twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రోజాకి మంత్రి పదవి రాకూడదని మొక్కుకున్న ఇంద్రజ.. షాకింగ్ విషయం బట్టబయలు చేసిన జబర్దస్త్ నటుడు!

    |

    తెలుగు బుల్లితెర చరిత్రలో పోటీ లేకుండా పరుగులు పెడుతోంది జబర్దస్త్ కామెడీ షో. తొలుత సాదాసీదాగా ప్రారంభించిన ఈ కామెడీ షో సూపర్ హిట్ కావడంతో దాదాపు పదేళ్ల పై నుంచి నిరాటంకంగా నసాగుతూ వస్తోంది. ఈ షో ద్వారా అనేక మంది కమెడియన్లు కూడా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. షోలో పాల్గొనే వారి సంఖ్య పెరిగి పోతూ ఉండడంతో కొత్తగా ఎక్స్ ట్రా జబర్దస్త్ అనే మరో కార్యక్రమాన్ని రూపొందించి తెలుగు ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. ఇక జూన్ 17 వ తేదీన ప్రసారమయ్యే ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోగ్రాంకి సంబంధించిన ఒక ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

    టిఆర్పి స్టంట్

    టిఆర్పి స్టంట్

    ఒకప్పుడు జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోగ్రాములకు రోజా, నాగబాబు జడ్జిలుగా ఉండేవారు. నాగబాబు విభేదాలతో వేరే ఛానల్ కి వెళ్ళిపోగా రోజా మంత్రి అయిపోవడంతో ఆమె కూడా షోకి హాజరు కావడం లేదు. దీంతో అప్పటికప్పుడు ఎవరు అందుబాటులో ఉంటే వారి చేత షో చేయిస్తున్నారు నిర్వాహకులు. కొన్నిసార్లు మనో, ఇంద్రజ, సదా, లైలా ఇలా ఎవరు అందుబాటులో ఉండే వారిని జడ్జిలుగా కూర్చోబెట్టి మమ అనిపించేస్తున్నారు. షో ఫార్మేట్ తప్పడంతో ప్రతి ఎపిసోడ్లో కూడా ఏదో ఒక రకమైన టిఆర్పి స్టంట్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

    అనుమానాలను క్లియర్ చేసేందుకు

    అనుమానాలను క్లియర్ చేసేందుకు


    తాజాగా విడుదలైన ప్రోమోలో చూస్తున్న దాని ప్రకారం ఈ ఎక్స్ ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ లో కూడా టీఆర్పీ స్టెంట్ ప్లాన్ చేసినట్లు ఉన్నారు. అందులో భాగంగానే షోలో జడ్జిగా వ్యవహరిస్తున్న ఇంద్రజ కొందరు టీమ్ లీడర్ లను ప్రశ్నలడుగుతూ కనిపించారు.. ముందుగా రకరకాల స్కిట్ లకు సంబంధించి ఎలాంటి కంటెంట్ తో ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అనే విషయం మీద క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత ఈ షో ద్వారా అనేక మంది ప్రేక్షకుల మనసులలో ఉన్న అనుమానాలను క్లియర్ చేసేందుకుగాను ఒక చిన్న ఇంటర్వ్యూ లాంటిది ప్రోమో చివరిలో చూపించారు.

    బుల్లెట్ భాస్కర్ నిర్వాకం

    బుల్లెట్ భాస్కర్ నిర్వాకం


    అందులో భాగంగా ఇంద్రజ తొలుత బుల్లెట్ భాస్కర్ ను ప్రశ్నిస్తూ మీతో పాటు ఒక కో టీం లీడర్ ఉండేవారని, ఆయన మీరు తొక్కేస్తున్నారు అనే ఉద్దేశంతో ఉన్నారని, ఆయనను మీరే బయటకు పంపించేశారు అని వార్తలు వినిపిస్తున్నాయని దానికి మీరేమంటారు అని ప్రశ్నించారు. అసలు ఈ విషయం మీద ముందు తాను స్పందించకూడదు అనుకున్నానని ఎందుకంటే వెళ్ళిపోయిన వ్యక్తి వయసులో పెద్దవాడు అని అందుకే ఈ విషయంలో తాను స్పందించకూడదు అనుకున్నాను. కానీ ఇప్పుడు స్పందించక తప్పడంలేదు అంటూ బుల్లెట్ భాస్కర్ కామెంట్ చేయడం కనిపిస్తోంది. షో నుండి బయటకు వచ్చిన జబర్దస్త్ అప్పారావు బుల్లెట్ భాస్కర్ నిర్వాకం వల్ల తాను బయటకు వచ్చాను అనే విధంగా కామెంట్లు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

    సీరియస్ గా

    సీరియస్ గా


    ఇక మరో పక్క ఆటో రాంప్రసాద్ ను ప్రశ్నిస్తూ నువ్వు స్కిట్లు సరిగా రాయడం లేదు అనే ఉద్దేశంతో నీ స్నేహితులు బయటకు వెళ్లిపోయారు అని టాక్ వినిపిస్తోంది దీనిమీద నువ్వు ఏమని స్పందిస్తావు అంటూ ఇంద్రజ ప్రశ్నించింది. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను ఇద్దరి గురించి ఉద్దేశించే ఆమె ఈ ప్రశ్న అడిగి ఉంటుందని దాదాపు అందరికీ అర్థం అవుతుంది. దీనికి రామ్ ప్రసాద్ స్పందిస్తూ ఈ ప్రశ్న అడిగే వాళ్లందరికీ తాను ఒకటే సమాధానం చెప్పాలి అనుకుంటున్నాను అంటూ సీరియస్ గా మాట్లాడడం కనిపిస్తోంది.

    మంత్రి పదవి రాకూడదు

    మంత్రి పదవి రాకూడదు


    ఇక చివరిగా స్టేజ్ దిగబోతూ రాంప్రసాద్ కూడా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి అనుకుంటున్నాను అని అడగడంతో ఇంద్రజ అడగమని అంటుంది. రోజా గారికి మంత్రి పదవి రాకూడదు అని మీరు మొక్కుకున్నారు అంట నిజమేనా అని రాంప్రసాద్ అడగడంతో ఇంద్రజ తలదించుకోవడం కనిపిస్తోంది. రోజా మంత్రి కాకముందే ఆమె కొన్నాళ్లపాటు సర్జరీ చేయించుకుని బెడ్ రెస్ట్ లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆసమయంలోనే ఇంద్రజ అనూహ్యంగా తెరమీదకు వచ్చింది. రోజా వచ్చిన తర్వాత ఇంద్రజను శ్రీదేవి డ్రామా కంపెనీ కి పరిమితం చేయాలని అనుకున్నారు కానీ సోషల్ మీడియాలో రోజా కంటే ఇంద్రజే బాగుంది ఆమెనే ఉంచండి అంటూ కామెంట్లు వినిపించడంతో రోజాకు -ఇంద్రజకు గ్యాప్ పెరిగిందని ప్రచారం జరిగింది. అయితే అసలు ఏం జరిగింది అనే విషయం ఈ షో టెలికాస్ట్ అయితే గాని క్లారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు.

    English summary
    In extra jabardasth latest promo Auto ramprasad asked a shocking question to indraja about roja's ministry.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X