Ashu Reddy అందాల విందు: గతంలో ఎన్నడూ చూడని విధంగా.. సెక్సీ అంటే ఇదేనంటూ చూపేట్టేసింది
అషు రెడ్డి.. తెలుగు రాష్ట్రాల జనాలకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా ఈ అమ్మడు దాదాపు ఐదేళ్లుగా అటు సోషల్ మీడియాలోనూ.. ఇటు టీవీ షోలు, సినిమాల్లోనూ నటిస్తూ మెప్పిస్తోంది. అదే సమయంలో అందాలతో కనువిందు చేస్తోంది. తద్వారా మరింత ఎక్కువగా ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా అషు రెడ్డి కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. గతంలో ఎన్నడూ చూడని విధంగా ఇందులో అందాలను ఆరబోసింది. ఫలితంగా ఈ పిక్స్ కొంత సమయంలోనే వైరల్ అయిపోయాయి. ఇంకెందుకు ఆలస్యం వాటిని మీరూ చూడండి!

ఆ వీడియోలతో ఫేమస్ అయిన అషు
ఇండియా మొత్తంగా డబ్‌స్మాష్ వీడియోలు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. అప్పట్లో ఈ యాప్ వాడని వారు ఉండరు అన్నంతగా దీని ప్రభావం కనిపించింది. వీటి ద్వారానే అషు రెడ్డి వెలుగులోకి వచ్చింది. చూడ్డానికి అచ్చం సమంతలా ఉండే ఆమెకు జూనియర్ సామ్ అనే బిరుదు వచ్చింది. దీంతో మరింతగా రెచ్చిపోయి వీడియోలు చేసింది. తద్వారా యమ ఫేమస్ అయింది.

బిగ్ బాస్‌తో బ్రేక్.. ఫుల్ బిజీ అయింది
యూత్ స్టార్ నితిన్ నటించిన 'ఛల్ మోహనరంగ'లో కీలక పాత్రలో కనిపించి మెప్పించింది అషు. ఆ తర్వాత అమెరికా వెళ్లిపోయింది. అక్కడ కొన్నేళ్లు ఆనందంతో పాటు కష్టాలను అనుభవించిన తర్వాత బిగ్ బాస్ షో కోసం తిరిగి హైదరాబాద్‌లో అడుగు పెట్టింది. ఇందులో ఎంతో బొద్దుగా కనిపించిన ఈ బ్యూటీ.. గ్లామర్ పరంగా ఆకట్టుకుంది. తద్వారా ఫుల్ బిజీ అయిపోయింది.

పవన్ టాటూతో ఒక్కసారిగా పాపులర్
తరచూ ఏదో రకంగా హాట్ టాపిక్ అవుతూ వస్తోంది అషు రెడ్డి. ఈ క్రమంలోనే ఆ మధ్య పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పేరు తన ప్రైవేటు పార్టులో టాటూ వేయించుకుని చూపించిన ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల ఆయనను కలిసిన విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. ఆ సమయంలోనే నెటిజన్ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం చెప్పి బుక్కైంది. దీంతో ఒక్కసారిగా పాపులర్ అయింది.

ఆ స్టార్స్‌తో కలిసి కామెడీని చేస్తుందిగా
స్టార్ మాలో 'కామెడీ స్టార్స్' అనే షో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఇందులో అప్పటి హీరోయిన్ శ్రీదేవి, శేఖర్ మాస్టర్ జడ్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. వర్షిణి యాంకరింగ్ బాధ్యతలు నిర్వహిస్తోంది. అవినాష్, చమ్మక్ చంద్ర, జోర్ధార్ సుజాతతో పాటు అషు రెడ్డి కూడా ఇందులో హల్‌చల్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఎక్స్‌ప్రెస్ హరికి హగ్గులు, ముద్దులు ఇచ్చి హైలైట్ అయిపోయింది.

మరో యాంగిల్ చూపిస్తున్న అషు రెడ్డి
ఇంత కాలం ఆర్టిస్టుగా మెప్పించిన అషు రెడ్డి.. 'హ్యాపీ డేస్' అనే షోతో యాంకర్‌గా మారిపోయింది. ఇందులో యాంకర్ రవితో కలిసి ఆమె చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. దీనికి ఎక్స్‌ప్రెస్ హరి స్క్రిప్టు రైటర్‌గా పని చేస్తుండగా.. ముక్కు అవినాష్ సోదరుడు అజయ్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఈ షో ద్వారా తనలోని కొత్త యాంగిల్‌ను చూపిస్తూ దూసుకుపోతోందీ గ్లామర్ క్వీన్.

హాట్ ఫొటోలను షేర్ చేసిన బోల్డ్ పాప
అషు రెడ్డి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతలా ఈ బ్యూటీ ప్రతిరోజూ ఏదో ఒక అప్‌డేట్‌తో సందడి చేస్తోంది. అదే సమయంలో నిత్యం హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతూ అందాల విందు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని గ్లామరస్ పిక్స్‌ను షేర్ చేసింది. వీటికి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది.
Recommended Video

సెక్సీ అంటే ఇదేనంటూ చూపెట్టేసింది
అషు రెడ్డి తాజాగా షేర్ చేసిన ఫొటోల్లో ఆమె చేతులు పైకి లేపి ఎద అందాలతో కనువిందు చేస్తోంది. గతంలో ఎన్నడూ చూడని విధంగా ఇందులో ఆమె కనిపిస్తోంది. ఇక, ఈ పిక్స్‌కు 'సెక్సీ అంటే ఆకారం మాత్రమే కాదు.. అదో యాటిట్యూడ్' అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. ఫలితంగా ఇవి వైరల్ అయిపోతున్నాయి.


Click it and Unblock the Notifications











