Bigg Boss 5 Contestants: బిగ్ బాస్‌లోకి యంగ్ హీరో.. చక్రం తిప్పిన ప్రముఖుడు.. టైటిల్ ఫేవరెట్‌ అతడే!

తెలుగు బుల్లితెరపై కనీవినీ ఎరుగని రీతిలో ప్రేక్షకుల రెస్పాన్స్‌ను అందుకుని.. సూపర్ డూపర్ హిట్ షోగా పేరు సంపాదించుకుంది బిగ్ బాస్. రియాలిటీ ఆధారంగా నడిచే ఈ షో ఇప్పటికే నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే త్వరలోనే ఐదో సీజన్‌ కూడా మొదలు కాబోతుంది. దీంతో అందులో పాల్గొనబోయే కంటెస్టెంట్ల గురించి ఎన్నో వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో కంటెస్టెంట్ పేరు బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం ఓ యంగ్ హీరో ఈ సారి హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడట. ఆ వివరాలు మీకోసం!

ఒక్కోటి... ఒక్కో దాన్ని మించేలా

ఒక్కోటి... ఒక్కో దాన్ని మించేలా

తెలుగులో బిగ్ బాస్ షో నాలుగు సీజన్లను పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. అందులో ఒక్కో షో ఒక్కో రేంజ్‌లో హిట్ అయింది. మొత్తానికి ప్రతీది ఒకదానికి మించి ఒకటి అన్నట్లుగా సక్సెస్ అయ్యాయి. మరీ ముఖ్యంగా రేటింగ్‌లో రికార్డులు క్రియేట్ చేశాయి. అందుకే మన బిగ్ బాస్ దేశ వ్యాప్తంగా గుర్తింపును అందుకుంది. దీని వెనుక హోస్టులుగా చేసిన స్టార్ హీరోల కృషి కూడా ఉంది.

ఐదో సీజన్ అప్పట్నుంచే అంటూ

ఐదో సీజన్ అప్పట్నుంచే అంటూ


బిగ్ బాస్ ఐదో సీజన్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. దీనికి కారణం అంతకు ముందు వచ్చినవి సూపర్ హిట్ అవడమే. అందుకు అనుగుణంగానే త్వరలోనే రాబోయే దాని కోసం ప్లానింగ్ చేస్తున్నారు. ఇక, ఐదో సీజన్ సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆగస్టులో షోకు సంబంధించిన ప్రోమో, లోగో విడుదల అవుతాయని టాక్.

కంటెస్టెంట్ల ఎంపిక కూడా కంప్లీట్

కంటెస్టెంట్ల ఎంపిక కూడా కంప్లీట్


కరోనా పరిస్థితులు ఉండడంతో ఈ సారి బిగ్ బాస్ షో ప్రసారం అయ్యేది అనుమానమే అన్నారు. కానీ, దీని వెనుక గ్రౌండ్ వర్క్‌ను మాత్రం నిర్వహకులు ఎప్పుడో ప్రారంభించేశారు. ఇందులో భాగంగానే కంటెస్టెంట్ల ఎంపిక కోసం దాదాపు వంద మందితో చర్చలు జరిపారట. అందులో కొందరిని ఎంపిక చేసి జూమ్ మీటింగ్ ద్వారా వాళ్లతో ఇంటర్వ్యూలు చేసి పలువురిని ఫైనల్ చేశారట.

రోజుకో పేరు.. వీళ్లంతా ఉన్నారని

రోజుకో పేరు.. వీళ్లంతా ఉన్నారని


ఐదో సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్ల విషయంలో ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే చాలా మంది పేర్లు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే సిరి హన్మంత్, నవ్య స్వామి, శ్రీహాన్ ఫైనల్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది. వీళ్లతో పాటు షణ్ముక్ జశ్వంత్, హేమచంద్ర, మంగ్లీ, జబర్ధస్త్ నరేష్, రఘు మాస్టర్ సహా పలువురి పేర్లు ఈ సారి లిస్టులో ఉన్నట్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే.

బిగ్ బాస్‌లోకి యంగ్ హీరో ఎంట్రీ

బిగ్ బాస్‌లోకి యంగ్ హీరో ఎంట్రీ

కొద్ది రోజుల్లో బిగ్ బాస్ ఐదో సీజన్ ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన విషయాలు ఎంత సీక్రెట్‌గా ఉంచాలనుకున్నా ఏదో ఒక విషయం బయటకు వస్తూనే ఉంటుంది. అలాగే, షోకు ముందు కంటెస్టెంట్ల పేర్లు బయటకు రావడం ఆనవాయితీనే. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఈ సీజన్‌లో టాలీవుడ్ యంగ్ హీరో అశ్విన్ బాబు ఎంట్రీ ఇవ్వబోతున్నాడట.

చక్రం తిప్పేసిన బడా ప్రముఖుడు

చక్రం తిప్పేసిన బడా ప్రముఖుడు


ప్రముఖ యాంకర్, టాలీవుడ్ డైరెక్టర్ ఓంకార్ సోదరుడిగా సుపరిచితుడు అయ్యాడు అశ్విన్ బాబు. ఆయన చేసే షోలకు తెర వెనుక ఉండి పని చేసిన అతడు.. ఆ తర్వాత 'రాజు గారి గది' సిరీస్‌తో పాటు 'నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్' వంటి సినిమాల్లో నటించాడు. ఇక, ఇప్పుడు అశ్విన్ బాబు బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇవ్వడం వెనుక అన్న ఓంకార్ చక్రం తిప్పాడని ఓ న్యూస్ బయటకొచ్చింది.

టైటిల్ ఫేవరెట్‌ అతడే అవుతాడు

టైటిల్ ఫేవరెట్‌ అతడే అవుతాడు


స్వతహాగా పెద్దగా పేరు తెచ్చుకోలేకపోయిన అశ్విన్ బాబు.. ఓంకార్ అండతో హీరోగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ, అతడికి సరైన బ్రేక్ మాత్రం దక్కడం లేదు. ఇక, అతడు బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇస్తే కనుక కచ్చితంగా టైటిల్ ఫేవరెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనికి కారణం ఓంకార్‌కు బయట ఎలా పబ్లిసిటీ చేసుకోవాలో తెలుసు అనే టాక్ బుల్లితెర వర్గాల్లో బాగా వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X