Bigg Boss Telugu 7: అతడే బిగ్‌బాస్‌ను నడిపిస్తున్నాడు... సందీప్ షాకింగ్ కామెంట్స్

ఆట సందీప్.. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి.. గత 8వారాలుగా అలరించి ఇటీవల బయటకు వచ్చేశాడు. ఇక 7 వారాలుగా నామినేషన్స్ లో లేకుండా రికార్డులు సృష్టించిన ఆట సందీప్... 8 వ వారంలో నామినేట్ అయి.. ఎలిమినేట్ అయిపోయారు. ఇక 8 వారాలు తన ఆటతో ఆకట్టుకున్న ఆట సందీప్.. మొత్తానికి బయటకు వచ్చేశాడు. ఇక బయటకు వచ్చాక బిగ్ బాస్ హౌస్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ముఖ్యంగా శివాజీ గురించి చెప్పిన కామెంట్స్ షాకింగ్ గా అనిపిస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే....

బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా అంటూ సాగుతున్న విషయం తెలిసిందే. ఈ సారి మాత్రం ప్రేక్షకులకు ఈ షో మంచి కిక్ ఇస్తుంది. ఊహకు అందకుండా బిగ్ బాస్ షో అయితే నడుస్తుంది. మొదటి విడతలో షోలోకి 14 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు. అందులో ఒకరే ఆట సందీప్. ఇక ఆట సందీప్ స్టార్ మాకు ఎప్పటి నుంచో పరిచయమే. డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చేస్తూ.. అందులో విన్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఆట సందీప్ మొదటి నుంచి అందరి దృష్టిని ఆకర్షించాడు.

Ata Sandeep Shocking Comments on Sivaji about Bigg Boss Telugu 7 Show

బిగ్ బాస్ సీజన్ 7 లో ముఖ్యంగా రెండు బ్యాచ్ లు అయిపోయాయి. ఒకటి శివాజీ బ్యాచ్ కాగా.. మరొటి సీరియల్ బ్యాచ్. ఆ సీరియల్ బ్యాచ్ లోనే ఆట సందీప్ ఉన్నాడు. ఇక మొదటి నుంచి ఈ రెండు బ్యాచ్ లకు పడకుండా ఆట సాగేది. ఇప్పటికే అంతే జరుగుతుంది. ఇక ఆట సందీప్ విషయానికి వస్తే.. కూల్ గా తన ఆట ఆడుతూ.. వెళ్లేవాడు. ఈ హౌస్ లో మొదటి పవర్ అస్త్ర సాధించి.. మొదటి బిగ్ బాస్ హౌస్ మేట్ అయ్యాడు ఆట సందీప్.

ఇక ఆట సందీప్ ను బిగ్ బాస్ సంచాలక్ గా నిర్వహించింది. ఇక ఇక్కడే ఆయన తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నట్లు నెట్టింట కొన్ని విీడియోలు ట్రోల్ అయ్యాయి. ఇక సీరియల్ బ్యాచ్ కు అనుగుణంగా ఆట సందీప్ తన ఆటను ఆడుతున్నాడని ట్రోల్ చేశారు. ఇక శివాజీ కూడా చాలా సార్లు అడ్డుకున్నాడు. ఇక సంచాలక్ గా కొన్ని వారాలు ఉన్న ఆట సందీప్ 5 వ వారంలో నామినేషన్స్ లోకి వచ్చాడు. కానీ గౌతమ్ సీక్రెట్ రూమ్ నుంచి బయటకు వచ్చి సందీప్ ను సేవ్ చేశాడు.

Ata Sandeep Shocking Comments on Sivaji about Bigg Boss Telugu 7 Show

దీంతో మళ్లీ ఆట సందీప్ సేవ్ అయ్యాడు. ఇక 6 వారంలో నామినేషన్స్ లోకి రాలేదు. కానీ 7వ వారంలో నామినేషన్స్ లోకి వచ్చాడు. ఇక వచ్చిన మొదటి వారంలోనే ఆట సందీప్ ఆట ముగిసిపోయింది. ఎలిమినేట్ అయ్యాడు. ఇక గత ఏడు వారాలుగా నామినేషన్స్ లోకి రాకుండా ఆట ఆడిన సందీప్.. 8 వ వారంలో ఎలిమినేట్ అయిపోయాడు. దీనికి ఆయన బాగానే చార్జ్ చేసినట్లు తెలుస్తోంది. ఏకంగా 20 లక్షల రూపాయలు తీసుకున్నారు.

Ata Sandeep Shocking Comments on Sivaji about Bigg Boss Telugu 7 Show

ఇక ఆ విషయం పక్కన బెడితే.. ఆట సందీప్ బయటకు వచ్చాక మీడియాతో మాట్లాడారు. ఇక అక్కడ ఓ వ్యక్తి బిగ్ బాస్ ను నడిపించేది శివాజీ అన్నానా అంటూ అడిగాడు. శివన్న బిగ్ బాస్ నడిపించడం కాదు... శివాజీ .. తాను ఇద్దరినీ క్యాప్టెన్ చేశాను అని స్టేట్ మెంట్ వదిలాడు. ఆయన క్యాప్టెన్ చేయడం ఏంటి అనేది నా ప్రశ్న. ఏడో వారంలో నేను గౌతమ్ ఒక్క మాల కూడా పడకుండా ఉన్నాం... క్యాప్టెన్ కావాల్సిన నేను... సింపతీ రీజన్ చెప్పి క్యాప్టెన్ నుంచి నన్ను తప్పించారు... అంటూ చెప్పుకువచ్చాడు ఆట సందీప్. దీంతో ఆ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X