విష్ణుప్రియకు 300 ఎక్కువ.. కమెడియన్ రాంప్రసాద్ మాస్ ర్యాగింగ్

యాంకర్ విష్ణుప్రియ ఇటీవల వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇన్‌స్టాగ్రామ్ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్‌తో భారీ సంపాదిస్తున్న ఆమె వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ పేరుతో అసభ్యకరమైన ఫోటోలను అప్‌లోడ్ చేస్తున్నారని, దీని వల్ల సమాజంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందంటూ పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరికి కేసుల కారణంగా పోలీస్ స్టేషన్‌లు, కోర్టుల వరకు విషయం వెళ్లింది. అయితే ఈ వివాదం వల్ల ఆమెకు ఫ్రీ పబ్లిసిటీ లభించింది. మీడియాలో విష్ణుప్రియ గురించి వార్తలు రావడంతో చాలామంది ఆ ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ కోసం ఆమె ఇన్‌స్టాగ్రామ పేజీని సబ్‌స్క్రైబ్ చేసుకుంటున్నారు. దాంతో విష్ణుప్రియ భారీగా సంపాదిస్తోంది.

యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్‌తో తొలుత ఇండస్ట్రీలో అడుగుపెట్టారు విష్ణుప్రియ.. పెళ్లిచూపులు, మెన్ విల్ బి మెన్, వైఫ్ ఆఫ్ కరుణ, యెల్లో, సోడాబుడ్డీ, ఇండియన్స్ ఏజ్ 25 వంటి షార్ట్ ఫిల్మ్స్‌లో నటించింది. అయినా పెద్దగా అవకాశాలు రాలేదు. ఈ దశలో 2017లో ఈటీవీలో ప్రసారమైన పోరాపోవే ప్రోగ్రామ్‌కు యాంకర్‌గా అవకాశం రావడం విష్ణుప్రియ జీవితాన్ని మలుపు తిప్పింది. సుడిగాలి సుధీర్‌తో కలిసి చేసిన ఆ షోతో విష్ణుప్రియకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత జబర్దస్త్‌తో పాటు కొన్ని ఛానెల్స్‌లో యాంకర్‌గా కనిపించింది.

Auto Ramprasad s Punches on Anchor Vishnupriya Old Comedy Skit Trends Again

ఈ ఫేమ్‌తోనే బిగ్‌బాస్ తెలుగు 8లో కంటెస్టెంట్‌గా అవకాశం దక్కించుకుంది విష్ణుప్రియ. ఇందులో ఖచ్చితంగా టైటిల్ విన్నర్ అవుతుందని అంతా భావించారు. అయితే పృథ్వీ చుట్టూ తిరగడంతో ఆమె అవకాశాలు కోల్పోయింది. బిగ్‌బాస్ తర్వాత కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్‌లోనూ, కొన్ని ఛానెల్స్‌లోనూ సందడి చేసింది విష్ణుప్రియ. ఇదే సమయంలో బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్ చేసిన అభియోగాలపై ఆమెపై కేసులు నమోదయ్యాయి. దాంతో కోర్టులో విచారణకు సైతం హాజరైంది విష్ణుప్రియ. ఆ తర్వాత కొన్నాళ్లు ఆమె పేరు వార్తల్లో నిలిచింది. ఇప్పుడు తాజాగా ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ వివాదం ఆమె మెడకు చుట్టుకుంది. అయినప్పటికీ తను అనుకున్న దారిలోనే వెళ్తోంది. బుల్లితెరపై పలు షోలకు హాజరయ్యే శ్రీముఖి.. తనపై వేసే పంచ్‌లు, జోకులను సరదాగా తీసుకుంటారు. ఈ క్రమంలోనే కొద్దిరోజుల క్రితం జరిగిన షోలో విష్ణుప్రియపై కమెడియన్ రాంప్రసాద్ పంచ్‌ల వర్షం కురిపించాడు.

గతేడాది దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని ఈటీవీలో పిఠాపురం కమిటీ కుర్రోళ్లు పేరుతో ఈవెంట్ నిర్వహించారు. స్టార్ యాంకర్ శ్రీముఖి ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించగా.. హీరో తరుణ్, హీరోయిన్ పూర్ణ సహా జబర్దస్త్ కమెడియన్లు, పలువురు సెలబ్రిటీలు పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా ఒక్కొక్క సెలబ్రిటీని స్టేజ్ మీదకి ఆహ్వానించింది శ్రీముఖి. ఇంతలో మేం ఇచ్చే 500 రూపాయలకు ఇంత మంది వచ్చారా అని రాంప్రసాద్ అంటాడు. ఇంతలో ఓ పెద్దాయన నేను 500 చందా ఇచ్చా.. నా డబ్బులు నాకు వెనక్కి ఇచ్చేయంటాడు. ఆ మాటలతో అంతా షాక్ అవుతారు.

దాంతో నీకేం కావాలో చెప్పు బాబాయ్ అని అడుగుతాడు రాంప్రసాద్. 1000 రూపాయలు ఇస్తా విష్ణుప్రియని నా పక్కన కూర్చోబెట్టండి అంటాడు పెద్దాయన. ఆయన మాటలతో విష్ణుప్రియతో పాటు అంతా అవాక్కవుతారు. విష్ణుప్రియకు వెయ్యి రూపాయలు ఇస్తే 700 తిరిగి ఇచ్చేస్తుంది.. 300 రూపాయలు చాలని రాంప్రసాద్ అనడంతో అంతా పడిపడి నవ్వుతారు. దానితో పాటు ఈ షోలోని పలు చోట్ల విష్ణుప్రియపై హైపర్ ఆది, రాంప్రసాద్‌లు వేసిన పంచ్‌లు నవ్వించాయి. ప్రస్తుతం ఈ పాత వీడియో వైరల్ అవుతుంది.

Read more about: auto ramprasad vishnupriya
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X