బాడీపై నేమ్ టాటూ చూపించిన అషు రెడ్డి: అంటే.. వీళ్లిద్దరి మధ్య నిజంగానే లవ్ ఉందా!

సోషల్ మీడియాలో రకరకాల యాప్‌లు అందుబాటులోకి రావడం వల్ల తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది అమ్మాయిలు ఫేమస్ అయ్యారు. తద్వారా ఇండస్ట్రీకి కూడా పరిచయం అయ్యారు. తద్వారా వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ హల్‌చల్ చేస్తున్నారు. అలాంటి వారిలో తెలుగు అమ్మాయి అషు రెడ్డి ఒకరు. తన అందచందాలతో ఇంటర్నెట్‌ను షేక్ చేసిన ఈ బ్యూటీ.. చాలా తక్కువ సమయంలోనే బిగ్ సెలెబ్రిటీగా ఎదిగిపోయింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా ముందుకెళ్తోంది. అదే సమయంలో తరచూ ఏదో ఒక పోస్టుతో రచ్చ రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా బాడీపై నేమ్ టాటూను చూపించింది అషు రెడ్డి. ఇంతకీ ఏం జరిగింది? ఆ సంగతులు మీకోసం!

జూనియర్ సమంతగా పాపులర్

జూనియర్ సమంతగా పాపులర్

చాలా రోజుల క్రితం డబ్‌స్మాష్ వీడియోలు ఎంత సందడి చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీని ద్వారా ఎంతో మంది ఫేమస్ అయ్యారు. అందులో అషు రెడ్డి కూడా ఒకరు. సమంతలా కనిపించే ఆమెకు లక్షల్లో ఫాలోవర్లు పెరిగారు. దీంతో ఈ భామ నితిన్ నటించిన 'ఛల్ మోహనరంగ' అనే మూవీ ఛాన్స్ పట్టేసింది. ఆ తర్వాత గ్యాప్ తీసుకుని మళ్లీ కెరీర్‌ను కొనసాగిస్తోంది.

బిగ్ బాస్‌లో రెండో సారి ఎంట్రీ

బిగ్ బాస్‌లో రెండో సారి ఎంట్రీ

బిగ్ బాస్ మూడో సీజన్‌లో అషు రెడ్డి కంటెస్టెంట్‌గా సందడి చేసిన విషయం తెలిసిందే. అందులో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయినా.. బయటకు వచ్చిన తర్వాత వరుసగా ఆఫర్లను అందుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు బిగ్ బాస్ నాన్ స్టాప్ షోలో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆరంభంలోనే ఈ బ్యూటీ అందరి దృష్టినీ ఆకర్షించి.. తన క్రేజ్‌ను మరింతగా పెంచుకుంది.

ఎక్స్‌ప్రెస్ హరితో లవ్ ట్రాకుతో

ఎక్స్‌ప్రెస్ హరితో లవ్ ట్రాకుతో

ఆ మధ్య వచ్చిన 'కామెడీ స్టార్స్‌' షోలో అషు రెడ్డి ఫుల్ టైమ్ ఆర్టిస్టుగా చేసింది. ఇందులో భాగంగానే ఇటీవల ఆమె ఎక్స్‌ప్రెస్ హరితో స్కిట్ చేసింది. ఇందులో అతడికి హగ్గులు, ముద్దులు పెట్టి అక్కడున్న వారితో పాటు ప్రేక్షకులను షాక్‌కు గురి చేసింది. ఆ తర్వాత కూడా అదే కంటిన్యూ చేసింది. దీంతో వీళ్ల మధ్య లవ్ ట్రాక్ సాగుతోందన్న టాక్ వినిపించిన విషయం తెలిసిందే.

టాటూ వేసుకోవడంతో మరింత

టాటూ వేసుకోవడంతో మరింత

ఎక్స్‌ప్రెస్ హరితో అషు రెడ్డి ప్రేమాయణం సాగిస్తుందన్న వార్తల నేపథ్యంలో.. అతడు తనకు అన్నయ్యలాంటి వాడని చెప్పి.. రిలేషన్‌పై క్లారిటీ ఇచ్చింది. కానీ, వీళ్లిద్దరూ మాత్రం స్కిట్లలో జంటగానే నటిస్తూ అనుమానాలు పెంచేశారు. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం ఎక్స్‌ప్రెస్ హరి తన ఛాతిపై అషు రెడ్డి పేరుతో పచ్చబొట్టు పొడిపించుకోవడంతో అనుమానాలు పెరిగాయి.

సోషల్ మీడియాలో రచ్చ షురూ

సోషల్ మీడియాలో రచ్చ షురూ

సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా అషు రెడ్డి చేసే సందడి గురించి తెలిసిందే. దీని ద్వారానే తన ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్‌లో ఉండే ఈ బ్యూటీ.. అప్పుడప్పుడు ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మరింతగా ఈ బ్యూటీ సందడి చేస్తూనే ఉంది. దీంతో అషు రెడ్డిని ఫాలో అయ్యే వారి సంఖ్య పెరగడంతో పాటు తరచూ ఆమె వార్తల్లో నిలుస్తోంది.

మరోసారి టాటూ చూపించింది

మరోసారి టాటూ చూపించింది


సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అషు రెడ్డి.. బిగ్ బాస్ తర్వాత మరింతగా స్పీడు పెంచేసింది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడు.. అప్పట్లో ఎక్స్‌ప్రెస్ హరి.. అషు రెడ్డి పేరుతో ఛాతిపై వేసుకున్న టాటూను ఇప్పుడు చూపిస్తోన్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. దీంతో ఇది వైరల్ అయింది.

ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నిజమేనా

ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నిజమేనా

ఎక్స్‌ప్రెస్ హరి తన పేరును టాటూ వేసుకున్న విషయాన్ని ఇప్పుడు మరోసారి షేర్ చేసిన అషు రెడ్డి.. అభిమానం అంటే ఇదే అంటూ క్యాప్షన్ పెట్టింది. దీంతో ఆ టాటూ ఇప్పటికీ ఉందని పరోక్షంగా వెల్లడించింది. దీంతో వీళ్లిద్దరి మధ్య నిజంగానే లవ్ ఉందా అని అంతా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో అషు రెడ్డి - హరి జంట మరోసారి హాట్ టాపిక్ అయిపోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X