twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రష్మి- సుధీర్ అలా మొదలై పెళ్లి వరకు, చిరంజీవి పట్టుబట్టలు పంపారు: ఆటో రాంప్రసాద్

    By Bojja Kumar
    |

    జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన కమెడియన్లలో ఆటో రాంప్రసాద్ ఒకరు. మంచి కామెడీ స్కిట్లు రాయడంతో పాటు అడపా దడపా సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటున్న రాంప్రసాద్.... తన లక్ష్యం ఎప్పటికైనా ఒక పూర్తి సినిమాకు స్టోరీ, డైలాగులు రాయడమే అంటున్నారు. తాజాగా ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాంప్రసాద్ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. రష్మి, సుధీర్ రిలేషన్ గురించి, మెగాస్టార్ చిరంజీవి బట్టలు పంపిన విషయం, ఇండస్ట్రీకి రాక ముందు తాను ఏం చేసేవాడో తెలిపారు.

    Recommended Video

    Sudigaali Sudheer And Rashmi Marriage Video
    రష్మి-సుధీర్ రిలేషన్ గురించి

    రష్మి-సుధీర్ రిలేషన్ గురించి

    రష్మి, సుధీర్ మధ్య ఏదో సంబంధం ఉందని అంతా అనుకుంటారు. కానీ అలాంటిదేమీ లేదు. అంతా ఒకే దగ్గర వర్క్ చేస్తున్నాం. సుధీర్ గాడికి మ్యారేజ్ కాలేదు. వాడు ఆవిడకు లైన్ వేస్తున్న ఏదో నాలుగు పంచ్ మా స్కిట్లలో రాయడం మొదల పెట్టడంతో ఈ రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి. ఇతర టీంలు కూడా ఇలాంటి పంచ్ లు రాయడంతో వారిపై రూమర్స్ మరింత ఎక్కువయ్యాయి అని ఆటో రాంప్రసాద్ తెలిపారు.

    ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టే పెళ్లి చేశాం

    ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టే పెళ్లి చేశాం

    రష్మి-సుధీర్ మధ్చ వచ్చే సీన్లను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదంతా ఎంటర్టెన్మెంటు కోసమే, చివరకు ఢీ ఫ్రోగ్రాంలో కూడా ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయడానికే వారికి పెళ్లి చేశాం. అందరినీ నవ్వించడానికే తప్ప వారి మధ్య బయట అనుకుంటున్నట్లు ఎలాంటి రిలేషన్ షిప్ లేదు అని ఆటో రామ్ ప్రసాద్ తెలిపారు.

    అనసూయ వెళ్లిపోతే చాలా మంది బాధ పడ్డారు

    అనసూయ వెళ్లిపోతే చాలా మంది బాధ పడ్డారు

    రష్మి తెలుగు రాని చక్కని అమ్మాయి. ఆమె అంటే అందరికీ చాలా ఇష్టం. తెలుగు డిఫరెంటుగా మాట్లాడుతూ ఉంటుంది. అందరితో సరదాగా ఉంటుంది. స్కిట్లు చాలా ఎంజాయ్ చేస్తుంటారు. అనసూయకు తెలుగు బాగా వచ్చు. టైమింగుతో పంచ్ వేస్తుంటుంది. రష్మి కంటే అనసూయ చాలా సీనియర్. అనసూయ వెళ్లి పోయాక రష్మి వచ్చింది. ఆమె వెళ్లిపోయినపుడు చాలా మంది బాధ పడ్డారు.

     సెట్లో అంతా ఒక ఫ్యామిలీలా...

    సెట్లో అంతా ఒక ఫ్యామిలీలా...

    అనసూయ అయినా రష్మి అయినా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సెట్లో నాగ బాబుగారు, రోజాగారు, అనసూయ, రష్మి, డైరెక్షన్ డిపార్టుమెంట్ అంతా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లా ఉంటారు. అలా ఉండబట్టే ఈ ప్రోగ్రాం ఇప్పటి వరకు కొనసాగుతోంది. అందరిలోనూ మంచి స్కిట్లు చేయాలనే తపన తప్ప మరొకటి ఉండదు అని రాంప్రసాద్ తెలిపారు.

    మెడికల్ షాపులో 500 జీతానికి పని చేశాను

    మెడికల్ షాపులో 500 జీతానికి పని చేశాను

    నేను ఇంటర్ చదువుతూ మెడికల్ షాపులో పార్ట్ టైమ్ పని చేసే వాడిని. అపుడు నెలకు రూ. 500 జీతం. డాడీ హోటల్ లో కుక్. నాలుగేళ్లు మెడికల్ షాపులో చేసిన తర్వాత మెడికల్ రిప్రజంటేటివ్ గా మారి మూడేళ్లు చేశాను. ఆ తర్వాత ఎంటర్టెన్మెంట్ రంగం వైపు రావడం జరిగింది. పెళ్లయిన తర్వాతే సొంతగా ఇల్లు కొనుకున్నాను... అని రాంప్రసాద్ తెలిపారు.

    నా లక్ష్యం సినిమాలే...

    నా లక్ష్యం సినిమాలే...

    ప్రస్తుతం జబర్దస్త్ కు స్కిట్లు రాస్తున్నాను. ఒక మూవీకి ఫుల్‌గా స్టోరీ, డైలాగులు రాయాలనేది నా కోరిక. ప్రస్తుతం భీమినేని శ్రీనివాసరావుగారి సినిమాకు రాస్తున్నాను. సునీల్ గారు, నరేష్ గారు హీరోలుగా చేస్తున్నారు. ఇందులో సునీల్ ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా చేస్తున్నాను.... అని రాంప్రసాద్ తెలిపారు.

    చిరంజీవిగారు పట్టుబట్టలు పంపారు

    చిరంజీవిగారు పట్టుబట్టలు పంపారు

    ఖైదీ నెం 150 చిత్రంలో చిరంజీవి గారి పక్కన చిన్న రోల్ చేశాను. అపుడు ఆయన నాతో సరదాగా మాట్లాడేవారు. ఆయనతో అపుడు 10 రోజులు ట్రావెల్ అవ్వడం నా అదృష్టం. ఇండస్ట్రీకి సగం మంది చిరంజీవిగారిని చూసి వచ్చేవారే. నేను కూడా అలాగే ఆయన్ను చూసి ఇన్ స్పైర్ అయి వచ్చినవాడినే. గృహ ప్రవేశం సమయంలో చిరంజీవిగారిని కలిసి కార్డు ఇచ్చాను. ఆయన అది గుర్తు పెట్టుకుని బొకే, పట్టుబట్టలు పంపారు.... అని రాంప్రసాద్ తెలిపారు.

    English summary
    Auto Ram Prasad Comments On Sudigali Sudheer And Rashmi Marriage Skit.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X