గంగవ్వ కోసం గుద్దేస్తున్నారు.. కానీ మిగిలిన వాళ్ళు బలవుతున్నారు కదా..?
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ నాలుగవ సీజన్ మొదటివారం అంతంత మాత్రంగానే కోనసాగింది. డైరెక్టర్ సూర్య కిరణ్ ఎలిమినెట్ అయినప్పటికీ ఆడియెన్స్ పెద్దగా ఆశ్చర్యానికి గురి కాలేదు. ఇక చివరకు రూమర్లే నిజమయ్యాయి. ఈ రోజుల్లో ఫేమ్ సాయి కుమార్ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. అంతా బాగానే ఉంది కాని గంగవ్వకు సంబంధించిన ఒక విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

గంగవ్వకు భారీ మద్దతు
ఒక గేమ్ షోలో కంటెస్టెంట్స్ ఎలాంటి వారైనా సరే అన్ని తరహాలో రూల్స్ కి కట్టుబడి ఉండాలి. అలాగే టాస్క్ లలో న్యాయంగా ఉంటూ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలి. ఇక బిగ్ బాస్ లో గంగవ్వ అందరికంటే కొంచెం ప్రత్యేకమని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆమెకు మొదటి నుంచి ఆడియెన్స్ ఓట్లతో భారీ మద్దతు ఇస్తున్నారు.

సింపతి చూపిస్తే ఎలా?
ప్రేక్షకుల మనసు కేవలం ఒకరిపైనే దృష్టి పడేలా సింపతి చూపిస్తే మిగిలిన వారికి అన్యాయం చేసినట్లే. ఇక కంటెస్టెంట్స్ సెలక్షన్ బిగ్ బాస్ ఎలా ఆలోచించిందో తెలియదు గాని ఫెయిర్ గేమ్ కి అవకాశం ఉందా లేదా అనే అనుమానం కలుగుతోంది. గతంలో ఈ తరహా కంటెస్టెంట్ ఎంట్రీ ఇచ్చింది లేదు. అందుకే షోలో ఎలిమినేషన్స్ వచ్చే సరికి కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతోంది.

గంగవ్వ విషయంలో డేర్ చేయలేక..
హౌజ్ మేంట్స్ మధ్య పోటీ జరిగేటప్పుడు టాస్క్ లో భాగంగా ఇతర కంటెస్టెంట్స్ పై ఏ మాత్రం జాలి చూపకూడదని కొన్నిసార్లు బిగ్ బాస్ వివాదాలను క్రియేట్ చేస్తాడు. ఇక గంగవ్వ విషయానికి వస్తే కంటెస్టెంట్స్ ఎవరు కూడా డేర్ చేయలేకపోతున్నారని అర్ధమవుతోంది. ఆడియెన్స్ సపోర్ట్ గంగవ్వకు ఎక్కువగా ఉందని కంటెస్టెంట్స్ కి ఒక క్లారిటీ వచ్చేసింది. అందుకే ఆమె విషయంలో చాలా తగ్గి నడుచుకుంటున్నారు.
Recommended Video

మిగతా కంటెస్టెంట్స్ కి అన్యాయం?
పొరపాటున గంగవ్వ విషయంలో ఎవరైనా సరే తేడాగా వ్యవహరిస్తే బలి అవ్వక తప్పదు అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. దాదాపు 40శాతం ఓట్లు గంగవ్వకె వస్తున్నాయి. కెపాసిటీ ఉన్న కంటెస్టెంట్స్ కి కూడా అన్ని ఓట్లు రావడం లేదు. గంగవ్వ మీద అభిమానం తప్పు కాదు. కానీ మిగతా కంటెస్టెంట్స్ కి కూడా అన్యాయం జరగకూడదు. మరి ఈ సెన్సిటివ్ లైన్ లో గంగవ్వ ట్రావెలింగ్ ఎలా నడుస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











