బయటపడ్డ అషూ రెడ్డి రిలేషన్.. రాహుల్ అమ్మ బర్త్ డేకు విషెస్ చెప్పి అలా దొరికిపోయింది!!
బిగ్‌బాస్ షోలో ఏర్పడిన బంధాలు బయట కూడా కొనసాగిస్తారు. కొందరు ఇంట్లో ఎన్ని గొడవలు పెట్టుకున్నా కూడా బయటకు వచ్చాక కలిసిపోతారు. ఇంకొందరు ఇంట్లో బాగానే ఉంటారు. కానీ బయటకు వచ్చాక ఎవరి దారి వారు చూసుకుంటారు. అలా బిగ్ బాస్ మూడో సీజన్ కంటెస్టెంట్లు మాత్రం ఇప్పటికీ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. అందులో మరీ ముఖ్యంగా రాహుల్, రవికృష్ణ, అలీ రెజా, శివజ్యోతి, హిమజ, అషూ రెడ్డిలు ఓ రకంగా హల్చల్ చేస్తుంటారు.

రాహుల్ రచ్చ..
బిగ్‌బాస్ ఇంట్లో ఉన్నంత సేపు పునర్నవితో రచ్చ చేశాడు రాహుల్. ఏదో తెలియని కెమిస్ట్రీని నడిపి బిగ్ బాస్ షోకే ఓ సక్సెస్ ఫార్మూలాను కనిపెట్టాడు. ఇలా అదిరిపోయే ట్రాక్ నడిపితే ఎక్కడ లేని క్రేజ్ వచ్చి పాపులార్టీ వస్తుందని చెప్పకనే చెప్పాడు. ప్రస్తుతం నాల్గో సీజన్‌లో జరుగుతోంది అదే అనుకోండి. అయితే బిగ్ బాస్ ఇంట్లో ఎంతో క్లోజ్‌గా ఉన్న పునర్నవి మాత్రం దూరంగానే ఉంటూ వస్తోంది.

బయటకు వచ్చాక కూడా..
అయితే పునర్నవి-రాహుల్ మధ్య ఏముందనే చర్చలు బయటకు వచ్చాక కూడా అలాగే జరిగాయి.పైగా అంతకు మించిన డిబేట్లు కూడా నడిచాయి. తమ మధ్య ఏమీ లేదు కేవలం స్నేహితులమేనని ఎన్ని సార్లు క్లారిటీగా చెప్పినా కూడా ఏదో రకమైన వార్తలు వస్తూనే ఉంటాయి. రాహుల్ ఇంట్లో పునర్నవితో పెళ్లికి ఒప్పుకున్నారు.. ఇద్దరికి పెళ్లి కానుందని లాంటి వార్తలు లెక్కలేనన్ని వచ్చాయి.

అషూరెడ్డి క్లోజ్..
అయితే వాస్తవంలో మాత్రం రాహుల్‌తో అషూ క్లోజ్‌గా ఉంటోంది. బయట పార్టీలు జరిగినా ఈ ఇద్దరి హవానే వీస్తోంది. ఇద్దరూ కలిసి చేసిన రచ్చకు ఈ జంట ప్రేమలో ఉందేమోనన్న అనుమానాన్ని నెటిజన్లు వ్యక్తం చేశారు. కానీ తాము మంచి ఫ్రెండ్స్‌మేనని అషూ క్లారిటీ ఇచ్చింది. ఇక నెటిజన్లు పదే పదే అడుగుతుండటంతో రాహుల్ కూడా క్లారిటీ ఇచ్చాడు. మంచి దోస్త్ అంటూ అషూతో ఉన్న రిలేషన్‌పై క్లారిటీ ఇచ్చాడు.

రాహుల్ అమ్మ బర్త్ డే..
రాహుల్ అమ్మ సుధారాణి బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన క్షణాలు అందరికీ గుర్తుండే ఉంటాయి. ఓ సాధారణ గృహిణిగా, మన అమ్మలానే అనిపించే ఫీలింగ్, ఆ మాటల్లో కనిపించే అమాయకత్వం, రాహుల్ గురించి చెప్పిన విధానం ఇంకా అందరికీ గుర్తుండే ఉంటుంది. నేడు రాహుల్ అమ్మ బర్త్ డే. ఈ సందర్భంగా అషూ రెడ్డి స్పెషల్‌గా విషెస్ తెలిపింది.
Recommended Video

సపోర్టివ్ మదర్..
రాహుల్ అమ్మకు బర్త్ డే విషెస్ చెప్పిన అషూ అదిరిపోయే ఫోటోను షేర్ చేసింది. రాహుల్ అమ్మతో దిగిన ఫోటోను షేర్ చేస్తూ... బ్యూటీఫుల్ అండ్ సపోర్టివ్ మదర్ అంటూ ఘాడంగా హత్తుకుంది. ఇలా ఇంట్లో ఓ పిల్లలా కలిసిపోయాయని చెప్పకనే చెప్పేసింది. ఇక ఈ విషెస్‌కు రాహుల్ ఓ లవ్ సింబల్‌ను కామెంట్‌గా పెట్టాడు. మొత్తానికి వీరు ఇలా జిగ్రీ దోస్తుల్లా బాగానే క్లోజ్ అయ్యారు.


Click it and Unblock the Notifications











