Bigg Boss Telugu 7: రికార్డు సృష్టించిన ఏకైక కంటెస్టెంట్.. ఇప్పటివరకు ఆ జోన్‌లోకే ఎంటర్ అవ్వలేదుగా!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 సెప్టెంబర్ 3న ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఇక అక్టోబర్ 8న వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చారు. ఇక అప్పటి నుంచి ఆట తీరే మారిపోయింది. ఇప్పటి వరకు ఆరు వారాలు పూర్తి అయ్యాయి. ఇక 7 వ వారం నామినేషన్స్ కూడా అయ్యాయి. అయితే ఇప్పటి వరకు డేంజర్ డోన్ కు వెళ్లని ఏకైక కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నారు. ఆయన నామినేషన్స్ లోకి వెళ్లకుండా బిగ్ బాస్ హౌస్ లో రికార్డు సృష్టించారు. అతను ఎవరు.. ఎందుకు వెళ్లలేదో ఆ వివరాలు ఈ షో లో తెలుసుకుందాం.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఉల్టా పుల్టా అంటూ సాగుతోంది. రోజుకో ట్విస్టు, షాక్ అంటూ బిగ్ బాస్ కూడా బాగానే ఎంటర్ టైన్ చేస్తుంది. అయితే మొదటి వారం నుంచి ఇప్పటి 7వ వారం వరకు నామినేషన్స్ లో అడుగుపెట్టని కంటెస్టెంట్ ఒకరు ఉన్నారు. అయితే ఆ వ్యక్తి ఏ మిస్టేక్ చేయకుండా అంత బాగా ఆడుతున్నారా అని మీకు డౌట్ రావొచ్చు. ఎంత బాగా ఆడినా కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని నామినేట్ చేయాలి.. మరి ఎందుకు ఆయన నామినేషన్స్ లోకి రాలేదో చూద్దాం.

Ata Sandeep created a record as the only contestant who has not been nominated in the BiggBoss Telugu 7 show

బిగ్ బాస్ షోలోఇప్పటి వరకు నామినేషన్స్ లోకి రాని కంటెస్టెంట్ ఆట సందీప్. ఆయన మొదటి వారం నుంచి 7వ వారం వరకు నామినేషన్స్ లోకి ఎంటర్ అవ్వలేదు. ఇక మొదటి వారం నామినేషన్స్ లేని సందీప్... రెండో వారం నుంచి ఆయన సంచాలక్ గా ఇంట్లో బాధ్యతలు చూసుకున్నాడు. మొదటి పవర్ అస్త్ర సాధించిన వ్యక్తిగా సందీప్ రికార్డు క్రియేట్ చేశాడు. అలా మొదటి పవర్ అస్త్ర సాధించి... సందీప్ మొదటి హౌస్ మేట్ అయ్యాడు.

ఆ తర్వాత శివాజీ, శోభాశెట్టి పవర్ అస్త్ర సాధించి... తర్వాతి హౌజ్ మేట్స్ అయ్యారు. సంచాలక్ గా కొన్నివారాలు బాగానే గడిచాయి. ఆ తర్వాత ఆయనకు బిగ్ బాస్ ఇచ్చిన ఇమ్యూనిటీ అయిపోయాకా... మళ్లీ ఆరో వారంలో నామినేషన్స్ లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఐదో వారం ఉల్టా పుల్టా అంటూ.. వైల్డ్ కార్డు ఎంట్రీస్ వచ్చాయనే విషయం తెలిసిందే. ఇక ఈ ఎంట్రీస్ లో ఐదుగురు హౌస్ లో ఎంటర్ అయ్యారు.

అందులో అర్జున్ అంబటి, పూజా మూర్తి, బోలే షవాలి, నయని పవని, అశ్విని శ్రీ ఉన్నారు. అయితే సీరియల్ హీరో అర్జున్ అంబటి రావడం రావడమే.. స్టార్ మా బ్యాచ్ కు వ్యతిరేకంగా తన ఆటను ప్రారంభించాడు. ఇక అప్పటి వరకు నామినేషన్స్ లో లేని సందీప్ ను మొదటి సారిగా నామినేట్ చేసింది అర్జున్ అంబటి. ఇక నామినేషన్స్ లోకి ఆట సందీప్ వచ్చాడు అనుకునే లోపే మరో ట్విస్టు చోటుచేసుకుంది. ఇక ఐదో వారంలో ఓ ఎలిమిమేషన్ తో పాటు.. ఫేక్ ఎలిమినేషన్ జరిగిన విషయం తెలిసిందే.

Ata Sandeep created a record as the only contestant who has not been nominated in the BiggBoss Telugu 7 show

శుభ శ్రీ ఎలిమినేట్ అవ్వగా... గౌతమ్ సీక్రెట్ రూమ్ కు వెళ్లిపోయాడు. ఆయన మళ్లీ తిరిగి వచ్చాకా.. వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ జట్టులో చేరాడు. అయితే గౌతమ్ కు బిగ్ బాస్ ఓ డైరెక్ట్ నామినేషన్ లేదా సేవ్ చేసే అప్షన్ ఇచ్చాడు. ఇక గౌతమ్.. సేవ్ అప్షన్ ఎంచుకుని నామినేషన్స్ లో ఉన్న ఆట సందీప్ ను కాపాడాడు. ఇక అలా ఆరో వారం కూడా ఆట సందీప్ నామినేషన్స్ లోకి ఎంటర్ అవ్వలేదు. ఇక ఏడో వారం నామినేషన్స్ లో కూడా సందీప్ లేకపోవడంతో... దీంతో ఇప్పటి వరకు నామినేషన్స్ లో అడుగుపెట్టని ఏకైక కంటెస్టెంట్ గా సందీప్ రికార్డు సృష్టించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X