twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిత్తిరి సత్తినే కాదు.. ఎవడిని వదిలిపెట్టను.. అందుకే దాడి చేశాను.. నిందితుడు వార్నింగ్

    తెలంగాణ యాస, భాషతో ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్‌లో తీన్మార్ కార్యక్రమంలో హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిత్తిరి సత్తిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేయడం మీడియాలో చర్చనీయాంశమైంది.

    By Rajababu
    |

    తెలంగాణ యాస, భాషతో ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్‌లో తీన్మార్ కార్యక్రమంలో హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిత్తిరి సత్తిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేయడం మీడియాలో చర్చనీయాంశమైంది. దాడి చేసిన వ్యక్తిని పట్టుకొని నిలదీశారు. దాంతో తాను ఎందుకు దాడి చేశారన్నే విషయంపై ఆ వ్యక్తి వివరణ ఇచ్చారు.

    Recommended Video

    Bithiri Sathi Beaten By A Person : వీ6 ఆఫీసు ముందే, నిందితుడు ఏమన్నాడంటే? | Oneindia Telugu
    దాడి చేసిన వ్యక్తిని మణికంఠగా

    దాడి చేసిన వ్యక్తిని మణికంఠగా

    బిత్తిరి సత్తిపై దాడి చేసిన వ్యక్తిని మణికంఠగా గుర్తించారు. ఆయన చేతిలో దాడికి గురైన బిత్తిరి సత్తిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై టెలివిజన్ ఛానెల్ యాజమాన్యం స్పందించింది. దాడికి పాల్పడిన మణికంఠను పోలీసులకు అప్పగించారు.

     భాషను కించపరిచే విధంగా

    భాషను కించపరిచే విధంగా

    తెలంగాణ భాషను కించపరిచే విధంగా బిత్తిరి సత్తి తీన్మార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు. తెలంగాణను అమితంగా అభిమానించే వ్యక్తిగా నేను చాలా మనస్తాపానికి గురయ్యాను. అందుకే అతడిని దాడి చేశాను అని మణికంఠ అన్నారు.

    చాలా రోజుల నుంచి ఫాలో..

    చాలా రోజుల నుంచి ఫాలో..

    తెలంగాణ భాషను వెక్కిరించే విధంగా వ్యవహరిస్తున్నాడు. చాలా రోజుల నుంచి ఫాలో అయ్యాను. అదను కోసం వేచి చూసి ఈ రోజు (నవంబర్ 27న) దాడి చేశాను. ముందు మామూలుగానే మాట్లాడాను. మాటా మాటా పెరిగిపోవడంతో చేయిచేసుకొన్నాం అని మణికంఠ తెలిపారు.

     వందమంది వచ్చి ఎటాక్

    వందమంది వచ్చి ఎటాక్

    వందమంది నా మీదకు వచ్చి ఎటాక్ చేశారు. కారు డ్రైవర్ వచ్చి కొట్టాడు. అందరిని ఎదురించాను. తెలంగాణ భాషను కించపరిస్తే సహించేది లేదు.
    నేను జర్నలిజం చదువుకొన్నాను. పుస్తకాలు రాయడానికి సిద్దమవుతున్నాను. సినిమా రంగంలో పనిచేయడానికి ప్లాన్ చేస్తున్నాను అని మణికంఠ పేర్కొన్నారు.

    ఎవర్నీ వదిలిపెట్టను..

    ఎవర్నీ వదిలిపెట్టను..

    నా స్వస్థలం హైదరాబాద్. సొంత ఇల్లు ఉంది. నాకు హిందుత్వ సంస్థలతో సంబంధం లేదు. కేవలం తెలంగాణ భాషను వెక్కిరించినందుకే దాడి చేశాను. తెలంగాణను కించపరిచే ఎవర్ని వదిలిపెట్టను మణికంఠ హెచ్చరించారు.

    English summary
    Famous Anchor Bittiri Satti attacked by Unidentified man. He was alleged that he was hurted the way Bittiri Satti was projecting the Telangana Language. I will not spare anybody if Telangana language misused..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X