Bigg Boss Telugu7: బిగ్ బాస్ హిస్టరీలో ఆ కంటెస్టెంట్ వరల్డ్ రికార్డు... లక్కు తోక తొక్కాడా ఏంటి భయ్యా?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఉల్టా పుల్టా అంటూ సాగుతోంది. ఇప్పటికే 7వారాలు పూర్తి చేసుకున్న ఈ షో... 8వ వారంలోకి అడుగుపెట్టింది. ఇక 8వ వారం నామినేషన్స్ కూడా హాట్ హాట్ గా సాగాయి. అయితే ఓ కంటెస్టెంట్ మాత్రం ఇప్పటి వరకు నామినేషన్స్ లోకి వెళ్లకుండా వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు ఆయన డేంజర్ జోన్ లోకి వెళ్లకపోవడంతో... ఈ కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే ముందు లక్కు తోక తొక్కి వచ్చాడా ఏంటి అని అంటున్నారు. అతను ఎవరు.. ఎందుకు వెళ్లలేదో ఆ వివరాలు ఈ షో లో తెలుసుకుందాం.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఉల్టా పుల్టా అంటూ రసవత్తరంగా సాగుతోంది. రోజుకో ట్విస్టు, షాక్ అంటూ బిగ్ బాస్ కూడా బాగానే ఎంటర్ టైన్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అయితే మొదటి వారం నుంచి ఇప్పటి 8వ వారం వరకు నామినేషన్స్ లో అడుగుపెట్టని కంటెస్టెంట్ ఆట సందీప్. ఇప్పటి వరకు ఆయన నామినేషన్స్ లో లేకుండా వరల్డ్ రికార్డు సృష్టించాడు. బిగ్ బాస్ హిస్టరీలోనే ఏ కంటెస్టెంట్ ఇలా నామినేషన్స్ లోకి రాకుండా లేరు. సందీప్ వరల్డ్ రికార్డు సృష్టించాడు.

అయితే ఆట సందీప్ ఇప్పటి వరకు ఏ మిస్టేక్ చేయలేదా.. 8 వారాలుగా ఎందుకు నామినేషన్స్ రావడం లేదు.. వీక్ కంటెస్టెంట్ అయితే.. ఆ కారణం చెప్పి చేస్తారు.. స్ట్రాంగ్ అయితే.. ఆ కారణం చెప్పి చేస్తారు.. కానీ ఆయన ఎందుకు నామినేషన్స్ లోకి రావడం లేదు.. అని ఆలోచిస్తే.. ఆయనకు మొదట పవర్ అస్త్ర సాధించి మొదటి హౌస్ మేట్ అయ్యారు. ఆ తర్వాత సంచాలక్ గా మారి హౌస్ ను మెయిన్ టెయిన్ చేశాడు.
సందీప్ తర్వాత శివాజీ, శోభాశెట్టి, పల్లవి ప్రశాంత్ పవర్ అస్త్ర సాధించి హౌస్ మేట్స్ అయ్యారు. ఇక సంచాలక్ గా సందీప్ కొన్ని వారాలు నడిపించారు. బిగ్ బాస్ ఇచ్చిన ఇమ్యూనిటీ అయిపోయాకా... మళ్లీ ఆరో వారంలో నామినేషన్స్ లో... వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ సందీప్ కు షాక్ ఇచ్చారు. అర్జున్ అంబటి రావడం రావడమే... సందీప్ ను, అమర్ దీప్ ను నామినేట్ చేశాడు. ఇక ఈ వారం నామినేషన్స్ లో సందీప్ ఉన్నాడు అనుకునే లోపే.. అదృష్టం సందీప్ కు బాగా కలిసివచ్చింది.
ఇక ఐదో వారంలో ఓ ఎలిమిమేషన్ తో పాటు.. ఫేక్ ఎలిమినేషన్ జరిగిన విషయం తెలిసిందే. శుభ శ్రీ ఎలిమినేట్ అవ్వగా... గౌతమ్ సీక్రెట్ రూమ్ కు వెళ్లిపోగా.. ఆయన మళ్లీ రిటర్న్ హౌస్ లోకి వచ్చాడు. ఇక బిగ్ బాస్ ఆయనకు ఓ డైరెక్ట్ నామినేషన్ లేదా సేవ్ చేసే అప్షన్ ఇచ్చాడు. ఇక గౌతమ్.. సేవ్ అప్షన్ ఎంచుకుని నామినేషన్స్ లో ఉన్న ఆట సందీప్ ను సేవ్ చేశాడు. ఇక అలా ఆరో వారం కూడా ఆట సందీప్ నామినేషన్స్ లోకి ఎంటర్ అవ్వలేదు.

ఇక ఏడో వారం నామినేషన్స్ లో ప్రియాంక, శివాజీ, యావర్, గౌతమ్, ప్రశాంత్, అమర్ దీప్, బోలే షవాలి నిలిచారు. అయితే సందీప్ ను కూడా నామినేట్ చేయగా.. బిగ్ బాస్ నామినేషన్స్ లో సింగిల్ ఓట్ ను కన్సిడర్ చేయలేదు. దీంతో ఈ వారం కూడా ఆయన సేఫ్ అయిపోయాడు. ఇక 9వ వారం వరకు సందీప్ నామినేషన్స్ లో ఉండడు అనమాట. దీంతో సందీప్.. ఇప్పటి వరకు డేంజర్ జోన్ లోకి అడుగుపెట్టకుండా వరల్డ్ రికార్డు సృష్టించాడు.
ఇక సందీప్ ఆట విషయానికి వస్తే... ఆయన మొదటి నుంచి అందరితో కలిసిమెలసి ఉంటున్నాడు. గొడవ పెట్టుకున్న సాల్వ్ చేసుకుంటున్నాడు. దీంతో ఆయన ప్రతి వారం సేఫ్ అవుతూ వస్తున్నాడు. ఇక నామినేషన్స్ లోకి వచ్చినా.. సింగిల్ ఓట్ కౌంట్ చేయడం లేదు బిగ్ బాస్. దీంతో ఆయన లక్కు తోక తొక్కాడా ఏంటి అని నెటిజన్స్ అంటున్నారు. చూడాలి మరి ఏం జరగనుందో.


Click it and Unblock the Notifications











