‘అత్తారింటికి దారేది': బుల్లి తెరపైనా రికార్డే
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి.పతాకంపై భారీ చిత్రాల నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన చిత్రం'అత్తారింటికి దారేది'. రిలీజైన రోజు నుంచి కలెక్షన్స్ దుమ్ము రేపిన ఈ చిత్రం త్వరలో బుల్లితెరపై కూడా కనిపించి ప్రేక్షకులను అలరించింది.
ఈ చిత్రాన్ని 2014 సంక్రాంతి స్పెషల్ గా వేస్తే టీఆర్పీ రేటింగ్ లు ఓ రేంజిలో వచ్చాయని తెలుస్తోంది. అలాగే ట్రేడ్ లో చెప్పుకునేదాన్ని బట్టి యాడ్స్ నిమిత్తం తొమ్మిది కోట్లు దాకా వచ్చాయని చెప్పుకుంటున్నారు. అంతవస్తే పెద్ద సంచలనమే..పెద్ద రికార్డే. అయితే ఈ శాటిలైట్ రైట్స్ నిమిత్తం కూడా ఛానెల్ వారు దాదాపు తొమ్మిది కోట్లు వరకూ వెచ్చించినట్లు వినపడింది. దాంతో మొదటి సారే మొత్తం రికవరీ అయితే మిగతాదంతా లాభమే అంటున్నారు.

ఈ సినిమాకు వచ్చే టీఆర్పిలు,వాటి ద్వారా వచ్చే యాడ్స్ తో బాగా లాభపడే అవకాసం ఉందని టీవీ వర్గాలల్లో చెప్పుకుంటున్నారు. జనవరి 4 వ తేదికి ఈ చిత్రం వంద రోజులు పూర్తి చేసుకుంటుంది. వంద రోజులు పూర్తి చేసుకున్న పది రోజుల్లోనే టీవీలో ప్రసారం కావటంతో ఓ రేంజిలో టీఆర్పీలు వచ్చాయి.
పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. నదియా, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.


Click it and Unblock the Notifications











