Sixth Sense: ఓంకార్ షోలో ఊహించని సీన్.. వెక్కి వెక్కి ఏడ్చిన హీరో.. గుండెను పిండేశారు కదయ్యా!
ఓంకార్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని బుల్లితెర ప్రేక్షకుడు ఉండడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అంతలా అతడు సుదీర్ఘ కాలంగా ఫిల్మ్ మేకర్‌గా, యాంకర్‌గా, నిర్మాతగా వ్యవహరిస్తూ ఆడియెన్స్‌ను అలరిస్తున్నాడు. ముఖ్యంగా బుల్లితెరపై ఎన్నో రకాల షోలు చేస్తూ సత్తా చాటుకుంటోన్నాడు. ఇందులో భాగంగానే ఓంకార్ 'సిక్త్ సెన్స్' అనే టెర్రిఫిక్ షోను చాలా ఏళ్ల క్రితమే మొదలెట్టాడు. ఇప్పుడిది ఐదో సీజన్‌ను జరుపుకుంటోంది. ఈ షోలో ఎవరూ ఊహించని ఓ ఎమోషనల్ సంఘటన జరిగింది. ఇంతకీ ఏమైంది? ఆ పూర్తి వివరాలను మీరే చూడండి!
సూపర్ షో.. ఐదో సీజన్:
తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న ఎన్నో షోలలో 'సిక్త్ సెన్స్' ఒకటి. సెలెబ్రిటీలతో సాగిపోయే ఈ కార్యక్రమం మైండ్ గేమ్ ఆధారంగా నడుస్తుంది. ఓంకార్ రూపొందించిన ఈ షో ఇప్పటికే నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఐదో దాన్ని జరుపుకుంటోంది. దీనికి కూడా ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన లభిస్తూనే ఉంటోంది.

టెన్షన్ పెట్టేలా ఓంకార్:
'సిక్త్ సెన్స్' షో అనగానే అందులో ఉండే థీమ్ కంటే.. దాన్ని హోస్ట్ చేసే ఓంకారే అందరికీ గుర్తుకు వస్తాడు. అంతలా అతడు ఆడటానికి వచ్చిన వాళ్లను 'వన్ సెకెన్' అనే డైలాగ్‌తో టెన్షన్ పెడుతూ ఉంటారు. అలాగే, తనదైన ఎక్స్‌ప్రెషన్స్‌తో చెమటలు పట్టిస్తుంటాడు. ఫలితంగా ఈ షోకి వచ్చేందుకు చాలా మంది భయపడతారు. అందుకే ఈ షో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది.

వచ్చే వారం వాళ్లు రాక:
ప్రస్తుతం 'సిక్త్ సెన్స్' షో ఐదో సీజన్‌ను జరుపుకుంటోంది. ఇందులోకి ఇప్పటికే ఎంతో మంది సెలెబ్రిటీలు వచ్చి ఆటలు ఆడారు. ప్రతి శని, ఆదివారాల్లో వచ్చే ఈ షో స్టార్ మాలో ప్రసారం అవుతోంది. ఇక, వచ్చే వారం ఎపిసోడ్ల కోసం జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బా టీమ్ వచ్చింది. అలాగే, ఓంకార్ సోదరుడు అశ్విన్ బాబు నటించిన 'హిడింబ' మూవీ టీమ్ కూడా ఎంట్రీ ఇచ్చింది.

జెడీది బోల్డుగా సాగింది:
'సిక్త్ సెన్స్' ఐదో సీజన్‌లో భాగంగా వచ్చే వారం ప్రసారం కాబోతున్న ఎపిసోడ్ కోసం సీనియర్ హీరో జేడీ చక్రవర్తి, తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా వచ్చారు. వీళ్ల ఎపిసోడ్ మొత్తం ఎంతో బోల్డుగా సాగింది. ముఖ్యంగా ఇందులో జేడీ చక్రవర్తి తనదైన వ్యవహార శైలితో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. హీరోయిన్లపై, అమ్మాయిలపై కామెంట్లు చేస్తూ సెన్సేషన్ అయిపోయాడని చెప్పాలి.

హిడింబ ఎమోషనల్‌గా:
'సిక్త్ సెన్స్' ఐదో సీజన్‌లో మరో ఎపిసోడ్ కోసం 'హిడింబ' మూవీ టీమ్ వచ్చింది. ఇందులో హీరోగా చేసింది ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు కాగా.. నందితా శ్వేత హీరోయిన్‌గా నటించింది. ఇందులో నందిత తన స్ట్రగుల్స్ గురించి గుర్తు చేసుకుని బాగా ఏడ్చేసింది. అలాగే, తన తండ్రి ఆఖరి రోజుల్లో ఎదుర్కొన్న గడ్డు పరిస్థితులను వివరిస్తూ ఎమోషనల్ అయిపోయింది.

తమ్ముడిని అడిగాడు:
'సిక్త్ సెన్స్' షోలో గేమ్ ఆడేందుకు వచ్చిన తమ్ముడు అశ్విన్ బాబును ఓంకార్ 'నీ లైఫ్‌లో ఏదైనా బాధను నాకు చెప్పకుండా దాచి పెట్టావా' అని సూటిగా అడిగాడు. దీంతో అతడు 'స్ట్రగుల్స్.. నా లైఫ్‌లో జరిగిన వాటిని అన్నీ నీకు చెప్పుకోలేదు' అని నేరుగానే అన్నతో చెప్పేశాడు. దీంతో ఓంకార్ 'అందు ఒక స్ట్రగుల్ గురించి నాకు చెప్పు' అని అశ్విన్‌ను అడిగాడు.
నాన్న.. అన్న నేనేగా:
స్ట్రగుల్స్ గురించి చెప్పమని ఓంకార్ అడిగిన వెంటనే అశ్విన్ బాబు ఎమోషనల్ అయిపోయాడు. దీంతో 'నాన్నైనా.. అన్నైనా అన్నీ నేనే కదా మీకు. నాకు చెప్పడానికి ఏంట్రా' అని అంటూ ఓంకార్ కూడా బాధ పడ్డాడు. అప్పుడు అశ్విన్ 'ఇప్పటి వరకూ చూసుకుంటూనే ఉన్నావు. ఇంకా నిన్ను ఏం ఇబ్బంది పెడతాను అన్నయ్యా. నిన్ను అడగాలంటే..' అని ఏడ్చేశాడు. ఈ వీడియో చూసిన వాళ్ల కళ్లు కూడా చెమర్చేలా ఇదంతా సాగింది. దీంతో ఈ ప్రోమో బాగా వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











