అషు రెడ్డి ప్రైవేటు భాగంలో పవన్ టాటూ: మరోసారి డ్రెస్ తీసేసి చూపించిన బ్యూటీ

అషు రెడ్డి.. కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో తెగ హాట్ టాపిక్ అవుతోన్న పేర్లలో ఒకటి. అంతలా ఈ అమ్మడు తన వ్యవహార శైలితో తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది. చాలా కాలం క్రితమే సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిన ఈ బ్యూటీ.. నిత్యం ఏదో ఒక పోస్టుతో తెగ హడావిడి చేస్తూనే ఉంటోంది. ఈ మధ్య బుల్లితెరపైన ఎన్నో షోలు, ఈవెంట్లు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. దీంతో మరిన్ని అవకాశాలను దక్కించుకుంటోంది. కెరీర్ పరంగా ఎలా ఉన్నా.. అషు రెడ్డికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే విపరీతమైన అభిమానం. గతంలో అతడి టాటూను వేయించుకోవడంతో పాటు కొన్ని ఫొటోలు సైతం దిగింది. ఇప్పుడు మరోసారి అషు తన టాటూను చూపిస్తూ దిగిన ఫొటోలు షేర్ చేసింది. వివరాల్లోకి వెళ్తే..

జూనియర్ సమంతగా అషు రెడ్డి

జూనియర్ సమంతగా అషు రెడ్డి

డబ్‌స్మాష్ వీడియోలు భారతదేశం మొత్తాన్ని ఓ ఊపు ఊపిన విషయం తెలిసిందే. వీటి ద్వారానే చాలా మంది అమ్మాయిలు సెలెబ్రిటీలుగా మారిపోయారు. అలాంటి వారిలో అషు రెడ్డి కూడా ఒకరు. చూడ్డానికి అచ్చం సమంత లాగే ఉండే ఆమెకు జూనియర్ సామ్ అనే బిరుదు కూడా వచ్చింది. అలా ఫేమస్ అయిన ఆమె.. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకుపోతోంది.

సినిమా.. బిగ్ బాస్.. టీవీ షోలతో

సినిమా.. బిగ్ బాస్.. టీవీ షోలతో


సోషల్ మీడియా వల్ల వచ్చిన క్రేజ్‌తో అషు రెడ్డి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. నితిన్ నటించిన 'ఛల్ మోహనరంగ' అనే సినిమాతో పరిచయం అయిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో టైటిల్ గెలవకున్నా.. ప్రేక్షకులను గెలుచుకుంది. ఆ తర్వాత కొన్ని టీవీ షోలలో సైతం భాగం అయింది. తద్వారా ఫుల్ బిజీగా మారింది.

బిగ్ బాస్ రీఎంట్రీ.. మళ్లీ నిరాశే

బిగ్ బాస్ రీఎంట్రీ.. మళ్లీ నిరాశే

అషు రెడ్డి ఇటీవలే ముగిసిన బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో కంటెస్టెంట్‌గా రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో సెన్సార్ లేకపోవడంతో చాలా బోల్డు కంటెంట్‌ను చూపించారు. అందులో అషు రెడ్డి మరింత రెచ్చిపోయింది. తరచూ బూతులు మాట్లాడడం.. బోల్డుగా కనిపించడం వంటివి చేసి హైలైట్‌గా నిలిచింది. ఇక, ఈ సీజన్‌లో ఈ అమ్మడు ఫినాలేకు చేరకుండానే వెళ్లిపోయింది.

పవన్ కల్యాణ్‌పై ప్రత్యేక ప్రేమ

పవన్ కల్యాణ్‌పై ప్రత్యేక ప్రేమ


టాలీవుడ్ టాప్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే అషు రెడ్డికి ఎంతటి ప్రేమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీన్ని ప్రేమ అనడం కంటే భక్తి అని అనొచ్చు. అంతలా అతడిని ఈ సుందరాంగి ఆరాధిస్తుంటుంది. ఇందుకోసమే ఆమె తన బాడీపై పవన్ కల్యాణ్ పేరుతో పచ్చబొట్టను కూడా వేయించుకుంది. దీన్ని ఐదేళ్ల క్రితమే చూపించింది. దీంతో ఫ్యాన్స్ మద్దతును కూడగట్టుకుంది.

పవన్‌కు నాలుగో భార్య అంటూ

పవన్‌కు నాలుగో భార్య అంటూ

పవన్ కల్యాణ్ మీద ఉన్న పిచ్చితో కొన్నేళ్ల క్రితం అషు రెడ్డి ఆయనను పలుమార్లు కలిసింది. ఆ సమయంలో ఈ బ్యూటీని పవర్ స్టార్ నాలుగో భార్య అంటూ కొందరు ప్రచారం చేశారు. అప్పుడు స్పందించిన అషు రెడ్డి.. 'పవన్ గారి పేరును చెడగొడుతున్నారు. దయచేసి ఆ వార్తలకు పుల్‌స్టాప్ పెట్టండి' అని ఓ వీడియో రిలీజ్ చేసింది. దీంతో అప్పుడీ వ్యవహారం సంచలనం అయింది.

మళ్లీ పవన్ టాటూను చూపించి

మళ్లీ పవన్ టాటూను చూపించి

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అషు రెడ్డి.. అప్పుడప్పుడూ శృతి మించిన హాట్ షో కూడా చేస్తూ ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా దుబాయ్‌లో సందడి చేస్తోన్న ఈ భామ.. ఎద భాగం కింద వేసుకున్న పవన్ కల్యాణ్ టాటూను మరోసారి చూపించింది. ఇందుకోసం క్యాజువల్ ఇన్నర్‌ను మాత్రమే ధరించింది. ఇప్పుడీ ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.

అంతగా ప్రేమించలేదు అంటూ

అంతగా ప్రేమించలేదు అంటూ


పవన్ కల్యాణ్ పేరుతో ఉన్న టాటూను చూపిస్తూ రెచ్చిపోయిన అషు రెడ్డి.. దీనికి 'నీ పేరు పచ్చబొట్టు వేయించుకునే వరకూ టాటూలంటే అంతగా ఇష్టం ఉండేది కాదు. నా దేవుడు పవన్ కల్యాణ్' అంటూ రాసుకొచ్చింది. దీంతో అషు రెడ్డి చేసిన ఈ పోస్టుకు పవర్ స్టార్ అభిమానుల నుంచి భారీ స్థాయిలో మద్దతు లభిస్తోంది. దీంతో ఈ అమ్మడు మరోసారి హాట్ టాపిక్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X