For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ అమ్మాయిలకు జబర్ధస్త్ కమెడియన్ బ్లాక్ మెయిల్ కాల్స్: సంచలన వ్యాఖ్యలు చేసిన ఆటో రాంప్రసాద్

  |

  తెలుగులో ప్రసారం అయ్యే షోలన్నింటిలోనూ ప్రత్యేకమైనదిగా గుర్తింపు తెచ్చుకుంది జబర్ధస్త్. కామెడీ ప్రధానంగా మొదలైన ఈ కార్యక్రమం దాదాపు ఎనిమిదేళ్లుగా హవాను చూపిస్తోంది. రేటింగ్‌లోనూ దూసుకుపోతూ ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. ఇంతటి ప్రభావితమైన షో వల్ల ఎంతో మంది ఆర్టిస్టులు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అలాంటి వారిలో ఆటో రాంప్రసాద్ ఒకడు. చాలా కాలంగా తనదైన పంచులతో సత్తా చాటుతోన్న అతడు.. అమ్మాయిలకు బ్లాక్ మెయిల్ కాల్స్ అంటూ షాకింగ్ విషయాలు లీక్ చేశాడు. ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ వివరాలు మీకోసం!

  జబర్ధస్త్‌ వల్ల అతడికి.. అతడి వల్ల షోకు ప్లస్

  జబర్ధస్త్‌ వల్ల అతడికి.. అతడి వల్ల షోకు ప్లస్

  జబర్ధస్త్ షోలో ఒక్కో కమెడియన్‌కు ఒక్కో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దాని వల్లే వాళ్లు ఫేమస్ అవడంతో పాటు ప్రేక్షకుల మన్ననలు అందుకుంటున్నారు. ఇలా ఈ షో మొత్తంలో అదిరిపోయే కామెడీ వేస్తూ ఆకట్టుకునే రాంప్రసాద్‌కు ఆటో పంచుల స్పెషలిస్టుగా పేరుంది. విసుగొచ్చినా నవ్వు పుట్టించే ఆ పంచుల వల్ల జబర్ధస్త్‌ షోకూ ఆదరణ పెరుగుతుందన్న విషయం తెలిసిందే.

  టీమ్ లీడర్ కాకున్నా... వెనుక నడిపేది తనే

  టీమ్ లీడర్ కాకున్నా... వెనుక నడిపేది తనే

  జబర్ధస్త్‌ షోలో చాలా టీమ్‌లు ఉన్నాయి. అందులో సుడిగాలి సుధీర్ జట్టుకు ఉన్న ప్రత్యేకత వేరు. ఈ టీమ్‌లో గెటప్‌లతో శ్రీను, ఆటో పంచులతో రాంప్రసాద్, కామెడీతో సన్నీ మెప్పిస్తుండడమే దీనికి కారణం. మరీ ముఖ్యంగా ఈ టీమ్‌కు రాంప్రసాద్ రాసే స్క్రిప్టే ప్రధాన బలం. టీమ్ మెంబర్లకు తగ్గట్లు పంచులు రాయగల సత్తా ఉండడంతో అతడు సక్సెస్ అవుతున్నాడు.

  బుల్లితెరపైనే కాదు.. వెండితెరపైనా సత్తా చాటి

  బుల్లితెరపైనే కాదు.. వెండితెరపైనా సత్తా చాటి

  ఆటో పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న రాంప్రసాద్.. బుల్లితెరపైనే ఫేమస్ పర్సనాలిటీగా వెలుగొందుతున్నాడు. అదే సమయంలో సినిమాల్లోనూ నటిస్తూ సత్తా చాటుతున్నాడు. అతడి కెరీర్‌లో ‘జోష్', ‘నేను లోకల్', ‘ఓం నమో వెంకటేశాయ', ‘ఖైదీ నెంబర్ 150', ‘సినిమా చూపిస్త మావ', ‘త్రీ మంకీస్' సహా ఎన్నో చిత్రాల్లో మంచి మంచి పాత్రలు పోషించాడు.

  టీమ్ లీడర్‌తో సమానంగా.. అందుకే అందులో

  టీమ్ లీడర్‌తో సమానంగా.. అందుకే అందులో

  మిగిలిన కమెడియన్లు అందరూ ఏదో ఒక షోలో పని చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. కానీ, ఆటో రాంప్రసాద్ మాత్రం జబర్ధస్త్ తప్ప మరే దానిలోనూ పని చేయడం లేదు. దీనికి కారణం అతడికి ఇందులో ఇచ్చే రెమ్యూనరేషనే అన్న టాక్ ఉంది. ఓ మోస్తరు టీమ్‌ లీడర్ల కన్నా ఎక్కువగానే సంపాదిస్తున్న కారణంగానే అతడు ఈ షోను వదిలి పెట్టడం లేదని అంటున్నారు.

  ఆ అమ్మాయిలకు బ్లాక్ మెయిల్ కాల్స్ అంటూ

  ఆ అమ్మాయిలకు బ్లాక్ మెయిల్ కాల్స్ అంటూ

  స్క్రిప్ట్ రైటర్‌గా, కమెడియన్‌గా ఎప్పుడూ నవ్వుతూ.. నవ్విస్తూ ఉండే ఆటో రాంప్రసాద్ ఓ షాకింగ్ న్యూస్ బయట పెడుతూ వీడియోను విడుదల చేశాడు. తన పేరుతో కొందరు అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని అందులో వెల్లడించాడు. అంతేకాదు, అందులోనే దానికి సంబంధించిన వివరణ కూడా ఇచ్చుకున్నాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  సంచలన విషయాలు వెల్లడించిన రాంప్రసాద్

  సంచలన విషయాలు వెల్లడించిన రాంప్రసాద్

  అసలేం జరిగిందో రాంప్రసాద్ వివరిస్తూ.. ‘నేను అడిగానని కొందరు అమ్మాయిల ఫొటోలు తీసుకున్నారు. కానీ, అవి అడిగింది నేను కాదు. నా పేరిట సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్ క్రియేట్ చేసి కొందరు ఆ పని చేశారు. అలాంటి వాళ్లను నమ్మకండి. నాకు ఫేస్‌బుక్‌లో మాత్రమే అధికారిక ఖాతా ఉంది. నేను ఏ అప్‌డేట్ ఇవ్వాలన్నా దాని నుంచే ఇస్తాను' అని పేర్కొన్నాడతను.

  English summary
  Ramprasad (Auto Ramprasad) is an Indian film actor and stand-up comedian, who is known for his performance in the Telugu Tv comedy shows Jabardasth and Extra Jabardasth. He has also appeared on show "Anubhavinchuraja". Ram Prasad is an Indian stand-up comedian, television presenter, actor and scriptwriter.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X