ఆటో రాంప్రసాద్‌కు ప్రాణాంతక వ్యాధి: అందుకే ఇలా మారిపోయా.. నాకేదైనా అయితే అంటూ షాకింగ్‌గా!
దాదాపు దశాబ్ద కాలంగా తెలుగు బుల్లితెరపై హవాను చూపిస్తూ తిరుగులేని షోగా వెలుగొందుతోంది జబర్ధస్త్. దీని ద్వారా ఎంతో మంది టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు వెలుగులోకి వచ్చారు. తద్వారా ఇప్పుడు షోలు, సినిమాలు చేస్తూ సందడి చేస్తోన్నారు. అందులో ఆటో పంచులు స్పెషలిస్టుగా పేరొందిన రాంప్రసాద్ ఒకడు. తనదైన శైలి కామెడీతో ప్రేక్షకులను అలరిస్తోన్న అతడు.. వరుస అవకాశాలతో సత్తా చాటుతోన్నాడు. ఈ నేపథ్యంలో రాంప్రసాద్ ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా దీనిపై అతడు క్లారిటీ ఇచ్చాడు. వివరాల్లోకి వెళ్తే....

ఆటోనే ఇంటిపేరు అయింది
జబర్ధస్త్ షోలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక గుర్తింపుతో ఫేమస్ అయ్యారు. అందులో రాంప్రసాద్‌ది ప్రత్యేకమైన శైలి అనే చెప్పాలి. గుక్క తిప్పుకోకుండా అతడు వేసే పంచులకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా అతడికి ఆటో పంచుల స్పెషలిస్టు అనే పేరు వచ్చింది. వీటి ద్వారానే అతడికి ఊహించని రీతిలో గుర్తింపు, ఆఫర్లు వస్తున్నాయి. అలాగే, అతడు ఎనలేని క్రేజ్‌నూ అందుకున్నాడు.

పేరుకే వాళ్లు... అంతా అతడే
జబర్ధస్త్ షోలో ఎన్నో టీమ్‌లు ఉన్నా.. అందులో కొన్నింటికి మాత్రమే ప్రత్యేకత ఉంది. వాటిలో సుడిగాలి సుధీర్ టీమ్‌కు ఉన్న ఫాలోయింగే వేరు. ఈ టీమ్‌లో గెటప్‌లతో శ్రీను, ఆటో పంచులతో రాంప్రసాద్, కామెడీతో సన్నీ మెప్పిస్తుండే వారు. మరీ ముఖ్యంగా ఈ టీమ్‌కు రాంప్రసాద్ రాసే స్క్రిప్టే ప్రధాన బలం. టీమ్ మెంబర్లకు తగ్గట్లు పంచులు రాస్తూ అంతా తానై వ్యవహరించాడు.

సినిమాల్లోనూ సత్తా చాటాడు
ఆటో పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న రాంప్రసాద్.. బుల్లితెరపైనే ఫేమస్ పర్సనాలిటీగా వెలుగొందుతున్నాడు. అదే సమయంలో సినిమాల్లోనూ నటిస్తూ సత్తా చాటుతున్నాడు. అతడి కెరీర్‌లో 'జోష్', 'నేను లోకల్', 'ఓం నమో వెంకటేశాయ', 'ఖైదీ నెంబర్ 150', 'సినిమా చూపిస్త మావ', 'త్రీ మంకీస్' సహా ఎన్నో చిత్రాల్లో మంచి పాత్రలు పోషించాడు.

ఆటో రాంప్రసాద్ ఒంటరిగా
జబర్ధస్త్ మొత్తంలో ఎన్నో టీమ్‌లు ఉన్నప్పటికీ ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్‌లో కొనసాగుతోన్న సుడిగాలి సుధీర్ జట్టుపైనే అందరి దృష్టీ ఉండేది. అంతలా వాళ్లు ఆటో పంచ్‌లు, విచిత్రమైన గెటప్‌లు, నవ్వించే మేనరిజాలతో సందడి చేసేవారు. అయితే, ఇప్పడు సుధీర్ వెళ్లిపోవడంతో టీమ్ భారం రాంప్రసాద్ మీదే పడింది. ఇప్పుడతడే స్వయంగా స్కిట్లను రాస్తూ టీమ్‌ను లీడ్ చేస్తున్నాడు.

ఆటోకు ప్రాణాంతక వ్యాధి
జబర్ధస్త్ షోలో టాప్ కమెడియన్‌గా వెలుగొందుతోన్న ఆటో రాంప్రసాద్ కొంత కాలంగా ప్రాణాంతకమైన బ్రెయిన్ ట్యూమర్ సమస్యతో బాధ పడుతున్నాడని ప్రచారం జరుగుతోంది. అందుకే అతడు తలకు ఏదో జరిగిందని, నిత్యం టోపీ పెట్టుకుని కనిపిస్తున్నాడని అంటున్నారు. దీంతో అసలు అతడికి ఏం జరిగిందో తెలియక బుల్లితెర ప్రియులంతా ఆందోళన చెందుతోన్నారు.

రాంప్రసాద్ ఏమన్నాడంటే
తన ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న వార్తలపై ఆటో రాంప్రసాద్ స్పందించాడు. 'నాకేమీ కాలేదు. కొన్ని యూట్యూబ్ ఛానెళ్లలో అలా రాశారు. మీరే రాస్తారు.. మళ్లీ మీరే ఏమైందని నన్ను అడుగుతారేంటి? మీరు ఏదో థంబ్‌నెయిల్ పెడతారు. పాపం ఆడియన్స్ ఏదో అనుకుని చూస్తారు. అందులో ఏమీ ఉండదు. పైన ఒకటి పెడతారు.. లోపల కంటెంట్ వేరే ఉంటుంది' అన్నాడు.

అది చేయించుకున్నానని
ఆ తర్వాత ఆటో రాంప్రసాద్ స్పందిస్తూ.. 'నేనేదో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకుంటే.. నాకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. ఇంకేదో వచ్చింది అని వార్తలు స్ప్రెడ్ చేశారు. కానీ, నాకు ఏమీ కాలేదు. దయచేసి ఇంకేం రాయకండి. ఒకవేళ నాకేమైనా అయితే మీరున్నారు కదా చూసుకోడానికి' అంటూ చెప్పుకొచ్చాడు. మొత్తానికి తనపై వస్తున్న వార్తలను ఇలా కొట్టిపారేశాడు.


Click it and Unblock the Notifications











