twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆటో రాంప్రసాద్ వల్గర్ కామెంట్స్: ఆ అమ్మాయితో అలాంటి మాటలు.. ఎక్కడ పెట్టినా అదే జరుగుతుందంటూ!

    |

    తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే షోలలో కొన్ని మాత్రమే ప్రేక్షకుల నుంచి స్పందనను అందుకుంటూ ఉంటాయి. అందులో ప్రముఖ కామెడీ షో జబర్ధస్త్ ఒకటి. దాదాపు ఎనిమిదేళ్లుగా టెలివిజన్ రంగంలో రికార్డులు తిరగరాస్తూ నెంబర్ వన్ షోగా వెలుగొందుతోందిది. ఇక, దీని వల్ల ఎంతో మంది ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అలాంటి వారిలో ఆటో రాంప్రసాద్ ఒకడు. తనదైన పంచులతో నెంబర్ వన్ కమెడియన్‌గా మారిన అతడు.. వరుస ఆఫర్లతో సత్తా చాటుతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ అమ్మాయితో వల్గర్ కామెంట్స్ చేశాడు. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

    మొదటిసారి ఘాటుగా దర్శనమిచ్చిన శివాత్మిక రాజశేఖర్

    షోతో అతడికి గుర్తింపు.. పంచులతో రెస్పాన్స్

    షోతో అతడికి గుర్తింపు.. పంచులతో రెస్పాన్స్

    జబర్ధస్త్ షోలో ఒక్కొక్కరికీ ఒక ప్రత్యేకమైన శైలి ఉంటుంది. ఈ కారణంగానే చాలా మంది తమదైన గుర్తింపును అందుకుంటున్నారు. తద్వారా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటూ దూసుకెళ్తున్నారు. ఇలా అదిరిపోయే కామెడీ వేస్తూ ఆకట్టుకునే రాంప్రసాద్‌కు ఆటో పంచుల స్పెషలిస్టుగా పేరుంది. విసుగొచ్చినా నవ్వు పుట్టించే ఆ పంచుల వల్ల జబర్ధస్త్‌ షోకూ రెస్పాన్స్ పెరుగుతూనే ఉంది.

    సుడిగాలి సుధీర్ టీమ్‌లో అతడిదే ముఖ్యంగా

    సుడిగాలి సుధీర్ టీమ్‌లో అతడిదే ముఖ్యంగా

    జబర్ధస్త్ షోలో ఎన్నో టీమ్‌లు ఉన్నా.. అందులో కొన్నింటికి మాత్రమే స్పెషాలిటీ ఉంటుంది. వాటిలో సుడిగాలి సుధీర్ జట్టుకు ఉన్న ప్రత్యేకత వేరు. ఈ టీమ్‌లో గెటప్‌లతో శ్రీను, ఆటో పంచులతో రాంప్రసాద్, కామెడీతో సన్నీ మెప్పిస్తుండడమే దీనికి కారణం. మరీ ముఖ్యంగా ఈ టీమ్‌కు రాంప్రసాద్ రాసే స్క్రిప్టే ప్రధాన బలం. టీమ్ మెంబర్లకు తగ్గట్లు పంచులు రాస్తూ సక్సెస్ అవుతున్నాడు.

    షోలలోనే కాదు.. సినిమాల్లోనూ... అలా సత్తా

    షోలలోనే కాదు.. సినిమాల్లోనూ... అలా సత్తా

    అన్ని షోలలోనూ ఆటో పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న రాంప్రసాద్.. బుల్లితెరపైనే ఫేమస్ పర్సనాలిటీగా వెలుగొందుతున్నాడు. అదే సమయంలో సినిమాల్లోనూ నటిస్తూ సత్తా చాటుతున్నాడు. అతడి కెరీర్‌లో 'జోష్', 'నేను లోకల్', 'ఓం నమో వెంకటేశాయ', 'ఖైదీ నెంబర్ 150', 'సినిమా చూపిస్త మావ', 'త్రీ మంకీస్' సహా ఎన్నో చిత్రాల్లో మంచి మంచి పాత్రలు చేశాడు.

