Ashwini Sri Remuneration: 7 వారాలకే అన్ని లక్షలు.. అశ్విని రెమ్యూనరేషన్ చూస్తే షాకే!

నేషనల్ వైడ్‌గా చాలా భాషల్లో ప్రసారం అవుతోన్నా.. తెలుగులో మాత్రం అత్యధిక రేటింగ్‌ను సొంతం చేసుకుంటూ నెంబర్ వన్ షోగా హవాను చూపిస్తోంది బిగ్ బాస్. దీంతో నిర్వహకులు రెట్టించిన ఉత్సాహంతో సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో దాన్ని సరికొత్త హంగులతో చాలా కొత్తగా నడుపుతున్నారు. ఇక, ఇందులో బ్యూటిఫుల్ కంటెస్టెంట్‌ అనిపించుకున్న అశ్విని శ్రీ.. 12వ వారంలోనే ఎలిమినేట్ అయిపోయింది. ఈ నేపథ్యంలో ఆమె ఈ సీజన్ కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ వివరాలను మీరు కూడా చూడండి!

Ashwini Sri Bigg Boss Season 7 Remuneration Details Leaked

కంటెంట్ మారడంతో ఫుల్: తెలుగులో బిగ్ బాస్ షో ఎప్పుడు వచ్చినా భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తుంటుంది. అందుకే ఇప్పటికే ఆరు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్లను పూర్తి చేసుకుంది. ఇక, ఇప్పుడు దీనికి సంబంధించిన ఏడో సీజన్ కూడా మొదలై మరింత కొత్త కంటెంట్‌తో ఆసక్తికరంగా సాగుతోంది. కానీ, దీనికి ఆశించిన దానికంటే ఎక్కువగానే రేటింగ్ వస్తోంది. దీంతో మరిన్ని ఉల్టా పుల్టా ప్లాన్లు వేస్తున్నారు.

వైల్డ్ కార్డుతో వచ్చి హైలైట్: బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి మొదట 14 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా ఎంటరయ్యారు. ఆ తర్వాత మరో ఐదుగురు వైల్డ్ కార్డు ద్వారా అడుగు పెట్టారు. వీళ్లంతా తమ తమ విభాగాల్లో ఎనలేని క్రేజ్‌ను దక్కించుకున్నారు. అందులో పలువురు మాత్రమే బాగా హైలైట్ అయ్యారు. వారిలో బ్యూటిఫుల్ లేడీ అశ్విని శ్రీ ఒకరు. ఆరంభంలోనే అందం, ఆటతీరుతో ఈమె బాగా మెప్పించింది.

Ashwini Sri Bigg Boss Season 7 Remuneration Details Leaked

మంచి పేరు.. సపోర్ట్ లేదు: బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా వచ్చినప్పటి నుంచే అశ్విని తన మార్కు చూపించే ప్రయత్నాలు చేసింది. ముఖ్యంగా షోలో ఇచ్చే టాస్కుల్లో ఎంతో యాక్టివ్‌గా పాల్గొంది. అలాగే, తన గొంతును వినిపిస్తూ చాలా సార్లు గొడవలు కూడా పెట్టుకుంది. చాలా టాస్కుల్లో అందరి కంటే వేగంగా చేసినా తెలివి లేక ఓడిపోయింది. దీంతో అశ్విని శ్రీకి సపోర్టు పెద్దగా పెరగలేదు.

12వ వారంలో ఎలిమినేట్: బిగ్ బాస్ ఏడో సీజన్‌లో ఎక్కువగా షాకింగ్ ఎలిమినేషన్స్ కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే 11వ వారంలో ఎలిమినేషన్ లేకపోవడంతో 12వ వారంలో డబుల్ ట్రబుల్ పెట్టారు. ఇలా శనివారం జరిగిన ఎపిసోడ్‌లో ఎవరినీ సేవ్ చేయకుండా డైరెక్టుగా ఎలిమినేషన్‌ చూపించారు. ఇక, ఇందులో అందరూ అనుకున్నట్లుగానే అశ్విని శ్రీ షో నుంచి ఎలిమినేట్ అయిపోయింది.

Ashwini Sri Bigg Boss Season 7 Remuneration Details Leaked

అశ్విని రెమ్యూనరేషన్ లీక్: బిగ్ బాస్ హౌస్‌లోకి ఆరో వారంలో ఎంట్రీ ఇచ్చిన అశ్విని 12 వారంలో ఎలిమినేట్ అయింది. అంటే హౌస్‌లో 7 వారాల పాటు కంటెస్టెంట్‌గా కొనసాగింది. దీంతో ఆమెకు బిగ్ బాస్ నిర్వహకులు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారన్న దానిపై అప్పుడే పలు రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. అశ్విని ఒక్కో వారానికి రెండు లక్షలు తీసుకుందని తెలుస్తోంది.

7 వారాలకే అన్ని లక్షలు: బిగ్ బాస్ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం.. అశ్విని శ్రీ బిగ్ బాస్ ఏడో సీజన్ కోసం రోజుకు రూ. 28.57 వేల చొప్పున వారానికి రూ. 2 లక్షలు చార్జ్ చేసిందట. అలా ఏడు వారాల పాటు ఉన్న అశ్విని మొత్తంగా రూ. 14 లక్షలు రెమ్యూనరేషన్‌గా తీసుకుందనే టాక్ వినిపిస్తోంది. చాలా మంది కంటెస్టెంట్లతో పోల్చుకుంటే ఇది చాలా ఎక్కువే అని పలువురు అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X