Bigg Boss Telugu 7: బిగ్‌బాస్‌కే ఆడియెన్స్ ఉల్టా పుల్టా ట్విస్ట్... ఈసారి ఎలా సేవ్ చేస్తాడో చూద్దాం!
బిగ్ బాస్ తెలుగు 7 రోజు రోజుకు ఆసక్తి పెంచుతుంది. ఇక ఆఖరి ఘట్టానికి రావడంతో సామాన్య ప్రేక్షకులు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. ఇక 13 వారాలుగా ఈ షో ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. అయితే బిగ్ బాస్ తన ఇష్టానుసారంగా నచ్చిన వాళ్లను సేవ్ చేస్తున్నాడు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఓ వారం ఎలిమినేషనే ఎత్తేశాడు. ఇక తనకు నచ్చిన వారిని కాపాడుకుంటూ వస్తున్నాడు అని నెటిజన్స్ కూడా దుమ్మెత్తి పోస్తున్నారు. ఈసారి బిగ్ బాస్ ముద్దుబిడ్డలు డేంజర్ జోన్ లో ఉన్నారు. మరి వారిని ఎలా కాపాడుకుంటాడు బిగ్ బాస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 సెప్టెంబర్ 3న ప్రారంభం అయింది. ఆ రోజున 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టారు. ఇక ఐదో వారంలో మరో ఐదుగురు ఎంటర్ అయ్యారు. ఇక హౌస్ మొత్తానికి 19 మంది ఎంటర్ అయ్యారు. ఇక ప్రస్తుతం హౌస్ లో 8 మంది ఉన్నారు. శివాజీ, ప్రియాంక జైన్, శోభా శెట్టి, అమర్ దీప్, గౌతమ్, అర్జున్, యావర్, ప్రశాంత్ ఉన్నారు. వీరిలో ఈ వారం నామినేషన్స్ లో 7 మంది ఉన్నారు. ఒక్క అమర్ దీప్ తప్ప అందరూ నామినేట్ అయ్యారు.

బిగ్ బాస్ ముద్దు బిడ్డలు అయిన ప్రియాంక జైన్, శోభా శెట్టిలను కాపాడుకుంటూ వస్తున్నాడు. శోభా శెట్టిని కాపాడుకునేందుకు బిగ్ బాస్ చాలా పాట్లు పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. నయని పవని, ఆట సందీప్ సమయంలోనూ శోభా శెట్టికి తక్కువ ఓట్లు వచ్చినా ఆమెను సేవ్ చేసి.. అతన్ని బయటకు పంపించేశాడు. ఇక ఆ తర్వాత టేస్టీ తేజ విషయంలో కూడా అంతే జరిగిందని కామెంట్స్ వచ్చాయి. ఇక బోలే షవాలి విషయంలో కూడా అంతే వచ్చాయన్నారు.

అలా శోభా శెట్టిని కాపాడుకుంటూ వచ్చిన బిగ్ బాస్.. ఓ వారంలో ఎలిమినేషన్ ఎత్తేసి ఉల్టా పుల్టా అంటూ కవర్ చేశాడు. ఎలిమినేషన్ ఎత్తి వేశాక నెక్ట్స్ 12వ వారంలో డబుల్ ఎలిమినేషన్ అని చెప్పాడు. ఇక రాజమాతలు అంటూ ఏదో డ్రామా ప్లే చేసి.. శోభా శెట్టి, ప్రియాంక జైన్ లను నామినేషన్ లోకి రాకుండా చేశాడు. అలా వారిని సేవ్ చేశాడు బిగ్ బాస్.

ఇప్పుడు 13వ వారంలో ఓటింగ్ చూస్తే.. మళ్లీ డేంజర్ జోన్ లోకి శోభా శెట్టి, ప్రియాంకజైన్ లు ఉన్నారు. మరి ఈ వారం ఎలా కాపాడుకుంటాడు బిగ్ బాస్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. బిగ్ బాస్ తెలుగు 7 తాజా ఓటింగ్ ప్రకారం ప్రశాంత్ టాప్ లో ఉండగా.. రెండో స్థానంలో శివాజీ ఉన్నారు. ఇక మూడో స్థానంలో యావర్ ఉండగా.. నాలుగవ స్థానంలో గౌతమ్ ఉన్నాడు.

ఇక ఐదో స్థానంలో అర్జున్ ఉండగా.. చివరి ఆరు, ఏడు స్థానాల్లో బిగ్ బాస్ ముద్దు బిడ్డలు శోభా శెట్టి, ప్రియాంకలు ఉన్నారు. ఇక ఈ వారం ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ కావాలి. మరి ఎవరిని కాపాడుకుంటాడు.. ఏంటి అనేది ఆసక్తిగా మారింది. వీళ్ల కోసం మరి ఇంకోకరిని బలి చేస్తాడా అనేది చూడాలి. ఇక బిగ్ బాస్ తన ఇష్టానికి ఇష్టం వచ్చిన వారిని గెలిపించుకునే పనిలో ఉంటే.. ఓటింగ్ ఎందుకు అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు.


Click it and Unblock the Notifications











