నీ అమ్మ మొగుడు అంటూ ప్రియాంక జైన్‌కు షాక్..బాలయ్య అఖండ డైలాగ్స్‌తో నోర్మూయించిన అశ్వినీ శ్రీ
బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ షోలో నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా రచ్చ జరిగింది. ఒకరిని మరొకరు నామినేట్ చేస్తూ కంటెస్టెంట్లు వాదులాడుకొన్నారు. ఒక కంటెస్టెంట్‌పై మరో కంటెస్టెంట్ విరుచుకుపడ్డారు. నామినేషన్ ప్రక్రియలో కుండ బద్దలు కొట్టి కంటెస్టెంట్‌ను నామినేట్ చేసే ప్రక్రియ గందరగోళంగా మారింది. అయితే ప్రియాంక జైన్ తన నామినేషన్ ప్రక్రియను కొనసాగిస్తూ అశ్విని నామినేట్ చేసే క్రమంలో వారిద్దరి మధ్య మాటల యుద్దం కొనసాగింది. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ వివరాల్లోకి వెళితే..
వైల్డ్ కార్డు ద్వారా ఇంటికి వచ్చిన మీరు సరిగా ఆడటం లేదు. ఇంటిలో మీరు ఉన్నట్టు కనిపించడం లేదు. టాస్కులు ఆడకుండా టైమ్ పాస్ చేస్తున్నారు. వైల్డ్ కార్డు ఎంట్రీ అంటే వైల్డ్‌గా ఆడాలి. కానీ మీరు అసలు ఆడటం లేదు అంటూ అశ్వినీ శ్రీ, భోలే షవాలిని ఇంటి సభ్యులందరూ టార్గెట్ చేశారు. ఆ క్రమంలో ప్రియాంక జైన్, అశ్వినీ మధ్య ఘాటైన మాటలు చోటు చేసుకొన్నాయి.

టాస్కుల్లో మీరు ఆడటం లేదు అంటూ అశ్వినీ శ్రీని అంటే.. మీరు అంతా గ్రూప్‌గా ఆడుతున్నారు. కాబట్టి మేము మీకు కనిపించడం లేదు. ఇంటిలో మీరంతా ఒక గ్రూప్‌గా ఉన్నారు. మేము పలకరించినా పట్టించుకోవడం లేదు అని అశ్వినీ అన్నారు. అయితే నా గురించి నీకు తెలుసా? నేను నాగురించి చెప్పలేదా ప్రియాంక అంటే.. మీరు నామినేషన్స్‌కు వచ్చే ముందు నీ గురించి చెప్పారు. గత వారంలో రోజుల్లో ఎన్నడైనా మాట్లాడారా? అని అశ్విని చెప్పింది.
అయితే మీరు మాట్లాడే పద్దతి బాగాలేదు. మీరు వ్యవహరించిన తీరు బాగాలేదు. ఇంటి సభ్యులతో మాట్లాడే విధానం అభ్యంతరంగా ఉంది. ఏదైనా అడిగితే.. మీరు సెటైర్లు వేయడం సరిగా లేదు అంటూ ప్రియాంక చెప్పింది. నేను నామినేషన్ సందర్భంగా చెప్పేది విను అని ప్రియాంక అంటే.. నా చెవులు ఇక్కడే ఉన్నాయి. మీరు చెప్పింది వింటున్నాను అంటూ అశ్వీని శ్రీ ఘాటుగా సమాధానం చెప్పారు.
ఇక దశలో ప్రియాంక చోప్రా, అశ్వినీ శ్రీ మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరుకొన్నది. ప్రియాంక మాటలకు అడ్డుపడుతూ.. మాట్లాడే విధానంలో తేడా ఉంది. మీరు మాట్లాడే తీరు ఎలా ఉందంటే.. శ్రీను గారు మీ నాన్న గారు బాగున్నారా? అనే దానికంటే.. శ్రీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నాడా అనే మాటలో చాలా తేడా ఉంటుంది. మీరు మాటలు కూడా అలానే ఉన్నాయి అంటూ అశ్వినీ కడిగిపడేసింది.
ఇదిలా ఉండగా, బిగ్‌బాస్ తెలుగు 7 షోలో 7వ వారం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. వాడివేడిగా జరిగిన నామినేషన్ల ప్రక్రియలో మొత్తం ఈ వారం 7 గురు నామినేట్ అయ్యారు. నామినేట్ అయిన వారిలో భోలే షవాలే, అశ్వినీ శ్రీ, పూజా మూర్తి, పల్లవి ప్రశాంత్, శోభా శెట్టి, టేస్టీ తేజ, ప్రియాంక జైన్ నామినేట్ అయ్యారు.


Click it and Unblock the Notifications











