మొబైల్ నెంబర్ షేర్ చేసిన అషు రెడ్డి: ఫోన్ చేయండి.. నన్ను కలవండి అంటూ ఆఫర్ ఇచ్చిన బ్యూటీ

సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది తెలుగు అమ్మాయిలు ఫుల్ పాపులర్ అయిపోయారు. తద్వారా వరుసగా ఆఫర్లను అందుకుంటూ ఎనలేని గుర్తింపును అందుకున్నారు. అలాంటి వారిలో విశాఖపట్నం పిల్ల అషు రెడ్డి ఒకరు. చాలా కాలం క్రితమే ఫేమస్ అయిన ఈ భామ.. అందంతో పాటు అభినయంతో ప్రేక్షకులను ఫిదా చేసేస్తోంది. ఫలితంగా ఇప్పుడు వరుస షోలతో ఫుల్ బిజీ అయిపోయింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఓ షోలో యాంకర్‌గానూ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా అషు రెడ్డి ఓ ఫోన్ నెంబర్‌ను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీ అందరి కోసం!

అలా పరిచయం.. ఇలా పాపులారిటీ

అలా పరిచయం.. ఇలా పాపులారిటీ

అప్పట్లో డబ్‌స్మాష్ వీడియోలు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. వీటి వల్ల ఎంతో మంది అమ్మాయిలు ఫుల్ ఫేమస్ అవగా.. అందులో అషు రెడ్డి ఒకరు. ఈ వీడియాల ద్వారా ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకున్న ఈ బ్యూటీ.. జూనియర్ సమంతగా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత యూత్ స్టార్ నితిన్ నటించిన 'ఛల్ మోహనరంగ'లో కీలక పాత్రలో కనిపించి మెప్పించిందీ బ్యూటీ.

బిగ్ బాస్ ఆఫర్‌తో మారిపోయిందిగా

బిగ్ బాస్ ఆఫర్‌తో మారిపోయిందిగా

ఒక్క సినిమా చేసిన తర్వాత తెలుగు వాళ్లకు దూరంగా వెళ్లిపోయింది అషు రెడ్డి. ఈ క్రమంలోనే అమెరికాలో ఉద్యోగం చేసింది. అప్పుడక్కడ ఓ వ్యక్తితో ప్రేమలో పడడం.. ఆ తర్వాత బ్రేకప్ అవడం.. దీంతో ఆమె డిప్రెషన్‌కు గురవడం జరిగింది. అలాంటి సమయంలోనే బిగ్ బాస్ షో ద్వారా రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో గెలవకపోయినా వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకెళ్తోంది.

పవన్ అభిమానిగా మరింత ఫేమస్

పవన్ అభిమానిగా మరింత ఫేమస్

అషు రెడ్డి పాపులర్ అవడానికి సోషల్ మీడియానే ప్రధాన కారణం. దాదాపు ఆరేడేళ్లుగా ఈ బ్యూటీ అందులో హల్‌చల్ చేస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా తన ప్రైవేటు పార్టులో పవన్ పేరుతో టాటూ వేయించుకుని చూపించిన ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల ఆయనను కలిసిన విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. అలాగే, దూకుడైన వ్యవహార శైలితో తరచూ వార్తల్లో నిలుస్తోందీ భామ.

 అతడితో లవ్ ట్రాక్.. సెన్సేషనల్‌గా

అతడితో లవ్ ట్రాక్.. సెన్సేషనల్‌గా

అషు రెడ్డి స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'కామెడీ స్టార్స్' రచ్చ చేస్తోంది. ఇందులో ఎక్స్‌ప్రెస్ హరితో రొమాన్స్ చేయడంతో వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే ఇటీవల లైవ్ చాట్‌లో హరి తనకు అన్నయ్య లాంటి వాడని చెప్పి పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టేసింది. అయినప్పటికీ తరచూ అనుమానాలు రేకెత్తేలా వ్యవహరిస్తూ వార్తల్లో నిలుస్తోంది.

 యాంకర్‌గా మారిపోయిన అషు రెడ్డి

యాంకర్‌గా మారిపోయిన అషు రెడ్డి

ఆర్టిస్టుగా సత్తా చాటిన అషు రెడ్డి.. ఇటీవలే యాంకర్‌గా కొత్త అవతారం ఎత్తింది. ప్రస్తుతం ఆమె యాంకర్ రవితో కలిసి 'హ్యాపీ డేస్' అనే షో చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి ఎక్స్‌ప్రెస్ హరి స్క్రిప్టు రైటర్‌గా పని చేస్తున్నాడు. ఇందులో మొదట రవితో, ఇప్పుడు నిఖిల్‌తో కలిసి కలిసి ఆమె రచ్చ రచ్చ చేస్తోంది. అలాగే, స్టూడెంట్స్‌తోనూ ఓ రేంజ్‌లో ఆడుకుంటూ తెగ సందడి చేస్తోంది.

సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది

సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది

సోషల్ మీడియాలో అషు రెడ్డి చేసే హడావిడి అంతా ఇంతా కాదు. దీని ద్వారానే తన ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్‌లో ఉండే ఈ బ్యూటీ.. అప్పుడప్పుడు ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ తెగ సందడి చేస్తోంది. అలాగే, అందాలు ఆరబోస్తూ దిగిన వాటిని కూడా వదులుతోంది. దీంతో ఈమెను ఫాలో అయ్యే వారి సంఖ్య ప్రతిరోజూ పెరుగుతూనే ఉంది. ఇలా అమ్మడు హైలైట్ అయిపోతోంది.

Recommended Video

Manu Charitra Trailer Preface Video | Shiva Kandukuri, Megha Akash
మొబైల్ నెంబర్ షేర్ చేసిన అషు

మొబైల్ నెంబర్ షేర్ చేసిన అషు

తాజాగా అషు రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ సమాచారం ఇస్తూ పోస్ట్ చేసింది. ఇందులో ఒక నెంబర్ ఇచ్చి.. 'వెంటనే దానికి రిజిస్టర్ అవండి. తద్వారా నన్ను కలవడంతో పాటు హ్యాపీ డేస్ షోలో పాల్గొనే అవకాశాన్ని అందుకోండి' అంటూ పేర్కొంది. దీంతో ఔత్సాహికులు అంతా ఆ నెంబర్‌కు కాల్ చేసి తమ పేర్లను రిజిస్టర్ చేసుకుంటుంది. దీంతో ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X