ఆ ఇద్దరు లేక ఒంటరిని అయ్యా... స్టేజి మీద భోరుమని ఏడ్చేసిన జబర్దస్త్ ఆటో రాంప్రసాద్!

బుల్లితెరపై ఎన్నో సంచలనాలు సృష్టించిన కామెడీ షో ఏదైనా ఉంది అంటే అది జబర్దస్త్ కామెడీ షో అని చెప్పక తప్పదు. జబర్దస్త్ కామెడీ షోలో నటించిన వాళ్ళు ఎప్పుడు మంచి స్థాయిలో ఉన్నారు. ఎంతో కమెడియన్స్, జడ్జిలు వచ్చి వెళ్లినా జబర్దస్త్ మాత్రం నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా మరో ఇద్దరు స్టార్ కమెడియన్స్ ఈ షోకు గుడ్ బై చెప్పినట్టు తాజా ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమో ద్వారా తెలుస్తోంది. ఎందుకంటే ఎప్పుడూ సుధీర్, గెటప్ శ్రీనులతో కలిసి ఉండే రామ్ ప్రసాద్ ఒంటిరిని అయ్యాను అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఆ వివరాల్లోకి వెళితే..

 ఎప్పటికప్పుడు

ఎప్పటికప్పుడు


జబర్దస్త్ తో సుడిగాలి సుధీర్ టీం చేసే పర్ఫామెన్స్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. సుధీర్ టీం లీడర్ గా రాంప్రసాద్ పంచులు.. గెటప్ శీను యాక్టింగ్ తో అంతా కలిపి స్కిట్ అంతా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అందుకే ఈ టీం స్కిట్ ఎప్పుడు వస్తుందా..? అని ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు. దాదాపు పది సంవత్సరాలుగా జబర్దస్త్ నిర్విరామంగా నడుస్తుంటే.. అందులో దాదాపు 8 ఏళ్లుగా సుధీర్ టీమ్ ఎప్పటికప్పుడు సరికొత్త అద్భుతాలు చేసుకుంటూ వచ్చింది.

స్నేహితులు లేకపోయేసరికి

స్నేహితులు లేకపోయేసరికి


రాను రాను మారుతున్న పరిస్థితుల వల్ల.. ఒక్కొక్కరుగా జబర్దస్త్ ను వీడవలసి వస్తోంది. జబర్దస్త్ కి జడ్జ్ లుగా ఉన్న నాగబాబు, రోజా ఒకరి తరువాత మరొకరు ఈ ప్రోగ్రామ్ కు తమ తమ వ్యక్తిగత కారణాలతో దూరం అయ్యారు. నాగబాబు వెళుతూ వెళుతూ కొంతమందిని తీసుకు వెళ్లగా ఆ తర్వాత చిన్నగా కంటెస్టెంట్స్ కూడా చాలామంది దూరం అవుతూ వస్తున్నారు. ఈ క్రమంలో సుడిగాలి సుధీర్ తో పాటు, గెటప్ శ్రీను కూడా జబర్థస్త్ ను వదిలేశారు. దీంతో తన స్నేహితులు లేకపోయేసరికి ఆటో రాంప్రసాద్ డల్ అయ్యాడు.

స్నేహితులను తలుచుకుని

స్నేహితులను తలుచుకుని


ఈ విషయాన్ని ఈ మధ్య అనిల్ రావిపూడి జడ్జ్ గా వచ్చినట్టు అడగగా ఎమోషనల్ అయ్యాడు రామ్ ప్రసాద్. ఇప్పుడు ఇతర కంటెస్టెంట్స్ తో స్కిట్స్ చేస్తున్నా.. ఎన్నో ఏళ్ళుగా ఉన్న తన స్నేహితులు లేకపోయేసరికి రాంప్రసాద్ తాజాగా మళ్ళీ ఎమోషనల్ అయ్యాడు. తన స్నేహితులను తలుచుకుని కంటినిండా నీళ్లు పెట్టుకున్నారు. రీసెంట్ గా ఎక్స్ త్ర జబర్దస్త్ ప్రోమో రిలీజ్ అయ్యింది.

స్టేజ్ పైనే ఏడ్చేశాడు

స్టేజ్ పైనే ఏడ్చేశాడు


అందులో రాకేష్,కార్తీక్ టీమ్ కలిసి సుధీర్ టీమ్ ఫ్రెండ్షిప్ గురించి ఓ స్కిట్ చేశారు. ఆ స్కిట్ తో అటు రామ్ ప్రసాద్ తో పాటు జడ్జిగా ఉన్న ఇంద్రజ, యాంకర్ రష్మి, జబర్దస్త్ టీమ్ అంతా కన్నీటి పర్యంతం అయ్యారు. ఆ తర్వాత రామ్ ప్రసాద్ కొంచెం ఎమోషనల్ గా మాట్లాడాడు. వాళ్ళు వెళ్ళిపోతే ఏంటి? నేను రైటర్ ను కదా.... నాకు ఇబ్బంది లేదు అనుకున్నాను. కానీ స్కిట్ అంటే నా ఫ్రెండ్స్ గుర్తుకు వస్తున్నారు. ఒంటరిని అయ్యాను అన్న ఫీలింగ్ పెరిగిపోయింది అంటూ స్టేజ్ పైనే ఏడ్చేశాడు రాంప్రసాద్.

దిష్టి తగిలి

దిష్టి తగిలి


దీంతో ఇంద్రజ కూడా స్టేజ్ మీదకు వెళ్లి దగ్గరకు తీసుకుని ఓదార్చింది. ఇక ఈ స్కిట్ సమయంలో యాంకర్ రష్మితో పాటు అందరూ ఒక్క సారిగా ఎమోషనల్ అయ్యారు. రష్మీ స్కిట్ అయితే జరుగుతున్నంత సేపు ఏడుస్తూ కనిపించింది. ఈ క్రమంలో ఇంద్రజ టీమ్ కు దిష్టి తగిలినట్టుంది. అందుకే ఇంత మంచి టీమ్ ఇలా అయ్యింది అంటూ ఇంద్రజ ఏడుస్తూ రాంప్రసాద్ ను ఓదార్చే ప్రయత్నం చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X