Bigg Boss Telugu 7 Finale: అరేబియన్ రేసుగుర్రం అశ్విని శ్రీ సీక్రెట్ క్రష్ అతడేనట.. స్టేజీపైన సీక్రెట్ రివీల్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన కాన్సెప్ట్ తో వచ్చి అందరితీ 105 రోజుల పాటు విపరీతంగా అలరించిన షో ఈరోజుటితో ముగిసిపోనుంది. 15 వారాల పాటు ఎవరూ ఊహించని టాస్క్ లు ఇస్తూ అనేక రకాల ఆటలతో ఆహా అనిపించి... ఈరోజు గ్రాండ్ గా విన్నర్, రన్నరప్ లను ప్రకటించబోతున్నారు. ముఖ్యంగా టాప్ 5 కంటెస్టెంట్లు ఎవరు, డబ్బులు ఎవరు దక్కించుకున్నారు, వన్నర్ గా నిలిచిన వ్యక్తికి ప్రైజ్ మనీ ఎంత ఇచ్చారనే విషయాలపై అంతా ఆసక్తి కనబరుస్తున్నారు. అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈరోజటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల అయింది.

అయితే ఈ ప్రోమోలో అనేక రకాల ఆటలు, పాటలు, కామెంట్లు, జోకులు ఉండగా... ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్ లో అడుగు పెట్టిన అరేబియన్ గుర్రం అశ్విని శ్రీ గురించి అందరికీ తెలిసిందే. ఆమె అందాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె బిగ్ బాస్ హౌస్ కి వచ్చిన తర్వాత నుంచి చాలా మంది కుర్రకారుకు హాట్ ఫేవెరట్ కంటెస్టెంట్ గా మారిపోయింది. హౌస్ లో ఆమె ఉన్నది తక్కువ కాలమే అయినా చాలా బాగా అలరించింది. ఆమె హౌస్ నుంచి వెళ్లిపోయాక చాలా మంది ఆమెను మిస్ అయ్యారు.

Ashwini Sri Shocking Comments on Nagarjuna In Bigg Btelugu 7 Finale

అయితే పినాలే ఎపిసోడ్ లో భాగంగా అశ్విని శ్రీ మరోసారి స్టేజీపై అడుగు పెట్టింది. అందరినీ అలరించేందుకు తెగ ట్రై చేస్తోంది. ముఖ్యంగా స్పెషల్ డాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా చేసిందని తెలుస్తోంది. ఏది ఏమైనా ప్రేక్షకులను అలరించడంలో ఎప్పుడూ ముందుండే ఈ ముద్దుగుమ్మ తాజాగా తన సీక్రెట్ క్రష్ ఎవరో రివీల్ చేసింది. వందలాది మంది ప్రేక్షకులు చూస్తుండగా... తనకు ఎవరు కావాలో చెప్పేసింది. కానీ తాను కావాలనుకున్న వ్యక్తి మాత్రం గట్టి షాకిచ్చాడు. ఇంత అందగత్తెకు నో చెప్పిన ఆ ఘనుడు ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

అశ్విని శ్రీ కి చాలా మంది ప్యాన్స్ ఉన్నారు. బయటే కాకుండా హౌస్ లోని ఆమెను ఇష్ట పడేవారు ఎక్కువగానే ఉన్నారు. ఇటీవలే యావర్ అశ్విని శ్రీ పై ప్రేమను బయట పెట్టగా.. తాజాగా ఆమె తనకు మరో జన్మంటూ ఉంటే టాలీవుడ్ కింగ్ నాగార్జున కావాలని చెప్పింది. ఆయన అంటే పిచ్చి అనే.. కనీసం వచ్చే జన్మలో అయినా సరే తనకు నాగ్ సార్ కావాలని స్టేజీ మీదే రివీల్ చేసింది. ఆ విషయం విన్న అందరూ ఫుల్ గా నవ్వుకున్నారు. అయితే అశ్విని కోరిక తెలుసుుకున్న నాగార్జున చాలా హ్యాపీగానే ఫీలైన గట్టి షాకిచ్చారు.

Ashwini Sri Shocking Comments on Nagarjuna In Bigg Btelugu 7 Finale

మన్మథుడిగా పేరొందిన ఆయనను ఇష్ట పడే వాళ్ల సంఖ్య ఎంత ఉన్నా.. అతడి కలల రాణి మాత్రం అమలనే అని చెప్పాడు. తనకు అమల చాలు అని ఇంకెవరూ వద్దని డైరెక్ట్ గా చెప్పేశాడు. దీనిక్కూడా అంతా నవ్వారు. కానీ అశ్వినీ కాస్త ఫీలైనట్లు అనిపించింది. పాపం అంతగా ఇష్టపడితే నెక్స్ట్ జన్మలో కూడా ఛాన్స్ ఇవ్వనని డైరెక్ట్ గా చెప్పేశాడు కింగ్ నాగార్జున. ఈరోజుటి పూర్తి ఎపిసోడ్ చూస్తే తప్పు మొత్తం క్లారిటీ వచ్చేలా లేదు. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X