యాంకర్ రష్మితో కమెడియన్ అసభ్య ప్రవర్తన: రాత్రికి రమ్మంటూ ఘోరంగా.. ఇంద్రజకు కోపం రావడంతో!

తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల షోలు వస్తున్నాయి. కానీ, వాటిలో కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటూ సక్సెస్‌‌ఫుల్‌గా రన్ అవుతున్నాయి. అందులో ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'శ్రీదేవి డ్రామా కంపెనీ' ఒకటి.

ప్రతి ఆదివారం ప్రసారం అవుతున్న ఈ షో అన్ని రకాల వినోదాలతో సందడిగా సాగిపోతుంది. దీంతో ఈ కార్యక్రమానికి ఆదరణ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఇందులో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. ఇంతకీ ఏం జరిగింది? ఆ పూర్తి వివరాలను మీరే చూసేయండి!

Auto Ramprasad Double Meaning Comments on Anchor Rashmi and Indraja

సక్సెస్‌ఫుల్.. ఆ కమెడియన్లతోనే: చాలా కాలంగా ప్రసారం అవుతోన్న 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షో భారీ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. దీంతో ఎప్పటికప్పుడు మరింత కొత్త కంటెంట్‌ను చూపిస్తూ ప్రేక్షకులను మరింతగా అలరిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగానే హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ వంటి వాళ్లు ఇందులో తమదైన రీతిలో సందడి చేస్తూ తెగ నవ్విస్తున్నారు.

కొత్త టాలెంట్లు పరిచయం చేస్తూ: తెలుగు బుల్లితెరపై సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోన్న 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షో ద్వారా ఎంతో మంది టాలెంటెడ్ ఆర్టిస్టులు వెలుగులోకి వచ్చారు. ముఖ్యంగా ఇందులో మారుమూల ప్రాంతాల్లోని చాలా మంది యువతీ, యువకులు, పెద్ద వాళ్లు తమలోని సత్తాను నిరూపించుకోగలిగారు. అందుకే ఈ షో అన్నింటిలోనూ ప్రత్యేకంగా నిలుస్తూ ప్రేక్షకుల ప్రశంసలు సైతం అందుకుంటోంది.

స్లమ్ డాగ్ హజ్బెండ్ వచ్చేశాడు: వచ్చే ఆదివారం ప్రసారం కాబోతున్న 'శ్రీదేవి డ్రామా కంపెనీ' ప్రోమోను నిర్వహకులు విడుదల చేశారు. ఈ ఎపిసోడ్‌కు 'స్లమ్ డాగ్ హజ్బెండ్' సినిమా యూనిట్ వచ్చింది. వాళ్ల రాకతో సెట్ అంతా సందడిగా కనిపించింది. ముఖ్యంగా సీనియర్ నటుడు బ్రహ్మాజీ తనదైన రీతిలో కామెడీ చేసి ప్రేక్షకులను అలరించాడు. మిగిలిన వాళ్లు కూడా పంచులతో రచ్చ రచ్చ చేసేశారు.

రాఘవ డ్యాన్స్.. మురారి పంచ్: 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలో భాగంగా ఆదివారం ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో జబర్ధస్త్ కమెడియన్ రాకెట్ రాఘవ, 'ఢీ' తేజస్వినితో కలిసి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేశాడు. ఇందులో వీళ్లిద్దరూ అదిరిపోయే మూమెంట్లతో అలరించాడు. ఆ వెంటనే రాఘవ కొడుకు మురారి వచ్చి 'ము** కడిగే వయసులో నీకు మెలోడీ సాంగ్స్ అవసరమా' అంటూ తండ్రి పరువును తీసేశాడు.

రాత్రికి రమ్మంటూ దారుణంగా: 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలో సీనియర్ కమెడియన్‌గా ఉన్న ఆటో రాంప్రసాద్ ఈ మధ్య కాలంలో డబుల్ మీనింగ్ డైలాగులతో రెచ్చిపోతున్నాడు. ఇందులో భాగంగానే వచ్చే ఎపిసోడ్‌లో అతడు రష్మీని రాత్రికి రమ్మని అడిగాడు. దీనికామె ఎందుకు పిలిచారు అని అడుగుతుంది. అప్పుడు రాంప్రసాద్ 'నైట్ టైం ఎందుకు పిలుస్తామో తెలీదా' అంటూ నోరు జారాడు.

Auto Ramprasad Double Meaning Comments on Anchor Rashmi and Indraja

కోపంతో అరిచేసిన ఇంద్రజ: ఆటో రాంప్రసాద్ అలా అంటూ సిగ్గు పడుతూ ఉండగా పక్కనే ఉన్న జడ్జ్ ఇంద్రజ 'ఏయ్' అంటూ గట్టిగా అరిచేసింది. దీంతో వెంటనే తేరుకున్న ఈ జబర్ధస్త్ కమెడియన్ 'ఊర్లో జాతర ఒకటి చేయాలి.. అందుకే పిలిచామండి' అని కవర్ చేసుకున్నాడు. ఆ తర్వాత నరేష్, నూకరాజు సహా మరికొందరు కమెడియన్లు కూడా డబుల్ మీనింగ్ డైలాగులతో చెత్త కామెడీ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X