బాడీలో ఆ పార్ట్ పెరిగిందన్న అషు రెడ్డి: సెల్ఫీలో దాన్ని చూపించి మరీ!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది అమ్మాయిలు ఫుల్ పాపులర్ అయ్యారు. తద్వారా ఫాలోయింగ్‌ను భారీ స్థాయిలో పెంచుకోవడంతో పాటు వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ హవాను చూపిస్తున్నారు. అలాంటి వారిలో బోల్డు బ్యూటీ అషు రెడ్డి ఒకరు. అప్పుడెప్పుడో వచ్చిన డబ్‌స్మాష్ వీడియోలతో వెలుగులోకి వచ్చిన ఈ భామ.. చాలా తక్కువ సమయంలోనే ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఇక, ఈ మధ్య కాలంలో ఆమె మరింతగా ఎదిగిపోయింది. దీంతో బుల్లితెరపై, వెండితెరపై సందడి చేస్తూనే ఉంది. అదే సమయంలో సోషల్ మీడియాలో విపరీతంగా హడావిడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా అషు రెడ్డి చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. అదేంటో మీరే చూడండి!

అలా ఫేమస్.. వరుస ఆఫర్లు

అలా ఫేమస్.. వరుస ఆఫర్లు

చాలా కాలం క్రితమే అషు రెడ్డి జూనియర్ సమంత అనే పేరును సొంతం చేసుకుంది. దీంతో ఆమెకు ఫాలోయింగ్ పెరగడంతో పాటు సినిమా అవకాశాలు కూడా దక్కాయి. ఈ క్రమంలోనే నితిన్ హీరోగా నటించిన ‘ఛల్ మోహనరంగ' అనే మూవీలో అషు రెడ్డి భాగమైంది. అయితే, ఆ తర్వాత ఆమె వ్యక్తిగత కారణాలతో అమెరికా వెళ్లింది. దీంతో ఆమె కెరీర్‌కు చాలా గ్యాప్ వచ్చేసింది.

బిగ్ బాస్ తర్వాత దూకుడు

బిగ్ బాస్ తర్వాత దూకుడు

అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత అషు రెడ్డి కెరీర్‌పై ఫోకస్ చేసింది. ఇందులో భాగంగానే బిగ్ బాస్ మూడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా వచ్చింది. ఈ షోలో అంతగా ప్రభావాన్ని చూపకపోయినా ఈ అమ్మడు.. తన క్రేజ్‌ను మాత్రం పెంచుకుంది. తర్వాత యాంకర్‌గా మారి ‘హ్యాపీ డేస్' షో చేసింది. అలాగే, ‘కామెడీ స్టార్స్'లోనూ సందడి చేసింది. వీటితో పాటు కొన్ని మూవీలు చేసింది.

ఓటీటీ ఛాన్స్... మరో నిరాశ

ఓటీటీ ఛాన్స్... మరో నిరాశ


గతంలో బిగ్ బాస్ షోలో భాగం అయినా పెద్దగా ప్రభావాన్ని చూపించలేకపోయిన అషు రెడ్డి.. ఇటీవలే స్ట్రీమింగ్ అయిన నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే ఛాన్స్ వచ్చింది. ఇందులో ఆమె మరింతగా రచ్చ చేసింది. తరచూ బూతులు మాట్లాడడం.. బోల్డుగా కనిపించడం వంటివి చేసి మరింత హైలైట్ అయింది. కానీ, ఇందులోనూ ఎలిమినేటై నిరాశనే ఎదుర్కొంది.

కెరీర్‌తో పాటు పర్సనల్‌గా

కెరీర్‌తో పాటు పర్సనల్‌గా

బిగ్ బాస్ నాన్ స్టాప్ తర్వాత అషు రెడ్డి స్పీడు పెంచేసింది. దీని ద్వారా బాగానే రెమ్యూనరేషన్ అందుకున్న ఈ చిన్నది.. తరచూ విదేశీ ట్రిప్‌లకు వెళ్తూ తెగ రచ్చ చేస్తోంది. అదే సమయంలో ఎన్నో సినిమాలు, షోల ఆఫర్లను కూడా దక్కించుకుంది. ఇలా అటు కెరీర్ పరంగా.. ఇటు పర్సనల్ లైఫ్ పరంగానూ ఈ అమ్మడు హ్యాపీగా ఉంది. దీంతో ఆమె ఫ్యాన్స్ కూడా ఖుషీగా ఉన్నారు.

సోషల్ మీడియాలో బిజీగా

సోషల్ మీడియాలో బిజీగా

అషు రెడ్డి సోషల్ మీడియా ద్వారానే పాపులర్ అయిందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే దీనివల్లే ఈ అమ్మడు తన ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్‌లో ఉంటోంది. అలాగే, అప్పుడప్పుడు ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. అంతేకాదు, ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. మరీ ముఖ్యంగా అషు రెడ్డి ఈ మధ్య కాలంలో మరింతగా హైలైట్ అవుతోంది.

అందాల వల.. ఆ పోస్ట్‌లు

అందాల వల.. ఆ పోస్ట్‌లు


బోల్డు బ్యూటీ అషు రెడ్డి సోషల్ మీడియాలో చిత్ర విచిత్రమైన పోస్టులు చేస్తూ ఉంటోంది. ఈ మధ్య కాలంలో ఈ సుందరాంగి తరచూ అందాలను ప్రదర్శిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను ఎక్కువగా వదులుతోంది. అదే సమయంలో పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన సీక్రెట్‌లను కూడా రివీల్ చేస్తోంది. వీటితో పాటు కొన్ని బోల్డు కంటెంట్ పోస్టులు కూడా చేస్తూ వార్తల్లో నిలుస్తోంది.

ఆ భాగాన్ని చూపించింది

ఆ భాగాన్ని చూపించింది


సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటే అషు రెడ్డి.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ సెల్ఫీని షేర్ చేసింది. అందులో తన బెల్లీ ఫ్యాట్ (పొట్ట భాగంలో)ను చూపిస్తూ ఫోజులిచ్చింది. అంతేకాదు, ‘ఈ మధ్య బాగా తినడం వల్ల బాడీలో ఫ్యాట్ పెరిగపోయింది' అని చెప్పుకొచ్చింది. దీంతో అషు రెడ్డి షేర్ చేసిన ఈ పిక్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X