జ్యోతిష్యుడి అవతారమెత్తిన బిత్తిరి సత్తి.. వేణుస్వామి రియాక్షన్ ఏంటంటే?

ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి ఈయన గురించి మరింత ఎక్కువగా తెలుసు. ఎందుకంటే సెలబ్రిటీల జాతకాలు చెబుతూ ఎప్పుడూ రచ్చ చేసే ఈయన.. అలాగే పాపులారిటీ సంపాదించురన్నారు. చాలా మంది ఈయన చెప్పేది నిజమని నమ్ముతుండగా.. మరికొంత మంది వీడికేం పనీ పాట లేదంటూ ట్రోల్స్ కూడా చేస్తుంటారు. అయితే తాజాగా ఈయన బిత్తిరి సత్తిపై షాకింగ్ కామెంట్లు చేశారు. ముఖ్యంగా సత్తి వేణు స్వామిని ఇమిటేట్ చేయగా.. దానిపై స్పందించారు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

జ్యోతిష్యుడు వేణుస్వామి ఎక్కువగా సినీ తారలతో పాటు.. రాజకీయ నాయకుల జాతకాల గురించి మాట్లాడతారు. ముఖ్యంగా వారి వ్యక్తిగత జీవితాల్లో జరిగే అనేక విషయాల గురించి చెబుతుంటారు. అయితే అందులో కొన్ని జరుగుతుండగా మరికొన్ని మాత్రం అస్సలే జరగవు. తాను చెప్పిన వాటిలో జరిగిన వాటిని కొన్నింటినీ హైలైట్ చేస్తూ చివరకు ఈయన కూడా నెట్టింట్లో ఓ సెలబ్రిటీలా మారాడు.

Astrologer Venu Swamy Shocking Reaction on Bithiri sathi About He Imitetes Venuswamy Check Details

ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య నేతలు, ముఖ్యమంత్రులు.. సినీ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్​, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్​, అక్కినేని అఖిల్, హీరోయిన్ సమంత, అక్కినేని నాగచైతన్య.. ఇలా చాలా మందికి జాతకాలు చెప్పారు. అంతేకాకుండా అనేక మంది హీరోయిన్లకు పూజలు కూడా చేయించారు. డింపుల్ హయాతి, నిధి అగర్వాల్, రష్మిక మందన్న, బిగ్ బాస్ ఫేమ్ ఇనయ సుల్తానా, అషురెడ్డి ఇలా చాలా మంది వామాచారంలో పూజలు కూడాచేయించుకున్నారు. ఇలా ఎప్పుడో ఎవరో ఒక సెలబ్రిటీ గురించి చెప్పే ఈయన తాజాగా ఓ న్యూస్ కు సంబంధించిన వ్యక్తి గురించి చెప్పుకొచ్చారు.

ముఖ్యంగా బిత్తిరి సత్తి అలియాస్ రవి చేవెళ్ల గురించి కూడా అందరికీ తెలిసిందే. అయితే ఈయన ఇటీవలే జ్యోతిష్యుడు అవతారం ఎత్తారు. ముఖ్యంగా ఓ ప్రముఖ ఛానెల్ చేసిన ఓ ఈవెంట్ లో బిత్తిరి సత్తి.. నా పేరు వేలు స్వామి అంటూ వచ్చి తెగ కామెడీ చేశాడు. అందరినీ కడుపుబ్బా నవ్వించాడు. అయితే ఈ వీడియో చూసిన వేణు స్వామి తాజాగా స్పందించారు. ముఖ్యంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మరీ షాకింగ్ కామెంట్లు చేశారు. బిత్తిరి సత్తి తన పేరు, తన అవతారంలో కనిపించడం తనకే గౌరవం అని చెప్పుకొచ్చారు.

Astrologer Venu Swamy Shocking Reaction on Bithiri sathi About He Imitetes Venuswamy Check Details

తనకు మరింత పేరు తీసుకురావడంతో పాటు తన మార్కెట్ ను బిత్తిరి సత్తి మరింత పెంచాడని వేణు స్వామి వివరించారు. అయితే 2013లో ఓ న్యూస్ ఛానెల్ లో యాంకర్ గా ఎంటర్ అయిన అతడిని చూసి నువ్వు భవిష్యత్తులో న్యూస్ ఛానెల్స్ ను దున్నేస్తావని చెప్పినట్లు వివరించారు. ఆయన అమ్మ మాట ప్రకారమే బిత్తిరి సత్తి తీన్ మార్ వార్తలతో సెన్సేషన్ క్రియేట్ చేశారని.. ఆయన ఆధ్వర్యంలో కెరియర్ ప్రారంభించిన ఆయన ఇప్పుడు తనపైనే కామెంట్లు చేయడం నిజంగా గ్రేట్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X