ఛాన్స్ ఇస్తామని అమ్మాయిలకు వల.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన ఆటో రాంప్రసాద్

By Manoj Kumar P

తెలుగు బుల్లితెర చరిత్రలో 'జబర్ధస్త్' అనే కామెడీ షోకు ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు ఏడేళ్లుగా ఈ షో ప్రజాధరణను పొందుతోంది. అదే సమయంలో ఎంతో మంది టాలెంట్ ఉన్న ఆర్టిస్టులను వెలుగులోకి తీసుకొచ్చింది. జబర్ధస్త్ ద్వారా పరిచయమై.. ప్రస్తుతం స్టార్‌డమ్‌ను అనుభవిస్తున్న వారిలో కమెడియన్ కమ్ రైటర్ రాంప్రసాద్ ఒకడు. ఆటో పంచుల స్పెషలిస్టుగా పేరొందిన అతడు.. ఎంతో క్రేజ్‌ను సంపాదించాడు. తాజాగా ఓ వీడియోను విడుదల చేసిన అతడు.. కొన్ని షాకింగ్ విషయాలను బయట పెట్టాడు. ఆ వివరాలు మీకోసం.!

జబర్ధస్త్ మొత్తానికే అవి బాగా ఫేమస్

జబర్ధస్త్ మొత్తానికే అవి బాగా ఫేమస్

జబర్ధస్త్ షో ద్వారా కామెడీని పండిస్తున్నారు అందులో పని చేసే ఆర్టిస్టులు. ఒక్కొక్కరూ ఒక్క శైలితో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. వీరందరిలో రాంప్రసాద్ తీరు ప్రత్యేకమనే చెప్పాలి. దీనికి కారణం.. అతడు వేసే ఆటో పంచులే. విసుగొచ్చినా నవ్వు పుట్టించే ఆ పంచులు జబర్ధస్త్‌లోనే కాకుండా సోషల్ మీడియాలో సైతం బాగా ఫేమస్ అయిపోవడం విశేషం.

టీమ్ లీడర్ సుధీర్.. నడిపించేది ప్రసాద్

టీమ్ లీడర్ సుధీర్.. నడిపించేది ప్రసాద్

ఈ కామెడీ షోలో చాలా టీమ్‌లు ఉన్నప్పటికీ.. సుడిగాలి సుధీర్ జట్టుకు ఉన్న ప్రత్యేకత వేరు. ఈ టీమ్‌లో గెటప్‌లతో శ్రీను, ఆటో పంచులతో రాంప్రసాద్, కామెడీతో సన్నీ మెప్పిస్తుండడమే దీనికి కారణం. మరీ ముఖ్యంగా ఈ టీమ్‌కు రాంప్రసాద్ రాసే స్క్రిప్టే ప్రధాన బలం. టీమ్ మెంబర్లకు తగ్గట్లు పంచులు రాయగల సత్తా ఉండడంతో అతడు సక్సెస్ అవుతున్నాడు.

ఇక్కడే కాదు.. అక్కడ కూడా అడుగెట్టాడు

ఇక్కడే కాదు.. అక్కడ కూడా అడుగెట్టాడు

రాంప్రసాద్ తనదైన శైలితో పంచులు వేయగల నైపుణ్యం ఉన్న కమెడియన్ కావడంతో.. టీవీ షోలతో పాటు సినిమాల్లోనూ అతడికి అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే ‘జోష్', ‘నేను లోకల్', ‘ఓం నమో వెంకటేశాయ', ‘ఖైదీ నెంబర్ 150', ‘సినిమా చూపిస్త మావ' సహా ఎన్నో చిత్రాల్లో మంచి మంచి పాత్రలు పోషించాడు. మరికొన్నింటిలో నటిస్తున్నాడు.

టీమ్ లీడర్ కాకున్నా.. లాభ పడుతున్నాడు

టీమ్ లీడర్ కాకున్నా.. లాభ పడుతున్నాడు

జబర్ధస్త్‌ షోలో ఇచ్చే రెమ్యూనరేషన్ గురించి అప్పట్లో కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. ఆ వివరాలను బట్టి అందులోని టీమ్ లీడర్లకు, యాంకర్లు, జడ్జ్‌లకు నెలసరి వేతనం చెల్లిస్తున్నారట. మిగిలిన వారిని పక్కనపెడితే.. టీమ్ లీడర్లు తమ పాపులారిటీని బట్టి వేతనం అందుకుంటున్నారు. అయితే, రాంప్రసాద్ మాత్రం లీడర్ కాకున్నా భారీగానే అర్జిస్తున్నాడని సమాచారం.

అవకాశాల పేరుతో అమ్మాయిలకు వల

అవకాశాల పేరుతో అమ్మాయిలకు వల

ఎప్పుడూ నవ్వుతూ.. నవ్విస్తూ ఉండే ఆటో రాంప్రసాద్ ఓ విషయంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ వీడియోను విడుదల చేశాడు. అందులో ఓ షాకింగ్ విషయాన్ని బయట పెట్టాడు. అంతేకాదు, దానికి సంబంధించిన వివరణ కూడా ఇచ్చుకున్నాడు. దీని ప్రకారం.. జబర్ధస్త్ కమెడియన్ రాంప్రసాద్ పేరుతో కొందరు అమ్మాయిలకు ఫోన్ చేసి అవకాశాల పేరుతో వల వేశారట.

ఆ అమ్మాయిల ఫొటోలు అడిగింది వాళ్లే

ఆ అమ్మాయిల ఫొటోలు అడిగింది వాళ్లే

ఈ విషయంపై స్పందిస్తూ.. ‘నేను అడిగానని కొందరు అమ్మాయిల ఫొటోలు తీసుకున్నారు. కానీ, అవి అడిగింది నేను కాదు. నా పేరిట సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్ క్రియేట్ చేసి కొందరు ఆ పని చేశారు. అలాంటి వాళ్లను నమ్మకండి. నాకు ఫేస్‌బుక్‌లో మాత్రమే అధికారిక ఖాతా ఉంది. నేను ఏ అప్‌డేట్ ఇవ్వాలన్నా దాని నుంచే ఇస్తాను' అని అతడు పేర్కొన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X