Ashu Reddy:సమంత లాంటి డ్రెస్ లో జూనియర్ సమంత.. అషు రెడ్డి ఫొటోలు వైరల్

మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారంటారు. ఇలా మనకు సోషల్ మీడియా వచ్చాక మనకు ఒక మనిషిని పోలిన మరో మనిషిలాంటి వాళ్లు ఎందరో కనిపిస్తున్నారు. అలాగే మనం అచ్చం సెలబ్రిటీల్లా ఉండే వ్యక్తులను కూడా చూశాం. అలాంటి వారిలో బిగ్ బాస్ కంటెస్టెంట్ అషు రెడ్డి ఒకరు. అషు రెడ్డి చూడటానికి అచ్చం స్టార్ హీరోయిన్ సమంతలా ఉంటుందన్న విషయం తెలిసిందే. అషురెడ్డి.. సమంతలా ఉండటం వల్లే చాలా పాపులర్ అయింది. తర్వాత బిగ్ బాస్ లో ఆడి, సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో మరింతగా క్రేజ్ సంపాందించుకుంది. అయితే తాజాగా ఫారెన్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న అషు రెడ్డి అచ్చం సమంతలాంటి డ్రెస్ వేసుకుని కనువిందు చేసింది.

ఇన్ స్టా గ్రామ్, టిక్ టాక్ లేని సమయంలో ఎక్కువగా పాపులర్ అయినవి డబ్‌స్మాష్ వీడియోలు. ఈ డబ్ స్మాష్ ల ద్వారా వెలుగులోకి వచ్చిన అచ్చమైన తెలుగు అందం అషు రెడ్డి. ఇలా ఫేమ్ అయిన అషు రెడ్డి చూడటానికి అచ్చం స్టార్ హీరోయిన్ సమంతలా ఉండి యాక్టివ్ గా డబ్‌స్మాష్ వీడియోస్ చేసేసరికి నెటిజన్లు ఫుల్ ఫిదా అయిపోయారు. దీంతో ఒక్కసారిగా ఆమెను పాపులర్ చేసేశారు.

Ashu Reddy Share Latest Photos In Pink Colour Dress Looks Like Samantha

అప్పటి నుంచి ఇప్పటి వరకు అషు రెడ్డిని బుల్లితెర సమంత, జూనియర్ సమంత అని కూడా పిలుస్తారు. అషు రెడ్డి ఇలా అచ్చం సమంతలా కనిపించడం, చలాకీగా మాట్లాడటంతో ఆమె క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో అషు రెడ్డికి వరుసగా ఆఫర్లు రావడం స్టార్ట్ అయింది. తాజాగా ఫోకస్ అనే చిత్రంలో నటించింది ఈ బ్యూటి. సుహాసిని ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో అషు రెడ్డి పోలీస్ ఆఫీసర్ గా ఆకట్టుకుంది.

Ashu Reddy Share Latest Photos In Pink Colour Dress Looks Like Samantha

ఇక స్టార్ హీరోయిన్ సమంత తాజాగా నటించిన చిత్రం యశోద. ఈ మూవీ నవంబర్ 11న అంటే రేపు గ్రాండ్ గా విడుదల కాబోతుంది. సోషల్ మీడియాలో కొంతకాలం కనుమరుగైపోయన తనకు ఉన్న వ్యాధి గురించి అందరినీ షాక్ గు గురిచేసింది. సమంతకు మయోసిటిస్ అనే ఇమ్యునల్ డిసీస్ ఉన్నట్లు యశోద ట్రైలర్ కు వచ్చిన రెస్పాన్స్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ విషయం చెప్పింది.

సమంత తన వ్యాధి గురించి చెప్పడంతో యావత్ సినీ లోకం బాధపడింది. ఆమె త్వరగా కోలుకోవాలని సెలబ్రిటీలు, నెటిజన్లు కోరుకుంటున్నారు. అయితే ఈ పోస్ట్ కంటే ముందుగా ఒక అడ్వర్టైజ్ మెంట్ లో నటించింది సమంత. పెట్ డాగ్స్ కు సంబంధించిన ఫుడ్ యాడ్ లో దర్శనమిచ్చింది సమంత. ఇందులో సామ్.. బ్లాక్ స్లీవ్ లెస్ డ్రెస్ లో తన ఎద భాగాలు కనిపించేలా గ్లామర్ తో అట్రాక్ట్ చేసింది.

Ashu Reddy Share Latest Photos In Pink Colour Dress Looks Like Samantha

ఈ యాడ్ లో సమంత లుక్ చాలా మారిపోయిందని వార్తలు కూడా వచ్చాయి. అయితే తాజాగా అచ్చం ఇలాంటి డిజైనర్ డ్రెస్ లో జూనియర్ సమంత అదేనండి అషు రెడ్డి దర్శనమిచ్చింది. అయితే సామ్ వేసుకుంగి బ్లాక్ కలర్ అయితే ఈ బిగ్ బాస్ బ్యూటి మాత్రం పింక్ కలర్ లో హాట్ గా కనువిందు చేసింది. గత కొద్దిరోజులుగా ఫారెన్ లో ఎంజాయ్ చేస్తున్న అషు రెడ్డి తరచుగా ఘాటు ఫొటోలు పెడుతూ యూత్ ను అట్రాక్ట్ చేస్తోంది.

పింక్ కలర్ డ్రెస్ లో హాట్ హాట్ గా ఎద అందాలను ప్రదర్శించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది బోల్డ్ బ్యూటి అషు రెడ్డి. ఈ పోస్ట్ కు హల్లో యూఎస్ఏ.. తిరిగి కుటుంబం దగ్గరికి రావడం చాలా బాగుంది అని క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఎందుకంటే సమంత లాంటి డ్రెస్ నే అషు రెడ్డి వేసుకోవడం, మళ్లీ ఆమె సామ్ లా కనపడంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X