జబర్దస్త్ నరేష్‌పై దాడి.. దారిలో కాపుకాచి మరీ, అసలేం జరిగిందంటే!

Recommended Video

Comedian Naresh Scolded By Youth In Srikakulam | Filmibeat Telugu

జబర్దస్త్ తో నరేష్ బుల్లితెర కమెడియన్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. జబర్దస్త్ లో ప్రేక్షకులను ఎక్కువగా ఇష్టపడే నటులలో నరేష్ కూడా ఒకరు అని చెప్పడంలో సందేహం లేదు. కామెడీ పంచులు, అల్లరి చేష్టలతో నరేష్ ఆడియన్ బాగా ఆకట్టుకుంటున్నాడు. తక్కువ సమయంలోనే గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉండగా నరేష్ పై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటనలో అతడు స్వల్పంగా గాయపడ్డాడు. శ్రీకాకుళ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబందించిన పూర్తి వివరాలు చూద్దాం!

కళింగాంధ్ర ఉత్సవాలు

కళింగాంధ్ర ఉత్సవాలు

ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో కళింగాంధ్ర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో డాన్స్ ప్రోగ్రాం, వివిధ వినోదాత్మక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జబర్దస్త్ నరేష్ అక్కడకు వెళ్ళాడు. నరేష్ చేసిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తయ్యాయి. దీనితో నరేష్ , అతడి టీం తిరుగుపయనమయ్యారు. మార్గమద్యమంలో చిన్నబారటంకు చెందిన యువకులు వారి వాహనంపై దాడికి తగబడినట్లు తెలుస్తోంది.

ఏం జరిగిందంటే

ఏం జరిగిందంటే

నరేష్ పెర్ఫామ్ చేసే కార్యక్రమం వద్ద గ్రీన్ రూమ్ లో బౌన్సర్లు కొందరు యువకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీనితో నరేష్, అతడి డాన్స్ టీం సభ్యులు గొడవని ఆపి సర్దిచెప్పే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. నరేష్ ఆ వివాదంలో మధ్యలో కల్పించుకోవడం ఆ యువకులకు నచ్చలేదు. దీనితో అతడిపై కోపం పెంచుకున్నారు. దాడి చేయాలని ప్లాన్ చేసుకున్నారు.

కాపుకాచి మరీ

కాపుకాచి మరీ

ఆ యువకులు నరేష్ టీం సభ్యులు వాహనంలో వస్తున్న మార్గమధ్యమంలో కాపు కాచారు. నరేష్ టీం రాగానే వాహనాన్ని ఆపి దాడి చేశారు. ఈ దాడిలో నరేష్ సహా అతడి టీం సభ్యులు స్వల్పంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలంలో ఉన్న స్థానికులు నరేష్ పై దాడి చేసినవారిలోకి ఓ యువకుడిని పట్టుకుని స్థానిక పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. మిగిలిన వాళ్ళు పరారీ అయినట్లు తెలుస్తోంది.

కలెక్టర్ వరకూ

కలెక్టర్ వరకూ

కళింగాంధ్ర ఉత్సవాల్లో జరిగిన ఈ ఘటన జిల్లా కలెక్టర్ వరకు వెళ్ళింది. దీనిపై వెంటనే చర్యలు చెప్పట్టాలని కలెక్టర్ పోలీసులని ఆదేశించారు. జబర్దస్త్ కమెడియన్స్ తరచుగా పలు కార్యక్రమాల్లో పెర్ఫామ్ చేస్తుంటారు. కళింగాంధ్ర ఉత్సవాల్లో పెర్ఫామ్ చేసే అవకాశం నరేష్ కు వచ్చింది. ఇతర జబర్దస్త్ టీం సభ్యులంతా ఈ ఘటనపై ఆరా తీసి నరేష్ బాగోగులు తెలుసుకున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X