twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హద్దు లేకుండా బెడ్ పై అషు రెడ్డి.. అందుకు డబ్బు ఆఫర్ చేసిన నెటిజన్, మనిషికింతా అంటూ

    |

    సోషల్ మీడియా వాడకం పెరిగాక అనేక మంది సెలబ్రిటీలు పుట్టుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ సోషల్ మీడియాను యంగ్ జనరేషన్ నుంచి ఓల్డ్ జనరేషన్ వరకు అందరూ ఉపయోగిస్తున్నారు. కొంతమంది కమ్యూనికేట్ చేసుకోవడానికి వాడితో.. మరికొందరూ సమాచారం కోసం వినియోగిస్తున్నారు. ఇంకొందరైతే తమ టాలెంట్ ను ప్రూవ్ చేసుకునేందుకు ఒక మంచి ప్లాట్ ఫామ్ గా వాడుకుంటున్నారు. అలా వాడుకుంటూ హాట్ అందాలను ఆరబోస్తూ అవకాశాలు కొట్టేస్తున్నారు కొంతమంది ముద్దుగుమ్మలు. అలాంటి వారిలో ఒకరు జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అషు రెడ్డి. సోషల్ మీడియాలో అషు రెడ్డి చేసే హాట్ అండ్ బోల్డ్ షో అంతా ఇంతా కాదు. తన అందాలను ఆరబోస్తూ యూత్ కు మతిపోగొడుతోంది. అయితే ఆమె అందాల ఆరబోతకు ఒక నెటిజన్ కౌంటర్ ఇచ్చాడు.

    ఇదొక బెస్ట్ ఆప్షన్..

    ఇదొక బెస్ట్ ఆప్షన్..

    ఎవరికైనా అందుబాటులో ఉండి తమ విషయాలను షేర్ చేసుకోవాలంటే సోషల్ మీడియా చక్కగా ఉపయోగపడుతుంది. ఇక అప్ కమింగ్ హీరో హీరోయిన్లకు తమ టాలెంట్ చూపించుకోడానికి ఇదొక బెస్ట్ ఆప్షన్. ఇలా.. సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది పాపులర్ అయ్యారు. అలాంటి వారిలో తెలుగు అమ్మాయిలు కూడా ఉన్నారు. ఇలా ఇంటర్నెట్ ద్వారా ఎక్కువ గుర్తింపు సాధించిన తెలుగు అమ్మాయిల్లో ఒకరు అషు రెడ్డి.

     అచ్చమైన తెలుగు అందం..

    అచ్చమైన తెలుగు అందం..

    ఇన్ స్టా గ్రామ్, టిక్ టాక్ లేని సమయంలో ఎక్కువగా పాపులర్ అయినవి డబ్‌స్మాష్ వీడియోలు. ఈ డబ్ స్మాష్ ల ద్వారా వెలుగులోకి వచ్చిన అచ్చమైన తెలుగు అందం అషు రెడ్డి. ఇలా ఫేమ్ అయిన అషు రెడ్డి చూడటానికి అచ్చం స్టార్ హీరోయిన్ సమంతలా ఉండి యాక్టివ్ గా డబ్‌స్మాష్ వీడియోస్ చేసేసరికి నెటిజన్లు ఫుల్ ఫిదా అయిపోయారు. దీంతో ఒక్కసారిగా ఆమెను పాపులర్ చేసేశారు.

    సమంతలా కనిపించడంతో..

    సమంతలా కనిపించడంతో..

    అప్పటి నుంచి ఇప్పటి వరకు అషు రెడ్డిని బుల్లితెర సమంత, జూనియర్ సమంత అని కూడా పిలుస్తారు. అషు రెడ్డి ఇలా అచ్చం సమంతలా కనిపించడం, చలాకీగా మాట్లాడటంతో ఆమె క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో అషు రెడ్డికి వరుసగా ఆఫర్లు రావడం స్టార్ట్ అయింది. ఇందులో భాగంగానే యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నితిన్ హీరోగా మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటించిన ఛల్ మోహనరంగ చిత్రంలో ఓ పాత్రలో కనువిందుచేసింది అషు రెడ్డి.

