For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  జబర్ధస్త్ టీమ్ లీడర్లపై రాంప్రసాద్ షాకింగ్ కామెంట్స్: షోలోకి వచ్చిన అమ్మాయిలతో అలా చేస్తారంటూ!

  |

  తెలుగు బుల్లితెరపై ఎన్నో షోలు ప్రేక్షకులకు మజాను పంచుతున్నాయి. అయితే, వాటిలో చాలా తక్కువ షోలు మాత్రమే పోటీని తట్టుకుని నిలబడగలుగుతున్నాయి. అందులో జబర్ధస్త్ మాత్రమే దాదాపు ఎనిమిదేళ్లుగా నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది. ఈ షో ద్వారా ఎంతో మంది బిగ్ సెలెబ్రిటీలు అయిపోయారు. అందులో ఆటో రాంప్రసాద్ ఒకడు. చాలా కాలంగా తనదైన పంచులతో సందడి చేస్తోన్న అతడు.. ఆటో పంచుల స్పెషలిస్టుగా పేరొందాడు. ఇక, తాజాగా రాంప్రసాద్ జబర్ధస్త్ టీమ్ లీడర్లపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇంతకీ ఏం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

  ప్రత్యేక శైలి.. స్పెషలిస్టుగా పేరు

  ప్రత్యేక శైలి.. స్పెషలిస్టుగా పేరు

  జబర్ధస్త్ షో ద్వారా ఎంతో మంది వెలుగులోకి వచ్చారు. అందులో ప్రతి ఒక్కరూ ఏదో ఒక గుర్తింపును అందుకున్నారు. అందులో రాంప్రసాద్‌ది ప్రత్యేకమైన శైలి అనే చెప్పాలి. గుక్క తిప్పుకోకుండా అతడు వేసే పంచులకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా అతడికి ఆటో పంచుల స్పెషలిస్టు అనే పేరు వచ్చింది. వీటి ద్వారానే అతడికి ఊహించని రీతిలో గుర్తింపు, ఆఫర్లు వస్తున్నాయి.

  లైవ్‌‌లో అతడికి ముద్దు పెట్టిన శ్రీముఖి: మళ్లీ అదే తప్పు చేస్తూ.. వీడియో వైరల్ అవడంతో ఇంట్లో రచ్చ

  టీమ్‌ను నడిపిస్తున్నది ప్రసాదే

  టీమ్‌ను నడిపిస్తున్నది ప్రసాదే

  జబర్ధస్త్ షోలో ఎన్నో టీమ్‌లు ఉన్నా.. అందులో కొన్నింటికి మాత్రమే స్పెషాలిటీ ఉంటుంది. వాటిలో సుడిగాలి సుధీర్ జట్టుకు ఉన్న ప్రత్యేకత వేరు. ఈ టీమ్‌లో గెటప్‌లతో శ్రీను, ఆటో పంచులతో రాంప్రసాద్, కామెడీతో సన్నీ మెప్పిస్తుండడమే దీనికి కారణం. మరీ ముఖ్యంగా ఈ టీమ్‌కు రాంప్రసాద్ రాసే స్క్రిప్టే ప్రధాన బలం. టీమ్ మెంబర్లకు తగ్గట్లు పంచులు రాస్తూ సక్సెస్ అవుతున్నాడు.

  సినిమాల్లోనూ సత్తా చాటుతూ

  సినిమాల్లోనూ సత్తా చాటుతూ

  అన్ని షోలలోనూ ఆటో పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న రాంప్రసాద్.. బుల్లితెరపైనే ఫేమస్ పర్సనాలిటీగా వెలుగొందుతున్నాడు. అదే సమయంలో సినిమాల్లోనూ నటిస్తూ సత్తా చాటుతున్నాడు. అతడి కెరీర్‌లో ‘జోష్', ‘నేను లోకల్', ‘ఓం నమో వెంకటేశాయ', ‘ఖైదీ నెంబర్ 150', ‘సినిమా చూపిస్త మావ', ‘త్రీ మంకీస్' సహా ఎన్నో చిత్రాల్లో మంచి మంచి పాత్రలు చేశాడు.

