For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అషు రెడ్డి, రాహుల్ పర్సనల్ ఫొటో వైరల్: అతడి మీద కూర్చుని.. ఆ సింబల్‌ పెట్టి!

  |

  సాధారణంగా గ్లామర్ ఫీల్డులో ఉన్న ఎవరైనా జంటగా కనిపిస్తే ఎన్నో రకాల పుకార్లు షికార్లు చేస్తూ ఉంటాయి. అలాంటిది తమ మధ్య బలమైన బంధం ఉందని ఎవరైనా ప్రకటిస్తే.. వాళ్లు ఏ రేంజ్‌లో హైలైట్ అవుతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలా తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయిన జంటల్లో అషు రెడ్డి.. రాహుల్ సిప్లీగంజ్ జోడీ ఒకటి. బిగ్ బాస్ షో వల్ల వీళ్లిద్దరి మధ్య స్నేహం చిగురించడం.. ఆ తర్వాత తరచూ కలుసుకోవడం.. పార్టీలు చేసుకోవడం వంటి వాటితో వార్తల్లో నిలుస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా అషు రెడ్డి, రాహుల్ సిప్లీగంజ్ కలిసి ఉన్న ఫొటో షేర్ చేయడంతో పాటు లవ్ సింబల్‌లో డౌట్లు పెంచేశారు. అసలేం జరిగింది? దానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే...

   అషు రెడ్డి అలా.. రాహుల్ ఇలా ట్రాక్

  అషు రెడ్డి అలా.. రాహుల్ ఇలా ట్రాక్

  అషు రెడ్డి గ్రాడ్యుయేషన్ కోసం యూఎస్ వెళ్లింది. అది పూర్తయిన తర్వాత అక్కడే ఉద్యోగం కూడా చేసింది. ఆ సమయంలోనే ఒకరితో ప్రేమలో పడింది. కానీ, కొద్ది రోజుల్లోనే అది బ్రేకప్ అయిపోవడంతో, ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. మరోవైపు రాహుల్.. బిగ్ బాస్ షోలో ఉన్నప్పుడు పునర్నవితో ట్రాక్ నడిపాడు. దీంతో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారని కూడా టాక్ వచ్చింది.

  శివాత్మక రాజశేఖర్ అందాల జాతర: స్లీవ్‌లెస్ టాప్‌తో ఓ రేంజ్ ట్రీట్

   అషు, రాహుల్ మధ్యన రిలేషన్ అని

  అషు, రాహుల్ మధ్యన రిలేషన్ అని


  బిగ్ బాస్ తర్వాత అషు రెడ్డి క్రేజ్ ఒక్కసారిగా రెట్టింపు అయిపోయింది. ఈ క్రమంలోనే తరచూ ఫ్రెండ్స్‌తో కలిసి డిన్నర్‌కు సైతం వెళ్తోంది. ఇలానే కొద్ది రోజుల క్రితం బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లీగంజ్‌తో డిన్నర్ డేట్‌కు వెళ్లింది. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో వదిలిన అతడు.. తామిద్దరం రియల్ రిలేషన్‌షిప్‌లో ఉన్నామని ప్రకటించి అందరికీ షాకిచ్చాడు.

  Recommended Video

  వాడంత వెధవ ఉండడు, సంచలనంగా మారిన నాగబాబు ట్వీట్ *Politics | Telugu OneIndia
   రాహుల్‌తో రిలేషన్‌పై అషు క్లారిటీ

  రాహుల్‌తో రిలేషన్‌పై అషు క్లారిటీ


  రాహుల్ సిప్లీగంజ్ చేసిన ప్రకటనపై ఆ వెంటనే అషు రెడ్డి స్పందించింది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అతడితో దిగిన ఫొటోను షేర్ చేసి.. ‘సమయం వస్తుంది. నిజాలన్నీ అప్పుడే తెలుస్తాయి' అంటూ క్యాప్షన్ పెట్టింది. దీంతో అసలేం జరిగిందన్న ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది. దీనికి ‘సమయం ఎప్పుడు వస్తుంది బేబీ' అంటూ రాహుల్ రిప్లై ఇచ్చాడు కూడా.

  ఏకంగా టాప్‌ను విప్పేసిన ప్రియాంక చోప్రా: అబ్బో ఆమె ఫోజు చూశారంటే!

  అషు రెడ్డి హల్‌చల్.. రాహుల్ క్రేజ్

  అషు రెడ్డి హల్‌చల్.. రాహుల్ క్రేజ్


  ఇక, బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ ముగిసిన తర్వాత పర్సనల్ టూర్లతో అషు రెడ్డి తెగ హల్‌చల్ చేస్తోంది. అలాగే, పలు ప్రాజెక్టులను కూడా లైన్‌లో పెట్టుకుంటూ ముందుకు సాగుతోంది. అదే సమయంలో రాహుల్ సిప్లీగంజ్ కెరీర్ పరంగా, బిజినెస్ పరంగా సత్తా చాటుతున్నాడు. వీటితో పాటు ప్రైవేట్ ఆల్బమ్‌లు కూడా చేస్తున్నాడు. ఇలా ఇద్దరూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు.

  ఫ్రెండ్‌షిప్ డేకు ఆ ఫొటో వదిలారు

  ఫ్రెండ్‌షిప్ డేకు ఆ ఫొటో వదిలారు


  అటు అషు రెడ్డి.. ఇటు రాహుల్ సిప్లీగంజ్ ఇద్దరూ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీళ్లిద్దరూ తరచూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ ఫ్యాన్స్‌కు మజాను పంచుతూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా వీళ్లిద్దరూ తమ తమ సోషల్ మీడియా ఖాతాల్లో ఓ ఫొటోను షేర్ చేశారు. ఇందులో రాహుల్ ఒడిలో అషు రెడ్డి కూర్చుని కనిపించింది.

  ఒంటిపై నూలు పోగు లేకుండా నితిన్ హీరోయిన్ ఫోజులు: మరీ ఇంత పచ్చిగానా!

  ఆ సింబల్ పెట్టడంతో అనుమానం

  ఆ సింబల్ పెట్టడంతో అనుమానం


  తాము రిలేషన్‌లో ఉన్నామని ప్రకటించుకున్న తర్వాత రాహుల్ సిప్లీగంజ్, అషు రెడ్డి జంటగానే హల్‌చల్ చేస్తున్నారు. దీంతో వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా ఈ ఫొటోను షేర్ చేయడంతో పాటు లవ్ సింబల్‌ను కూడా పెట్టారు. దీంతో వీళ్ల బంధం ఉన్న అనుమానాలు మరింత పెరిగిపోతున్నాయని చెప్పొచ్చు.

  English summary
  Bigg Boss Fame Ashu Reddy Very Active in Social Media. Now She Shares Rahul Sipligunj Photo and Shows her Love on him.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X