లైవ్ షోలో అషు రెడ్డికి ఊహించని అనుభవం: తనను పడేయడానికి ట్రై చేశారంటూ పోస్ట్.. వీడియోలో అలా!
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతో మంది సెలెబ్రిటీలుగా మారిపోయారు. వారిలో మరికొందరు వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో తెలుగు బ్యూటీ అషు రెడ్డి ఒకరు. డబ్‌స్మాష్ అనే వీడియోలతో ఇంటర్నెట్‌ను ఊపేసిన ఈ బ్యూటీ.. చాలా తక్కువ సమయంలోనే ఊహించని రీతిలో పాపులారిటీని సంపాదించుకుంది. దీంతో ఎన్నో ఆఫర్లు అందుకుంటూ సత్తా చాటుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అషు రెడ్డిని పడేయడానికి ఇద్దరు కమెడియన్లు యమ ప్రయత్నించారు. దీంతో వాళ్లపై షాకింగ్ పోస్ట్ చేసిందామె. వివరాల్లోకి వెళ్తే....

సమంతలా పేరు... సినిమా ఛాన్స్ కూడా
డబ్‌స్మాష్ వీడియోల పుణ్యమా అని అషు రెడ్డికి జూనియర్ సమంత అనే పేరు వచ్చింది. దీని వల్ల సినిమాల్లో నటించాలన్న ఆసక్తి కూడా కలిగింది. దీంతో ఛాన్సుల కోసం వేచి చూసింది. ఇలాంటి సమయంలో నితిన్ హీరోగా చేసిన 'ఛల్ మోహనరంగ'లో ఆమెను తీసుకున్నారు దర్శక నిర్మాతలు. ఈ చిత్రానికి పవన్ కల్యాణ్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించిన విషయం తెలిసిందే.

ఆ లుక్ చూపి షాకైపోయిన అభిమానులు
నితిన్ సినిమాలో నటించిన తర్వాత గ్యాప్ తీసుకుంది అషు రెడ్డి. దీనికి కారణం ఆమె ఉద్యోగం నిమిత్తం అమెరికాకు వెళ్లడమే. ఇక, అక్కడ ఓ అబ్బాయితో ప్రేమలో కూడా పడిందీ బ్యూటీ. కొద్ది రోజుల పాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన తర్వాత అతడితో బ్రేకప్ అయింది. అప్పుడే ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లిపోయి.. బాగా లావైపోయింది. ఈ విషయాలను అషునే స్వయంగా చెప్పింది.

అందులో ఎంట్రీ.. విపరీతమైన ఫాలోయింగ్
రెండేళ్ల క్రితం ప్రసారం అయిన బిగ్ బాస్ మూడో సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది అషు రెడ్డి. బొద్దు లుక్‌తో ఆమెను చూసిన వారంతా షాకైపోయారు. కానీ, అందానికి మాత్రం చాలా మంది ఫిదా అయ్యారు. అదే సమయంలో చక్కని ఆటతీరుతో పాటు డ్యాన్సులు చేయడం.. పాటలు పాడడం వంటి వాటితో ఈ అమ్మడు మరోసారి తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ పాపులర్ అయిపోయింది.

మారిన కెరీర్.. దాని నుంచి చూపిస్తూ రచ్చ
బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత అషు రెడ్డి రచ్చ రచ్చ చేస్తోంది. మొదటి నుంచీ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే ఈ అమ్మడు.. ఇప్పుడు మరింతగా రెచ్చిపోతోంది. తరచూ హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ హాట్ టాపిక్ అవుతోంది. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్‌కు సంబంధించిన విశేషాలనూ ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది.

ఆ షోలో భాగమైన అషు.. వాళ్లతో హల్‌చల్
స్టార్ మాలో 'కామెడీ స్టార్స్' అనే షో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఇందులో అప్పటి హీరోయిన్ శ్రీదేవి, శేఖర్ మాస్టర్ జడ్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. వర్షిణి యాంకరింగ్ బాధ్యతలు నిర్వహిస్తోంది. అవినాష్, చమ్మక్ చంద్ర, జోర్ధార్ సుజాతతో పాటు అషు రెడ్డి కూడా ఇందులో హల్‌చల్ చేస్తోంది. ఈ క్రమంలోనే షూటింగ్ స్పాట్‌లో తీసిన కొన్ని వీడియోలను వదులుతోంది.

లైవ్ షోలో అషు రెడ్డికి ఊహించని అనుభవం
'కామెడీ స్టార్స్' వచ్చే వారం ప్రోమో విడుదలైంది. ఇందులో జడ్జ్‌లు నూనె ఉంచిన ఫ్లాట్‌ఫాంపై సిగ్నేచర్ స్టెప్స్ వేయాలని అవినాష్, హరికి చెప్పారు. అప్పుడు వాళ్లు వేస్తూ కింద పడిపోయారు. దీంతో హరి.. అషు రెడ్డిని కూడా రమ్మని చెప్పండి అంటూ జడ్జ్ శ్రీదేవిని కోరాడు. దీంతో ఆమె షాకైపోయింది. ఇక, చీరతో ఉన్న ఆమె కింద పడిపోవడం ఖాయం అని అంతా అనుకున్నారు.

అంత ఈజీ కాదు అంటూ పోస్ట్ చేసిన అషు
శ్రీదేవి కోరగానే నూనె పోసిన ఫ్లాట్‌ఫాంపైకి వచ్చిన అషు రెడ్డి.. 'భూం బద్దల్' సాంగ్‌కు స్టెప్స్ వేసింది. ఆ సమయంలో ఆమె పడిపోతుందేమోనని అవినాష్, హరి ఆతృతగా ఎదురు చూశారు. అంతేకాదు, స్టేజ్ మీద పడుకున్నారు. కానీ, ఆమె మాత్రం కింద పడలేదు. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాలో షేర్ చేసి 'నేనంత ఈజీగా పడను' అంటూ కామెంట్ చేసింది అషు.


Click it and Unblock the Notifications











