For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అవి చూపిస్తూ రెచ్చిపోయిన అషు రెడ్డి: బోర్ కొడుతుందని ఏకంగా అలాంటి ఫొటో షేర్ చేసిన బ్యూటీ

  |

  ఇంటర్నెట్ వినియోగం పెరిగిన తర్వాత ఎంతో మంది దాన్ని తమ టాలెంట్లను బయట పెట్టుకునేందుకు ఉపయోగిస్తున్నారు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది అమ్మాయిలు అందంతో, అభినయంతో ఆకట్టుకుంటున్నారు. తద్వారా ఎనలేని క్రేజ్‌ను అందుకుంటూ దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో తెలుగు బ్యూటీ అషు రెడ్డి ఒకరు. చాలా కాలంగా తన హవాను చూపిస్తోన్న ఈ బ్యూటీ.. రెండు రాష్ట్రాల్లో ఫుల్ ఫేమస్ అయిపోయింది. ఈ నేపథ్యంలోనే తాజాగా తన తొడలను చూపిస్తూ దిగిన ఫొటోను షేర్ చేసింది. ఆ వివరాలు మీకోసం!

   జూనియర్ సమంతగా అషు రెడ్డి ఫేమస్

  జూనియర్ సమంతగా అషు రెడ్డి ఫేమస్

  అప్పట్లో డబ్‌స్మాష్ వీడియోలు ఎంతటి సందడి చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాటి ద్వారానే అషు రెడ్డి ఫేమస్ అయింది. దీనికి కారణం ఆమె చూడ్డానికి అచ్చం సమంతలా ఉండడమే. దీని వల్లే ఈ బ్యూటీకి జూనియర్ సమంత అనే పేరు వచ్చింది. ఫలితంగా ఎనలేని క్రేజ్ ఆమె సొంతం అయింది. తద్వారా నితిన్ నటించిన ‘ఛల్ మోహనరంగ'లో కీలక పాత్రలో నటించి మెప్పించింది.

  బిగ్ బాస్ షో తర్వాత మారిపోయిన కెరీర్

  బిగ్ బాస్ షో తర్వాత మారిపోయిన కెరీర్

  కేవలం ఒక్క సినిమా మాత్రమే చేసిన తర్వాత అమెరికా వెళ్లిపోయింది అషు రెడ్డి. అక్కడ ఉద్యోగం చేస్తున్న సమయంలో ఓ వ్యక్తితో ప్రేమలో పడడం.. ఆ తర్వాత బ్రేకప్ అవడం.. దీంతో ఆమె డిప్రెషన్‌కు గురవడం అయింది. అలాంటి సమయంలోనే బిగ్ బాస్ షో ద్వారా రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో గెలవకపోయినా మళ్లీ వార్తల్లో నిలిచింది. తద్వారా వరుస ఆఫర్లు అందుకుంటోంది.

  సెన్సేషన్‌గా మారిన అషు.. పవన్ టాటూ

  సెన్సేషన్‌గా మారిన అషు.. పవన్ టాటూ

  అషు రెడ్డి వ్యవహరించే తీరు తరచూ ఆమెను వార్తల్లో నిలిచేలా చేస్తోంది. గతంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పేరు తన ప్రైవేటు పార్టులో టాటూ వేయించుకుని చూపించిన ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల ఆయనను కలిసిన విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. ఆ సమయంలోనే నెటిజన్ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం చెప్పి బుక్కైంది. దీంతో రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది.

  కామెడీ స్టార్స్‌తో కలిసి బ్యూటీ హంగామా

  కామెడీ స్టార్స్‌తో కలిసి బ్యూటీ హంగామా

  స్టార్ మాలో ‘కామెడీ స్టార్స్' అనే షో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఇందులో అప్పటి హీరోయిన్ శ్రీదేవి, శేఖర్ మాస్టర్ జడ్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. వర్షిణి యాంకరింగ్ బాధ్యతలు నిర్వహిస్తోంది. అవినాష్‌, చమ్మక్ చంద్ర, జోర్ధార్ సుజాతతో పాటు అషు రెడ్డి కూడా ఇందులో హల్‌చల్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఎక్స్‌ప్రెస్ హరికి హగ్గులు, ముద్దులు ఇచ్చి హైలైట్ అయిపోయింది.

  Popular Telugu YouTube Host #TNR Lost Life | Filmibeat Telugu
   యాంకర్‌గా మారిన అషు... రవితో కలిసి

  యాంకర్‌గా మారిన అషు... రవితో కలిసి

  అషు రెడ్డి.. యాంకర్ రవితో కలిసి ‘హ్యాపీ డేస్' అనే షో చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి ఎక్స్‌ప్రెస్ హరి స్క్రిప్టు రైటర్‌గా పని చేస్తుండగా.. ముక్కు అవినాష్ సోదరుడు అజయ్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. దీంతో వీళ్లంతా ఇటీవల లైవ్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్స్‌ప్రెస్ హరి తనకు అన్నయ్య లాంటి వాడని చెప్పి లవ్ ట్రాక్ పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టేసింది అషు రెడ్డి.

  లాక్‌డౌన్‌లో బోర్ కొడుతుందని చెబుతూ

  లాక్‌డౌన్‌లో బోర్ కొడుతుందని చెబుతూ

  ఎప్పుడూ ఏదో ఒక షో షూటింగ్‌తోనో.. పబ్బులు, పార్టీలతో బిజీగా గడుపుతోన్న అషు రెడ్డి.. లాక్‌డౌన్ కారణంగా ఖాళీగా ఉంటోంది. దీంతో తరచూ తన స్నేహితులతో కలిసి ఇంట్లోనే గేమ్స్ కూడా ఆడుకుంటోంది. వాటికి సంబంధించిన ఫొటోలను సైతం షేర్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా లాక్‌డౌన్ వల్ల తనకు బోర్ కొడుతుందని చెబుతూ అషు రెడ్డి ఓ పోస్టును పెట్టింది.

   అవి చూపిస్తూ రెచ్చిపోయిన అషు రెడ్డి

  అవి చూపిస్తూ రెచ్చిపోయిన అషు రెడ్డి

  సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అషు రెడ్డి.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఫొటోను పోస్ట్ చేసింది. ఇందులో ఆమె కేవలం ఓ టీ షర్ట్ మాత్రమే ధరించి కనిపించింది. ఫలితంగా ఆమె తొడలు దర్శనమిచ్చాయి. అంతేకాదు, దీనికి ‘లాక్‌డౌన్ వల్ల బోర్ కొడుతోంది' అనే క్యాప్షన్ కూడా పెట్టింది. దీంతో అషు రెడ్డి తీరుపై అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

  English summary
  Telugu Actress and model Ashu Reddy Full Busy in Social Media. Now She Shared a Thighs Show Photo in Her Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X