  టీమ్ లీడర్లతో సమానంగా చార్జ్

  టీమ్ లీడర్లతో సమానంగా చార్జ్

  జబర్ధస్త్‌లో పని చేసే మిగిలిన కమెడియన్లందరూ ఏదో ఒక షోలో చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. కానీ, ఆటో రాంప్రసాద్ మాత్రం జబర్ధస్త్ తప్ప మరే దానిలోనూ పని చేయడం లేదు. దీనికి కారణం అతడికి ఇందులో ఇచ్చే రెమ్యూనరేషనే అన్న టాక్ ఉంది. ఓ మోస్తరు టీమ్‌ లీడర్ల కన్నా ఎక్కువగానే సంపాదిస్తున్న కారణంగానే అతడు ఈ షోను వదిలి పెట్టడం లేదని అంటున్నారు.

  Intinti Gruhalakshmi July 28th Episode: నిజం చెప్పిన తులసి.. తప్పు చేశానని కాళ్లు పట్టుకున్న నందూ

  టీమ్ లీడర్లపై షాకింగ్ కామెంట్స్

  టీమ్ లీడర్లపై షాకింగ్ కామెంట్స్

  వచ్చే వారం ప్రసారం కాబోతున్న జబర్ధస్త్ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో హైపర్ ఆది టీమ్ కోసం ఆటో రాంప్రసాద్ గెస్టుగా వచ్చాడు. అతడితో పాటు కొరియోగ్రాఫర్ పండు కూడా ఎంట్రీ ఇచ్చాడు. వీళ్లు ముగ్గురూ కలిసి తెల్ల పంచె, నలుపు రంగు చొక్కాతో అదరగొట్టేశారు. ఇక, ఇందులోనే రాంప్రసాద్ టీమ్ లీడర్లపై షాకింగ్ కామెంట్స్ చేశాడు.

  రాంప్రసాద్‌పై ఆది ఫన్నీ సెటైర్లు

  రాంప్రసాద్‌పై ఆది ఫన్నీ సెటైర్లు

  స్కిట్‌లో భాగంగా హైపర్ ఆది, పండు, రాంప్రసాద్‌లు ముగ్గురు అమ్మాయిలతో కలిసి వచ్చారు. ఓ సందర్భంలో వీళ్లు ఆ అమ్మాయిలతో కలిసి ఉంటారు. అప్పుడు ఆది ‘నిన్ను వడివేలు అనే గ్యాప్‌లో వాడు తడిమేస్తున్నాడు చూశావా? ఏరా చేయి తీసేయ్' అంటూ రాంప్రసాద్‌ను అంటాడు. కానీ, డైలాగ్ చెప్పనంత సేపు అతడు మాత్రం అమ్మాయిపై చేయి వేసి ఉంచుతాడు.

  అమ్మాయిలతో అలా చేస్తారంటూ

  అమ్మాయిలతో అలా చేస్తారంటూ

  హైపర్ ఆది తనను అన్న వెంటనే రాంప్రసాద్ స్పందిస్తాడు. అతడు అమ్మాయిపై చేయి వేసిన విషయాన్ని గుర్తు చేస్తూ ‘ఏదైనా టీమ్ లీడర్లకు కొంచెం ఎక్కువ కంఫర్ట్స్ ఉంటాయి కదా' అని షాకింగ్ కామెంట్స్ చేశాడు. తద్వారా అమ్మాయిలతో వాళ్లు ఎలాగైనా ప్రవర్తించవచ్చు అని ఫన్నీగా చెప్పాడు. దీంతో అందరూ పగలబడి నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో తెగ వైరల్ అవుతోంది.

  English summary
  Auto Ram Prasad is Very Famous Comedian in Jabardasth Show. Now He did Sensational Comments on Team Leaders Along with Lady Artists.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X