Bigg Boss Non Stop.. రూటు మార్చిన అషురెడ్డి... బోల్డ్ షోతో రచ్చ!

సోషల్ మీడియాలో తన ఫొటోలు షేర్ చేస్తూ జూనియర్ సమంతగా పేరు తెచ్చుకుంది అషు రెడ్డి. ఆ తర్వాత కింగ్ నాగార్జున తొలిసారిగా హోస్ట్ చేసిన బిగ్‌బాస్-3 కార్యక్రమంలో పాల్గొని మరికొంత గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ రెండింటి కంటే సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ‌తో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ ఆమెకు విపరీతమైన గుర్తింపును తీసుకొచ్చింది. ఆ ఇంటర్వ్యూలో శృంగారం గురించి, తొడల గురించి, ఇతర ప్రైవేట్ భాగాల గురించి వర్మ అడిగిన ప్రశ్నలకు అషు అసలు తడుముకోకుండా సమాధానాలు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఆ ఇంటర్వ్యూతో అషు బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. దానికి తోడు తన సోషల్ మీడియా ఖాతాల్లో క్రమం తప్పకుండా తన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ అషు మరింత పాపులారిటీ సంపాదించుకుంది. దీంతో మరోసారి బిగ్‌బాస్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఆమెకు వచ్చింది. ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా బిగ్‌బాస్ నాన్‌స్టాప్ కార్యక్రమం ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో తన స్నేహితురాలు, మరో బోల్డ్ బ్యూటీ ఆరియానాతో కలిసి అషు రచ్చ రచ్చ చేస్తోంది.

వర్మ ఇంటర్వ్యూతో పాపులర్

వర్మ ఇంటర్వ్యూతో పాపులర్

ఓ ఐస్ క్రీమ్ పార్లర్‌లో రామ్‌గోపాల్ వర్మతో కలిసి ఇంటర్వ్యూలో పాల్గొన్న అషు రెడ్డి అందరికీ షాకచ్చింది. అషు తొడల గురించి, ఇతర శరీర భాగాల గురించి వర్మ ఓపెన్‌ కామెంట్స్ చేశాడు. వర్మ కామెంట్స్‌ను కాంప్లిమెంట్స్‌లా తీసుకున్న అషు మరింత బోల్డ్‌గా స్పందించింది. అంతేకాదు పోర్న్ వీడియోలు చూస్తానని తడబడకుండా చెప్పి షాకిచ్చింది. శృంగారం గురించి పచ్చిగా మాట్లాడింది. అందాలు ఆరబోస్తూ అషు ఇచ్చిన ఆ హాట్ ఇంటర్వ్యూ అప్పట్లో సెన్సేషన్ అయింది.

సోషల్ మీడియాలో హాట్ బ్యూటీ

సోషల్ మీడియాలో హాట్ బ్యూటీ

కెరీర్ ప్రారంభం నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అషు రెడ్డి ఇప్పటికీ ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండీ లుక్స్‌తో హాట్ హాట్ ఫొటోషూట్లలో పాల్గొని వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంటుంది. అభిమానుల హాట్ కామెంట్స్‌కు ఆమె కూడా అంతే హాట్‌గా స్పందిస్తూ ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా తన క్రేజ్‌ను రోజురోజుకూ పెంచుకుంటోంది. అయితే సినిమాల్లో మాత్రం ఈ బొద్దుగుమ్మకు అవకాశాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. దీంతో మరోసారి ఈ భామ బిగ్‌బాస్ బాట పట్టింది.

బిగ్‌బాస్ ఓటీటీ

బిగ్‌బాస్ ఓటీటీ

బిగ్‌బాస్-3తో బుల్లితెర పైకి ఎంట్రీ ఇచ్చిన అషు అప్పట్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రేక్షకుల నుంచి మద్దతు అంతంత మాత్రంగానే ఉండడంతో త్వరగానే నిష్క్రమించింది. తాజాగా ఫిబ్రవరి 26న గ్రాండ్‌గా ప్రారంభమైన బిగ్‌బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. ఈ సీజన్‌లో మొత్తం 17 మంది కంటెస్టెంట్లు పాల్గొనబోతున్నారు. 84 రోజుల పాటు ప్రసారం కానున్న ఈ ప్రోగ్రామ్‌లో అషు అభిమానుల అటెన్షన్ సంపాదించేందుకు ప్రయత్నిస్తోంది.

Recommended Video

Bigg Boss Telugu Non Stop: Contestants బోల్డ్ స్టేట్మెంట్స్ Trolls | Filmibeat Telugu
 బోల్డ్ నేచర్

బోల్డ్ నేచర్

బిగ్‌బాస్ నాన్ స్టాప్ అనేది ఓటీటీ షో కావడంతో, దీనికి ఫిల్టర్లు లేకపోవడంతో ఆరియానా, అషు వంటి బోల్డ్ బ్యూటీస్ రెచ్చిపోతున్నారు. వీరిద్దరూ బయట కూడా ఫ్రెండ్స్ కావడంతో బిగ్‌బిస్ ఇంట్లోనే వీరిద్దరే ఎక్కువగా కలిసి ఉంటున్నారు. వీరిద్దరి బోల్డ్‌నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గ్లామరస్‌గా కనిపించడం, తమ అఫైర్ల గురించి బోల్డ్‌గా మాట్లాడడం వంటివి చూస్తే స్వచ్ఛమైన ఓటీటీ కంటెంట్ అందిస్తున్నారు. మరి, బిగ్‌బాస్-3లో ఎక్కువ రోజులు ఉండలేకపోయిన అషు ఈసారి ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X