Venu Swamy on Anasuya: మహానటి అనసూయ.. రాజకీయాల్లోకి ఎంట్రీ.. వేణుస్వామి అప్పుడే చెప్పేసాడు!
యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ తాజాగా సోషల్ మీడియాలో ఏడుస్తూ పోస్ట్ చేసిన వీడియో అనేక చర్చలకు దారితీసింది. అయితే ఆ ఏడుస్తున్న వీడియో షేర్ చేసిన కాసేపటికి తాను ఇప్పుడు బాగానే ఉన్నానని చెబుతూ మరొక వీడియో కూడా ఆమె షేర్ చేసింది.
అయితే ఆమె ఏడుస్తున్న వీడియో చూసి అనేకమంది కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో అనసూయ జాతకం గురించి ప్రముఖ జ్యోతిష్య నిపుణుడు వేణు స్వామి చేసిన కామెంట్లు తెరమీదకు వచ్చాయి. అసలు అనసూయ గురించి వేణు స్వామి ఏమన్నాడు? ఎందుకు ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తెరమీదకు వచ్చాయనే పరిశీలించే ప్రయత్నం చేద్దాం.

తాజాగా అనసూయ భరద్వాజ్ తాను వెక్కివెక్కి ఏడుస్తున్న ఒక వీడియో షేర్ చేసి... బాధగా అనిపించినప్పుడు ఏడవాలి, ఏడవాలి అనిపించినప్పుడు ఏడ్చేయాలి, నేనేంటి ఒక సెలబ్రిటీని, లేకపోతే ఇంత గట్టి మనిషిని ఎందుకు ఏడవాలి అని అంతే గంభీరంగా ఉంటే ఆ బాధ తీరదని, అందరిలాగే ఏడవాలి అనిపించినప్పుడు ఏడిస్తే మళ్లీ తర్వాత ఎలాంటి ఇబ్బంది లేకుండా రోజు ప్రారంభించవచ్చు అని అర్థం వచ్చేలా కామెంట్ చేసింది.
అయితే ఆమె షేర్ చేసిన వీడియోలో సోషల్ మీడియా అనే పదం ఉండడంతో ఆమె సోషల్ మీడియాలో వస్తున్న నెగెటివిటీ తట్టుకోలేక ఏడుస్తుందంటూ అందరూ వార్తలు రాసుకోచ్చారు. ఈ నేపథ్యంలో మరొక వీడియో రిలీజ్ చేసిన అనసూయ భరద్వాజ్ తాను ఏడ్చింది అందుకు కాదని ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆ సందర్భంలో తనకు ఏడుపు వచ్చిందని ఆ ఏడుపుని రికార్డు చేసుకున్నానని ఆ రికార్డు చేసిన వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాను తప్ప సింపతి కోసమో లేక ఇంకేదో చేయడం కోసమో నేను ఆ వీడియో షూట్ చేసి రిలీజ్ చేయలేదని చెప్పుకొచ్చింది.

అయితే ఈ రెండు వేరువేరు రకాల వీడియోలు చూసిన వారంతా అనసూయ మహానటి అని కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది ఆమెను ఎప్పటిలాగే ట్రోల్ చేస్తుంటే కొందరు మాత్రం ఆమె రాజకీయాల్లోకి ఏమైనా వెళుతుందా ఏమిటి? ఇంతలా మాటలు మార్చేస్తుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే నిజానికి రాజకీయాల్లోకి వెళుతుందని గతంలోనే వేణు స్వామి వెల్లడించారు. గతంలో వేణు స్వామి ఏమన్నారు ఇప్పుడు చూద్దాం.
2021 తర్వాత అనసూయ జాతకం మారనుందని గతంలోనే ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి చెప్పారు. ఆమెకు తిరుగు ఉండదు.. చాలా కాలం పాటు.. ఇండస్ట్రీలో కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. ఇక ఆమె రాజకీయాల్లోకి కూడా రావచ్చని వెల్లడించారు. ఇప్పుడు ఈ మాటలు నిజమని తెలుస్తోంది. ఎందుకంటే.. 2021 తర్వాత అనసూయ క్రేజ్ రెట్టింపు అయింది. ఆమె బుల్లితెర నుంచి వెండితెరపైకి వచ్చింది. పుష్ప సినిమాతో ఆమెకు మరింత క్రేజ్, పాపులారిటి అయితే వచ్చింది. ఇక వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఆయన చెప్పినట్లుగానే ఫ్యూచర్ లో అనసూయ రాజకీయాల్లోకి వచ్చిన ఆశ్చర్యం ఉండదు.


Click it and Unblock the Notifications