    టీమ్ లీడర్ కాకున్నా... ఆ రేంజ్‌లో రాబడుతూ

    టీమ్ లీడర్ కాకున్నా... ఆ రేంజ్‌లో రాబడుతూ

    జబర్ధస్త్‌లో పని చేసే మిగిలిన కమెడియన్లందరూ ఏదో ఒక షోలో చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. కానీ, ఆటో రాంప్రసాద్ మాత్రం జబర్ధస్త్ తప్ప మరే దానిలోనూ పని చేయడం లేదు. దీనికి కారణం అతడికి ఇందులో ఇచ్చే రెమ్యూనరేషనే అన్న టాక్ ఉంది. ఓ మోస్తరు టీమ్‌ లీడర్ల కన్నా ఎక్కువగానే సంపాదిస్తున్న కారణంగానే అతడు ఈ షోను వదిలి పెట్టడం లేదని అంటున్నారు.

    ఆ కంపెనీలో చేరిన రాంప్రసాద్.. రచ్చ చేస్తూనే

    ఆ కంపెనీలో చేరిన రాంప్రసాద్.. రచ్చ చేస్తూనే

    'శ్రీదేవి డ్రామా కంపెనీ' పేరుతో ఈటీవీలో మరో కామెడీ షో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ప్రది ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు ప్రసారం అయ్యే ఈ కార్యక్రమాన్ని మల్లెమాలనే రూపొందిస్తోంది. ఈ షోలో ఆటో రాంప్రసాద్ కూడా భాగం అయ్యాడు. సుడిగాలి సుధీర్‌ దీన్ని హోస్ట్ చేస్తుండగా.. అతడు కామెడీ స్కిట్లు చేస్తూ అందులోనూ రచ్చ రచ్చ చేస్తూనే ఉన్నాడు.

    ఆ అమ్మాయితో రాంప్రసాద్ వల్గర్ కామెంట్స్

    ఆ అమ్మాయితో రాంప్రసాద్ వల్గర్ కామెంట్స్

    ఆటో పంచుల స్పెషలిస్టుగా పేరొందిన రాం ప్రసాద్.. శ్రీదేవీ డ్రామా కంపెనీలోనూ సత్తా చాటుతున్నాడు. ఈ క్రమంలోనే వచ్చే వారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో అతడు చెఫ్‌గా మారాడు. అతడితె హిమజ, వర్ష కూడా నటించారు. వాళ్లతో కలిసి పంచులు వేస్తూ.. వంటలు వండాడతను. ఈ క్రమంలోనే రాంప్రసాద్ అమ్మాయితో వల్గర్ కామెంట్స్ చేశాడు. ఈ ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది.

    Recommended Video

    Anchor Suma జీవితం లోని ఆసక్తికర విషయాలు | HBD Anchor Suma
    అది ఎక్కడ పెట్టినా అదే జరుగుతుందంటూ

    అది ఎక్కడ పెట్టినా అదే జరుగుతుందంటూ

    శ్రీదేవీ డ్రామా కంపెనీలో స్కిట్‌లో భాగంగా రాంప్రసాద్.. 'వంట చేస్తే ఎలా ఉండాలో తెలుసా? మనం తినేది నోట్లో వేస్తే అలా కరిగిపోవాలి' అంటాడు. దీనికి వర్ష వెంటనే ఐస్ ముక్కలు తీసుకొచ్చి 'ఇది నోట్లో వేయగానే అలా కరిగిపోతుంది' అంటూ అతడికే పంచ్ ఇచ్చింది. ఆ వెంటనే రాంప్రసాద్.. 'ఇది నోట్లో వేయగానే కాదు.. ఎక్కడ పెట్టినా కరిగిపోతుంది' అంటూ షాకింగ్‌ కామెంట్ చేశాడు.

    English summary
    Jabardasth with tagline Katharnak Comedy Show is Telugu-language television channel comedy television series, broadcasts on the ETV Network channel which is shot at Annapoorna Studios, Telangana, India. The show is produced by Mallemala Entertainments and Directed by Nitin and Bharath.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X