ముష్టోడికి ముద్దుపెట్టానా?.. ఎక్స్ ప్రెస్ హరిపై అషూ దారుణమైన కామెంట్స్
బుల్లితెరపై ఓ జంట అందరినీ మెప్పించడం అంటే మామూలు విషయం కాదు. వారిద్దరి మధ్య ఏమీ లేకపోయినా కూడా చూసే ప్రేక్షకులకు మాత్రం ఏదో ఉన్నట్టుగా మ్యాజిక్ చేస్తుంటారు. అలా బుల్లితెర మీద సుధీర్ రష్మీ గత ఎనిమిదేళ్లుగా మ్యాజిక్ చేస్తూనే ఉన్నారు. ఈ మధ్యే వర్ష ఇమాన్యుయేల్ కూడా ట్రాక్ ఎక్కారు. అయితే కామెడీ స్టార్స్ అనే ఈ కొత్త షోలో అషూ ఎక్స్ ప్రెస్ హరి కూడా బాగానే కెమిస్ట్రీ నడుపుతున్నట్టు కనిపిస్తోంది.

స్కిట్లతో అలా..
కామెడీ స్టార్స్‌లో అషూ ఎక్స్ ప్రెస్ హరి కలిసి చేసే స్కిట్లు బాగానే వర్కవుట్ అవుతున్నాయి. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఓ రేంజ్‌లో వర్కవుట్ అవుతోంది. ఇంత వరకు ఎవ్వరూ చేయని విధంగా చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. ముద్దులు, హగ్గులతో రెచ్చిపోతూ దుమ్ములేపుతున్నారు.

ముద్దులు వైరల్..
స్కిట్లలో భాగంగా అషూ రెడ్డి కాస్త హద్దులు దాటుతోన్నట్టు కనిపిస్తుంటుంది. స్కిట్ల మధ్యలో ఎక్స్ ప్రెస్ హరికి ముద్దులు పెట్టడం, హగ్గులు ఇవ్వడంతో అందరూ షాక్ అవుతుంటారు. అయితే ఇదంతా కేవలం ఆన్ స్క్రీన్ మీద ఎంటర్టైన్ కోసమే అని అషూ చెప్పుకొస్తోంది.

అన్నయ్య అంటూ..
ఓ సారి అషూ రెడ్డి తన గ్యాంగ్‌తో కలిసి లైవ్‌లోకి వచ్చింది. హ్యాపీ డేస్ అనే కొత్త షో ప్రమోషన్ కోసం అందరూ లైవ్‌లోకి వచ్చారు. అప్పుడు అషూ అన్నయ్య అన్నయ్యా అని పిలుస్తూ ఎక్స్ ప్రెస్ హరిని ఆడుకుంది. ఆఫ్ స్క్రీన్‌లో అన్నయ్యే తెర మీద మాత్రమే అలా ఉంటామని క్లారిటీ ఇచ్చింది.
Recommended Video
తాజాగా అలా..
తాజాగా అషూ రెడ్డి మరోసారి ఎక్స్ ప్రెస్ హరిని ఓ రేంజ్‌లో ఆడుకుంది. వాడిని ఎత్తుకుంటే అన్నీ బొక్కలే తగులుతున్నాయ్ అంటూ కౌంటర్ వేసింది. తన స్కిట్‌లో ఎక్స్ ప్రెస్ హరి ముష్టోడి వేషం వేస్తే అందరూ ఎగతాళి చేశారు. ఈ గెటప్ ఒక్కటే నీకు సూట్ అయిందంటూ శేఖర్ మాస్టర్... ఈ ముష్టోడిని నేను ముద్దులు పెట్టాను అంటూ అషూ పరువుతీసేశారు. ఈ మేరకు వదిలిన ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











