twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హైపర్ ఆదిపై దాడి.. వాటికి బెదిరిపోను.. పవన్‌కే నా మద్దతు.. ఎటాక్ ఎవరు చేశారంటే!

    |

    Recommended Video

    Hyper Aadi Gets Hurted By Some People In Chittoor | Filmibeat Telugu

    టెలివిజన్, ఫిలిం ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో తనదైన హాస్యంతో విశేషంగా అభిమానులను సొంతం చేసుకొన్నారు. అతడు చేసిన ప్రసంగాలు, రియాలిటీ షోకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా, యూట్యూబ్‌లలో ట్రెండింగ్‌గా మారుతున్నాయి. విలక్షణమైన క్రేజ్ సంపాదించుకొన్న హైపర్ ఆదిపై కొందరు దాడి చేయడం సెన్సేషనల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..

    చిత్తూరు జిల్లాలో ఆదిపై దాడి

    చిత్తూరు జిల్లాలో ఆదిపై దాడి

    టెలివిజన్, సినిమా రంగంలో బిజీగా ఉంటూనే హైపర్ ఆది రాజకీయాలపై దృష్టిపెట్టారు. పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాలోని సోమల మండలం కందూరులో జరిగిన పార్టీ సమావేశంలో పాల్గొన్న సమయంలోనే ఆది దాడికి గురయ్యాడు.

     వేదికపై ఆది మాట్లాడుతుండగా

    వేదికపై ఆది మాట్లాడుతుండగా

    చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేసిన సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతుండగా ఓ పార్టీకి సంబంధించిన కొందరు ఆదిపై దాడికి ప్రయత్నించారు. ఆ పార్టీ పేరును, నేత పేరుకు జై కొడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ దాడి సమయంలో జనసేన కార్యకర్తలు అడ్డుకోవడంతో ఆది సురక్షితంగా బయటపడినట్టు సమాచారం.

    <strong>నాకు ఇండస్ట్రీలో ఆఫర్లు రాక పోయినా పర్లేదు: హైపర్ ఆది</strong>నాకు ఇండస్ట్రీలో ఆఫర్లు రాక పోయినా పర్లేదు: హైపర్ ఆది

    దాడి అనంతరం వీడియో రిలీజ్

    దాడి అనంతరం వీడియో రిలీజ్

    దాడి అనంతరం హైపర్ ఆది ఓ వీడియోను విడుదల చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. ఆ వీడియోలో హైపర్ ఆది మాట్లాడుతూ.. నేను బాగా చదువుకొన్నాను. ఏదైనా విషయాన్ని విన్నప్పుడు గానీ, చూసినప్పుడు గానీ నాకు తొందరగా అర్ధమవుతుంది. అందుకే పలు విషయాలపై దృష్టిపెడుతాను. కానీ కొందరు నా వ్యక్తిగత విషయాలను సీరియస్‌గా తీసుకొంటున్నారు.

     పవన్ కల్యాణ్‌కే నా మద్దతు

    పవన్ కల్యాణ్‌కే నా మద్దతు

    నాలుగు టీవీ షోలు, మరికొన్ని సినిమాలు చేసుకొని హ్యాపీగా ఉండవచ్చు కదా అని సలహాలు ఇస్తున్నారు. అలా బతకడం నాకు ఇష్టం లేదు. పవన్ కల్యాణ్ లాంటి మంచి వ్యక్తికి సపోర్టు చేయడంలో నాకు సంతృప్తిగా ఉంటుంది. ఆ విషయంలో నన్ను వదిలేయండి అని హైపర్ ఆది అభిప్రాయపడ్డారు.

    యూత్‌కు నా సలహా ఇదే

    యూత్‌కు నా సలహా ఇదే

    యువతకు నేను ఓ సలహా ఇవ్వాలనుకొంటున్నాను. ప్రతీ ఇంటిలోని ప్రతీ యువకుడు తెల్ల కాగితం తీసుకొని మూడు కాలమ్స్ గీయండి. అందులో పవన్ కల్యాణ్, చంద్రబాబు, వైఎస్ జగన్ పేర్లు రాయండి. వాళ్ల ప్రతిభ, సామర్ధ్యాలను దృష్టిలో పెట్టుకొని.. వాటి ఆధారంగా వచ్చే ఎన్నికలో ఓటు వేయండి అని హైపర్ ఆది సూచించారు.

    English summary
    Jabardasth fame Hyper Aadhi has become that unofficial spokesperson of Janasena party. He is fan of actor turned politician Pawan Kalyan. The meeting was held at Kanduru of Somala mandal in Chittoor, to make the people aware of Jana Sena manifesto and the programmes. When Hyper Aadhi was showering praises for Pawan Kalyan, several YSRCP activists attacked the Jana Sena workers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X