For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సుమ-రాజీవ్ కనకాల బంధం డౌటే.. ఆ పూజల వల్లే ఇలా అంటూ వేణు స్వామి సంచలనం!

  |

  వార్తలు లేనపుడల్లా ఏదో ఒక రకమైన వార్తలు పుట్టిస్తూ ఉంటారు కొన్ని ఊరు పేరు లేని వెబ్ పోర్టల్ నిర్వాహకులు. అలా ముఖ్యంగా సినిమా సెలబ్రిటీలు టీవీ సెలబ్రిటీల గురించి అనేక వార్తలు పుట్టిస్తూ ఉంటారు. ఈ కోవలోనే టెలివిజన్లో స్టార్ యాంకర్ గా కొనసాగుతున్న సుమ తన భర్త రాజీవ్ కనకాల తో విడిపోయారని వారిద్దరి విడాకులు కూడా తీసుకోబోతున్నారు అంటూ ఆ మధ్య ప్రచారం జరిగింది. ఆ ప్రచారం మీద రాజీవ్ కనకాల కూడా కొన్ని సార్లు స్పందించారు కూడా. అయితే ఇప్పుడు వేణు స్వామి అనే జ్యోతిష్యుడు వీరి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే

  మళ్ళీ విడాకులు అంటూ

  మళ్ళీ విడాకులు అంటూ

  సుమ కనకాల అనే పేరు తెలియని తెలుగువారు ఉండరు. అంతలా ఆమె టెలివిజన్ లో యాంకర్ గా అనేక షోలు నిర్వహిస్తూ చాలా ప్రతిష్టాత్మక సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్ లకు యాంకరింగ్ నిర్వహించే స్థాయిలో ఉన్నారు. ఇప్పటికి కూడా ఆమె ప్రతి సినిమా ఈవెంట్ లో కనిపిస్తూ ఉంటారు. అయితే నిజానికి సుమ రాజీవ్ కనకాల ఒక సీరియల్ షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒకరికొకరు ఇష్టపడి ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి అన్యోన్య దంపతులుగా వస్తున్న వీరి ప్రేమకు గుర్తుగా రోషన్, మనస్విని అనే ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు.

  హాట్ టాపిక్ గా

  హాట్ టాపిక్ గా


  అయితే వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు అని చాలా రోజులుగా వీరిద్దరూ కలిసి కూడా ఉండటం లేదని ప్రచారం జరిగింది. దీంతో రాజీవ్ అసలు తమ మధ్య ఏం జరిగింది ? ఏం జరుగుతుంది ? అనే విషయం మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం తాము ఇద్దరం కలిసి ఉండటం లేదు అనే మాట నిజమే అని ఆయన గతంలో పేర్కొన్నారు.

  అసలు ఏమైందంటే?

  అసలు ఏమైందంటే?

  రాజీవ్ అమ్మ నాన్న కలిసి మణికొండలో ఉన్న తమ సొంత ఇంట్లో ఉండేవారని, అమ్మ చనిపోయాక తన తండ్రి ఒక్కరే మణికొండ నివాసంలో ఉండేవారని, ఆయనను మా ఇంటికి తీసుకు రావాలని అనుకున్నా ఆయనతో పాటు ఉన్న లైబ్రరీ చాలా పెద్దదని వాటన్నింటినీ మా ఫ్లాట్ కి షిఫ్ట్ చేయడం అంటే కుదరదు కాబట్టి తండ్రికి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఇంటికి దూరంగా ఆయనతోపాటు ఉండేవాడినని రాజీవ్ చెప్పుకొచ్చారు. అలాగే వీలు కుదిరినప్పుడల్లా సుమ, పిల్లల దగ్గరికి వెళ్లి చూసి వచ్చే వాడినని, దీనికి విడిపోయాం అంటూ పుకార్లు పుట్టించడం సరికాదని ఆయన చెప్పుకొచ్చారు.

  ఆసక్తికర వ్యాఖ్యలు

  ఆసక్తికర వ్యాఖ్యలు


  తాజాగా ప్రముఖ సినీ, పొలిటికల్ ఆస్ట్రాలజర్ వేణు స్వామి ఈ అంశం గురించి షాకింగ్ విషయాలు తన తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. సమంత-నాగ చైతన్యలు విడిపోతారని వాళ్ల పెళ్లి కాకముందే చెప్పిన ఈ జోతిష్యుడు.. తాజాగా ఈ ఇష్యూ హాట్ టాపిక్ అవుతుండటంతో దానిని క్యాష్ చేసుకునేందుకు మళ్లీ తెరపైకి వచ్చాడు. అదే విషయం గురించి మాట్లాడుతూ సుమ-రాజీవ్ కనకాల ఇష్యూని తెరపైకి తెచ్చాడు.

  నేనే చేయించా

  నేనే చేయించా


  రాజీవ్ కనకాల-సుమలకు దోష నివారణ పూజలు చేయించుకున్నారని, అవి నేనే చేశానని ఆమె వెల్లడించారు. ఆ పూజలు చేసిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఉంటున్నారని, అయితే భవిష్యత్‌లో ఏమౌతుందో చెప్పలేను కానీ ప్రస్తుతానికి దోష నివారణ పూజలు ఫలించదాంతో కలిసే ఉంటున్నారు' ఆయన చెప్పుకొచ్చారు. ఆయన చెప్పోయింది నిజమో కాదో తెలియదు కానీ ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారింది.

  English summary
  Astrologer Venu Swamy Shocking Comments On Suma And Rajeev Kanakala relation in recent interview.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X