సుమను అంటీ అంటూ జబర్ధస్త్ కమెడియన్.. ఊహించని పరిణామంతో షాకైన యాంకర్!

By Manoj

సుమ కనకాల... తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారుండరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దీనికి కారణం దాదాపు రెండు దశాబ్దాలుగా తెలుగు బుల్లితెరపై యాంకర్‌గా ఆమె హవా చూపిస్తుండడమే. పేరుకు పక్క రాష్ట్రానికి చెందిన అమ్మాయే అయినా... అచ్చ తెలుగు అమ్మాయిలా ఉంటూ అద్భుతమైన టాలెంట్‌తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. అదే సమయంలో వరుసగా ఆఫర్లు దక్కించుకుంటూ టాప్ యాంకర్ అయిపోయింది. ఇంతటి పేరున్న సుమ.. గాలి తీసేశాడు ఓ జబర్ధస్త్ కమెడియన్. ఆ వివరాలేంటో చూద్దాం పదండి.!

Recommended Video

Anchor Suma Serious On Telugu Peope Behavior | చెప్పేది మీకే.. అర్దం కావట్లేదా..?
కమెడియన్లకు కూడా అందని టైమింగ్‌తో

కమెడియన్లకు కూడా అందని టైమింగ్‌తో

చాలా కాలంగా తెలుగులో టాప్ యాంకర్‌గా కొనసాగుతోంది సుమ కనకాల. స్పాంటీనియస్‌గా డైలాగులు చెప్పడంతో పాటు కమెడియన్లు సైతం ఆశ్చర్యపోయేంత పక్కా టైమింగ్‌తో పంచులు వేస్తూ దూసుకుపోతోందామె. మరీ ముఖ్యంగా కొన్ని కార్యక్రమాల్లో అద్భుతమైన యాంకరింగ్‌తో ఆకట్టుకుంటోంది. దీంతో సుమకు ప్రత్యేకమైన ఫ్యాన్‌బేస్ కూడా ఏర్పాటైంది.

అన్నింటిలోనూ ఫస్ట్ ఛాయిస్ సుమనే

అన్నింటిలోనూ ఫస్ట్ ఛాయిస్ సుమనే


గతంలో పోలిస్తే ఇప్పటి తరం యాంకర్లకు గ్లామర్ క్వీన్లుగా పేరొందుతున్నారు. ఇలా చాలా మంది ప్రస్తుతం ఇండస్ట్రీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీళ్లు ఎంత మంది ఉన్నా... చాలా మంది మేకర్ల ఫస్ట్ ఛాయిస్ సుమనే అవుతోంది. అందుకే ఆమెతో చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. అంతేకాదు, రెమ్యూనరేషన్ కూడా ఎక్కువగా ఆఫర్ చేస్తున్నారు.

సుమ వస్తే సినిమా హిట్ అయినట్లేనట

సుమ వస్తే సినిమా హిట్ అయినట్లేనట

ఇక, సినిమాల విషయానికి వస్తే... సుమ గతంలో కొన్ని సినిమాల్లో నటించింది. వాటికి పెద్దగా గుర్తింపు దక్కకపోవడంతో మరోసారి అలాంటి ప్రయత్నాలు చేయలేదు. కానీ, సినిమా ఫంక్షన్లు, సినీ తారలతో ఇంటర్వ్యూలు మాత్రం కొనసాగిస్తోంది. మరీ ముఖ్యంగా తమ సినిమా ఫంక్షన్‌కు సుమ యాంకరింగ్ చేస్తే హిట్ అవుతుందని ఇండస్ట్రీలో చాలా మంది విశ్వసిస్తుంటారు.

సుమ ప్రొగ్రామ్‌లలో అది సూపర్ హిట్

సుమ ప్రొగ్రామ్‌లలో అది సూపర్ హిట్

తెలుగు బుల్లితెరపై సుమ ఎన్నో కార్యక్రమాలు హోస్ట్ చేసింది. ఆడవాళ్ల కోసమే ప్రత్యేకంగా నడిపిన ‘స్టార్ మహిళ' అయితే ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. ఆ తర్వాత కూడా కొన్ని కార్యక్రమాలు చాలా పేరు తెచ్చిపెట్టాయి. ఇక, ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న ‘క్యాష్' మాత్రం కొంత ప్రత్యేకమనే చెప్పాలి. ఇండస్ట్రీకి చెందిన సెలెబ్రిటీలతో నిర్వహించే ఈ షో సూపర్ హిట్ అయింది.

సుమను ఆంటీ అనేసిన జబర్ధస్త్ కమెడియన్

ప్రతి వారం నిర్వహించే ‘క్యాష్' ప్రోగ్రాం సూపర్ సక్సెస్ అవుతోంది. సెలెబ్రిటీలుగా ఎవరు వచ్చినా సుమ వేసే పంచుల కారణంగా ఆయా ఎపిసోడ్స్ విజయవంతం అవుతున్నాయి. ఈ క్రమంలోనే చాలా వరకు ఈ వీడియోలు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో స్థానం దక్కించుకుంటున్నాయి. ఇక, ఈ కార్యక్రమంలోనే భాగంగానే జబర్ధస్త్ కమెడియన్ సుమను ఆంటీ అని పిలిచాడు.

ఊహించని పరిణామంతో షాకైన యాంకర్.!

ఊహించని పరిణామంతో షాకైన యాంకర్.!

గత వారం ప్రసారం అయిన ‘క్యాష్' ప్రోగ్రాంకు ‘ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య' టీమ్ విచ్చేసింది. ఈ సినిమాలో పని చేసిన జబర్ధస్త్ కమెడియన్ ఆటో రాంప్రసాద్.. షో మధ్యలో సుమను పలుమార్లు ఆంటీ.. ఆంటీ అని పిలిచాడు. దీంతో షాకైన ఆమె.. అతడిని సరదాగా కొట్టింది. ఈ ఎపిసోడ్ జరుగుతున్నంత సేపు ఫన్ క్రియేట్ అయింది. అందుకే ఇది వైరల్ అవుతోంది.

జబర్ధస్త్ కమెడియన్ అందులో స్పెషల్

జబర్ధస్త్ కమెడియన్ అందులో స్పెషల్

జబర్ధస్త్ కామెడీ షో ద్వారా వెలుగులోకి వచ్చి సెలెబ్రిటీ హోదాను అనుభవిస్తున్నాడు రాంప్రసాద్. సుడిగాలి సుధీర్ టీమ్ మెంబర్ అయిన అతడు ఆటో పంచుల స్పెషలిస్టుగా పేరొందాడు. ఆ టీమ్ కోసం స్కిట్ రాసేది కూడా అతడే. జబర్ధస్త్‌ ద్వారా ఫేమస్ అవడంతో సినిమా అవకాశాలు కూడా దక్కించుకుంటున్నాడు. ఇప్పుడు ఈ మూవీలోనూ కామెడీ రోల్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X