నిన్ను అలా చూస్తే గట్టిగా ఇచ్చిపడేయ్.. ఆ కసితో ఆడు.. అశ్వీనీ శ్రీ తల్లి షాకింగ్ కామెంట్స్

బిగ్‌బాస్ తెలుగు 7 చివరి ఘట్టానికి చేరుకొన్నది. 10వ వారంలోకి ప్రవేశించిన ఈ షోలోకి ఇంటి సభ్యులకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారు. శివాజీ కోసం ఆయన కుమారుడు, అంబటి అర్జున్ కోసం ఆయన భార్య ఇంటిలోకి వచ్చారు. ఆ తర్వాత అశ్వినీ శ్రీ తల్లి రమ ఇంటిలోకి రావడంతో భావోద్వేగ వాతావరణం కనిపించింది. అశ్వినీ శ్రీ తల్లి చెప్పిన విషయాల్లోకి వెళితే..

బిగ్‌బాస్ అనేది ఒక గేమ్. దాని గురించి ఎక్కువగా ఆలోచించకు అంటూ అశ్వినీ తల్లి ఓదార్చింది. అయితే తనను ఎవరైనా చిన్న మాట అంటే తట్టుకోలేకపోతున్నాను అని అశ్విని అంటే.. నీకు ఎంత వరకు అయితే అంత వరకు ఆడు. నీకు ఎవరు ఇష్టమైతే వారితోనే ఉండు. ఎక్కువ శాతం పెద్దవాళ్లతోనే ఉండు. పెద్దవాళ్లతోనే కలిసి ఉండే ప్రయత్నం చేయి. వేరే వాళ్లతో అవసరం లేదు అని ఆమె హింట్ ఇచ్చారు అని అశ్వినీ శ్రీ తల్లి రమ తెలిపారు.

Ashwini Sree mother Rama Shocking Comments on Shobha Shetty, Priyanka Jain in Bigg Boss Telugu 7

కొందరు నన్ను చూస్తేనే అదో రకంగా బిహేవ్ చేస్తున్నారు. నాతో ఎవరూ కలువడం లేదు. ఎందుకు కలువరో నాకు తెలియదు అని అశ్వినీ శ్రీ అంటే.. అవును నీతో కలువరు.. నీతో వాళ్లు గట్టిగా మాట్లాడితే.. నువ్వు కూడా గట్టిగానే జవాబివ్వు. కానీ అసలు ఏడవకు. స్ట్రాంగ్‌గా ఉండు. ఏది పట్టించుకోకు అంటే అశ్వినీ శ్రీ తల్లి ధైర్యాన్ని నూరిపోసారు.

ఇంటిలో తనతో అదోలా ప్రవర్తించే వారికి గట్టిగానే సమాధానం చెబుతున్నాను. ఎన్ని రోజులు భరిస్తా. ఒకరికి సహనం ఓ రేంజ్ వరకు ఉంటుంది. ఓ దశ తర్వాత సహనం కోల్పోతే గట్టిగా బుద్ది చెప్పాలని నిర్ణయించుకొన్నాను అని అశ్వీనీ ఏడుస్తూ తన తల్లికి చెప్పుకొన్నది. నిన్ను చిన్నచూపు చూస్తుంటే.. ఆ కసితో ఎదగాలి. నీకంటే స్ట్రాంగ్‌ అనిపిస్తే.. వారి కంటే స్ట్రాంగ్‌గా మారాలి అని తల్లి సలహా ఇచ్చారు.

Ashwini Sree mother Rama Shocking Comments on Shobha Shetty, Priyanka Jain in Bigg Boss Telugu 7

ఇంటిలో కొందరు వ్యవహరిస్తున్న తీరుతో ఇంటి నుంచి బయటకు రావాలని అనిపిస్తుంది అంటూ అశ్వినీ శ్రీ భోరున విలపించింది. ఓ సమయంలో తన తల్లి ఒడిలో తలను పెట్టుకొని గుక్కపెట్టి ఏడ్చింది. దాంతో నా అనుకొంటావో వాళ్లు నీ వాళ్లు కాదు..పెద్దవాళ్లే న్యాయంగా మాట్లాడుతారు. వాళ్లతోనే ఉండు. చిన్న మాటకే పెద్ద రాద్దాంతం చేస్తున్నారు. వాటిని పట్టించుకోకు అని అశ్వినీ శ్రీ త్లలి సూచించారు.

ఇంటిలోకి వచ్చిన అశ్వినీ శ్రీ తల్లి భోలే షవాలీని ప్రశంసలతో ముంచెత్తింది. నువ్వు నా ఫ్యామిలీ బేటా అంటూ ప్రేమగా మాట్లాడింది. భోలే గారు మీరంటే చాలా ఇష్టం అని చెప్పింది. ఇంటి నుంచి బయటకు వెళ్తూ భోలేను పట్టుకొని ఏడ్చింది. ఇంటిలోకి వచ్చిన అశ్వినీ శ్రీ తల్లి తన కూతురు కోసం తన పెంపుడు కుక్క సోనమ్ ఫోటోను తెచ్చారు.

Ashwini Sree mother Rama Shocking Comments on Shobha Shetty, Priyanka Jain in Bigg Boss Telugu 7

అశ్వినీ శ్రీకి, ఆమె తల్లికి మధ్య జరిగిన సంభాషణ పరోక్షంగా శోభాశెట్టి, ప్రియాంక జైన్‌ను టార్గెట్ చేస్తూనే సాగింది. వారిద్దరూ తన కూతురిపై చేస్తున్న మాటల దాడికి ఊరట కలిగించేలా ధైర్యం చెప్పే ప్రయత్నం చేసింది. భోలే షవాలీ, శివాజీ లాంటి వాళ్లతోనే ఉండమని సలహా ఇచ్చింది. ప్రతీ విషయాన్ని హృదయంపైకి తీసుకోకు అని రమ తన కూతురిని ఓదార్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X