈ కార్యక్రమంలో రాహుల్‌తో పాటు బిగ్ బాస్ సీజన్ 2 విజేత కౌశల్ కూడా ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. మరో పక్క ప్లేబ్యాక్ సింగర్ గా కూడా రాహుల్ చాలా బిజీగా ఉన్నాడు. అలాగే నటుడిగా కూడా తన వెండితెరపైకి రావడానికి చూస్తున్నారు. అలానే ఇటీవల తన దుస్తుల బ్రాండ్‌ 'ఊకోకాక'ను ప్రారంభించాడు. ఇక మరో పక్క అషు కూడా నాన్-ఫిక్షన్ షో 'హ్యాపీ డేస్'తో హోస్ట్‌గా అరంగేట్రం చేసింది. అలానే కామెడీ స్టార్స్ అనే కామెడీ షోలో ఆమె కనిపిస్తోంది.

  English summary
  Bigg Boss Telugu 3 fame Ashu Reddy and Rahul Sipligunj are again news. In one of his recent interviews, Rahul Sipligunj was all praises for Ashu and how she is 'the best' he has seen. She wrote, "Thank you I'm crying You're always special sipligunjrahul in her instagram status.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X