For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అతడితో కలిసి రెచ్చిపోయిన అషు రెడ్డి: గాల్లో తేలుతూ రొమాంటిక్‌గా.. ముద్దులు పెడుతూ రచ్చ

  |

  అషు రెడ్డి.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. అంతలా ఈ బ్యూటీ పేరు చాలా కాలంగా మారుమ్రోగిపోతోంది. సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ చిన్నది.. చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును అందుకుంది. ఫలితంగా పలు సినిమాలతో పాటు బిగ్ బాస్ ఆఫర్‌ను కూడా పట్టేసింది. దీంతో ఎంతో ఫేమస్ అయింది. ఇక, ఈ మధ్యే యాంకర్‌గానూ మారింది. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఓ షోలో అషు రెడ్డి రెచ్చిపోయింది. రొమాంటిక్‌గా గాల్లో తేలుతూ ముద్దులు కూడా పెట్టేసింది. అసలేం జరిగింది? ఆ పూర్తి వివరాలు మీ అందరి కోసం!

   అలా వెలుగులోకి.. సమంత పేరుతో

  అలా వెలుగులోకి.. సమంత పేరుతో

  చాలా కాలం క్రితం డబ్‌స్మాష్ వీడియోలు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. వీటి వల్లే అషు రెడ్డి ఎనలేని క్రేజ్‌ను దక్కించుకుంది. అంతేకాదు, జూనియర్ సమంతగానూ ఆమె పేరును తెచ్చుకుంది. ఆ తర్వాత యూత్ స్టార్ నితిన్ నటించిన ‘ఛల్ మోహనరంగ'లో కీలక పాత్రలో కనిపించి మెప్పించింది. దాని తర్వాత బిగ్ బాస్ మూడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి మరింత హైలైట్ అయింది.

  వరుస ఆఫర్లు... అందులో ఆర్టిస్టుగా

  వరుస ఆఫర్లు... అందులో ఆర్టిస్టుగా

  అషు వరుస షోలతో బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం ‘కామెడీ స్టార్స్' ద్వారా బుల్లితెరపైనా అషు రెడ్డి బిజీ అయింది. ఇందులో హీరోయిన్ శ్రీదేవి, శేఖర్ మాస్టర్ జడ్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో ఈ అమ్మడు తన అందచందాలను చూపించడంతో పాటు కామెడీని కూడా పంచుతూ సందడి చేస్తోంది. ఇందులో ఎక్స్‌ప్రెస్ హరితో అషు రెడ్డి లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు చూపిస్తున్నారు.

   అషు రెడ్డి కొత్త అవతారం.. అదిరింది

  అషు రెడ్డి కొత్త అవతారం.. అదిరింది

  ఇప్పటి వరకూ నటిగానే కనిపించిన అషు రెడ్డి.. ఇటీవలే యాంకర్‌గా కొత్త అవతారం ఎత్తింది. ప్రస్తుతం ఆమె యాంకర్ రవితో కలిసి ‘హ్యాపీ డేస్' అనే షో చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి ఎక్స్‌ప్రెస్ హరి స్క్రిప్టు రైటర్‌గా పని చేస్తుండగా.. జబర్ధస్త్ అజయ్ కీలక పాత్రను చేస్తున్నాడు. స్టూడెంట్స్‌తో కలసి నడిచే ఈ షో కొద్ది రోజుల క్రితమే మొదలైంది. దీనికి మంచి రెస్పాన్స్ వస్తుంది.

  యాంకర రవితో కలిసి రచ్చ చేస్తుంది

  యాంకర రవితో కలిసి రచ్చ చేస్తుంది

  ఇక, ‘హ్యాపీ డేస్' షోలో అషు రెడ్డి తనదైన పంచులతో సత్తా చాటుతోంది. యాంకర్‌గా చేసేది మొదటిసారే అయినప్పటికీ తనదైన శైలి హోస్టింగ్‌తో అలరిస్తోంది. అంతేకాదు, యాంకర్ రవితో కలిసి పాటలు, డ్యాన్సులతో రచ్చ రచ్చ చేస్తోంది. అలాగే, అప్పుడప్పుడూ డబుల్ మీనింగ్ డైలాగులను కూడా వదులుతూ అందరికీ షాక్ ఇస్తోంది. దీంతో అషు రెడ్డి పేరు బుల్లితెరపై మారుమ్రోగిపోతోంది.

  అందులో ఎప్పుడూ బిజీగానే ఉంటూ

  అందులో ఎప్పుడూ బిజీగానే ఉంటూ

  అషు రెడ్డి సోషల్ మీడియాలో ఎంత బిజీగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీని ద్వారానే ఫేమస్ అయిన ఈ బ్యూటీ.. ఈ మధ్య కాలంలో మరింతగా రెచ్చిపోతోంది. ఎక్కువగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను వెల్లడిస్తోంది. అదే సమయంలో తన అందచందాలను చూపిస్తూ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. తద్వారా ఫాలోవర్లను గణనీయంగా పెంచుకుంటోంది.

  Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
   అతడితో గాల్లో తేలుతూ.. ముద్దులు

  అతడితో గాల్లో తేలుతూ.. ముద్దులు

  తాజాగా అషు రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె యాంకర్ రవితో కలిసి రొమాంటిక్‌గా డ్యాన్స్ చేసింది. సామజవరగమన పాటకు అతడు ఏకంగా ఆమెను ఎత్తుకుని గాల్లో తిప్పేశాడు. దీనికి రొమాంటిక్‌గా స్పందించింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి కెమెరా ముందుకు వచ్చి ముద్దులు విసిరారు. దీంతో ఈ వీడియోను భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది.

  English summary
  Telugu Actress and model Ashu Reddy Now Doing Happy Days Daily Show. In This Show She Did Romantic Dance with Anchor Ravi
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X