     రెండు సార్లు బిగ్ బాస్ షోలో..

    రెండు సార్లు బిగ్ బాస్ షోలో..

    ఛల్ మోహన్ రంగ సినిమాలో ఆడిపాడిన అషు రెడ్డి కొద్దిరోజులకు అత్యధికంగా పాపులర్ అయిన తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ లో పాల్గొంది. బిగ్ బాస్ తెలుగు మూడో సీజన్ లోకి అడుగుపెట్టిన అచ్చ తెలుగు అందం అషు రెడ్డి గేమ్ పరంగా అంతగా ప్రభావం చూపించలేదు. కానీ హౌజ్ లో అషు రెడ్డి బోల్డ్ నెస్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అలాగే తన ఫ్రెండ్ అయిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో మంచి ర్యాపో ఉండటంతో ఫేమస్ అయింది.

     పోలీస్ ఆఫీసర్ గా..

    పోలీస్ ఆఫీసర్ గా..

    బిగ్ బాస్ తెలుగు మూడో సీజన్ తర్వాత మళ్లీ బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ సీజన్ లో పాల్గొంది. అందులోను హాట్ గా రచ్చ చేసింది. సోషల్ మీడియాలో ఎప్పుడు రచ్చ చేసే అషు రెడ్డి ఇటీవల ఫోకస్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో మొదటిసారిగా పోలీస్ ఆఫీసర్ గా నటించి ఆకట్టుకుంది ఈ భామ. అయితే ఇటీవల విదేశాల్లో చక్కర్లు కొడుతోన్న అషు రెడ్డి తరచుగా హాట్ ట్రీట్ ఇస్తోంది.

    ఎలాంటి హద్దు లేకుండా..

    ఎలాంటి హద్దు లేకుండా..

    సోషల్ మీడియా వేదికగా తన అందాలను ఎలాంటి హద్దు లేకుండా ప్రదర్శిస్తోంది. ఈఫిల్ టవర్ అందానికి పోటిగా అందాలను పరిచిన అషు రెడ్డి తాజాగా బ్లాక్ డ్రెస్ లో బెడ్ పై హొయలు పోయింది. వయ్యారంగా పోజులిస్తూ తన సొగసుతో మెస్మరైజ్ చేసింది. విభిన్నమైన పోజులతో ఆకట్టుకుంది. ఈ ఫొటోలు వెంటనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్లు ఆమె అందానికి ఫిదా అయి కామెంట్లు పెడుతున్నారు.

    తలో రూ. 10 చొప్పున ఇస్తాం..

    తలో రూ. 10 చొప్పున ఇస్తాం..

    అయితే ఒక నెటిజన్ మాత్రం ఆమెకు కౌంటర్ వేశాడనే చెప్పాలి. అషు రెడ్డి హాట్ పిక్స్ చూసిన ఓ నెటిజన్.. ''అందరం మనిషికి తలో రూ. 10, రూ. 10 చొప్పున ఇస్తాం. ఫోన్ పే నంబర్ పంపు. మంచి డ్రెస్ అయినా కొనుక్కుందువు. సిగ్గుండాలి. లేని వాళ్లు లేక అడుక్కుంటుంటే మీకు ఉండి రోగం'' అని కామెంట్ చేశారు. ఈ కామెంట్ కు పలువురు 'కరెక్ట్' అంటూ రిప్లై కూడా ఇచ్చారు. అయితే ఈ కామెంట్ పై అషు రెడ్డి ఇంతవరకు స్పందించలేదు.

    English summary
    Bigg Boss Contestant And Bold Beauty Ashu Reddy Shares Her Latest Romantic Photos On Bed And A Netizen Offers Rs. 10 Money To Her.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X