జబర్ధస్త్‌లో కొనసాగడంపై రాంప్రసాద్ క్లారిటీ: స్కిట్లు చేయలేకే.. సుధీర్, శ్రీను గురించి షాకింగ్‌గా!

దాదాపు ఎనిమిదేళ్లుగా తెలుగు బుల్లితెరపై సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూ.. నెంబర్ వన్ కామెడీ షోగా వెలుగొందుతోంది జబర్ధస్త్. పోటీగా వచ్చిన షోలు మధ్యలోనే ఆగిపోయినా.. ఏమాత్రం బ్రేక్ లేకుండా సాగుతూ టెలివిజన్‌ రంగంలో హవాను చూపిస్తోంది. తద్వారా అప్పటికీ ఇప్పటికీ ఒకే రకమైన ప్రేక్షకాదరణను అందుకుంటోంది. తద్వారా భారీ స్థాయిలో టీఆర్పీ రేటింగ్‌ను సైతం అందుకుంటోంది. ఈ షో ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు సెలెబ్రిటీలుగా మారిపోయారు. అందులో సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అయితే, వీళ్లిద్దరూ ఇటీవలే దీని నుంచి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వాళ్ల సహచరుడు ఆటో రాంప్రసాద్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆ సంగతులేంటో మీరే చూడండి!

చిన్న వాళ్లను స్టార్లుగా మార్చేసి

చిన్న వాళ్లను స్టార్లుగా మార్చేసి

సుదీర్ఘ కాలంగా తెలుగులో తిరుగులేని షోగా వెలుగొందుతూ.. చెరిగిపోని ఎన్నో రికార్డులను క్రియేట్ చేస్తోంది జబర్ధస్త్. ఈ షో ద్వారా బుల్లితెరపైకి ఎంతో మంది టాలెంట్ ఉండి అవకాశాలు లేని వాళ్లు వెలుగులోకి వచ్చారు. వాళ్లే ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్టిస్టులు, టెక్నీషియన్లుగా సత్తా చాటుతున్నారు. అలాగే, కొన్ని వందల మందికి ఈ షో జీవనోపాధికి కల్పిస్తూ మంచి పేరు తెచ్చుకుంది.

జబర్ధస్త్‌లో ఆ టీమ్ ప్రత్యేకంగా

జబర్ధస్త్‌లో ఆ టీమ్ ప్రత్యేకంగా

జబర్ధస్త్ షోలో చాలా టీమ్‌లు తమదైన ప్రత్యేకతను చాటుకుంటూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాయి. అందులో సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్‌లు కలిసి చేసిన టీమ్ మరింత స్పెషల్ అనే చెప్పాలి. ఎంతో టాలెంట్ ఉన్న ఈ ముగ్గురు ఒకే టీమ్‌గా ఉంటూ నవ్వులు పూయిస్తున్నారు. తద్వారా ఇది షో చరిత్రలోనే ఉత్తమమైన టీమ్‌గా పేరు కూడా అందుకుంది.

తప్పుకున్న సుధీర్, గెటప్ శ్రీను

తప్పుకున్న సుధీర్, గెటప్ శ్రీను

చాలా ఏళ్ల పాటు జబర్ధస్త్ షోలో తమదైన కామెడీతో ప్రేక్షకులను అలరించిన సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. దీనివల్లే ఎదిగిన వాళ్లు ఇటు బుల్లితెరపై, అటు వెండితెరపై హవాను చూపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే సుధీర్, శ్రీను జబర్ధస్త్ నుంచి తప్పుకున్నారు. ఈ క్రమంలోనే తమ తమ కెరీర్‌లను సాగించుకుంటున్నారు.

ఆటో రాంప్రసాద్ మీదే భారం

ఆటో రాంప్రసాద్ మీదే భారం

జబర్ధస్త్‌లో ఎన్నో టీమ్‌లు ఉన్నప్పటికీ ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్‌లో కొనసాగుతోన్న సుడిగాలి సుధీర్ జట్టుపైనే అందరి దృష్టీ ఉండేది. అంతలా వాళ్లు ఆటో పంచ్‌లు, విచిత్రమైన గెటప్‌లు, నవ్వించే మేనరిజాలతో సందడి చేసేవారు. అయితే, ఇప్పడు సుధీర్, శ్రీను వెళ్లిపోవడంతో టీమ్ భారం రాంప్రసాద్ మీదే పడింది. ఇప్పుడతడే స్వయంగా స్కిట్లను రాస్తూ టీమ్‌ను లీడ్ చేస్తున్నాడు.

స్కిట్లు ఫెయిల్ అంటూ ప్రశ్న

స్కిట్లు ఫెయిల్ అంటూ ప్రశ్న

గత శుక్రవారం జరిగిన ఎపిసోడ్‌లో ప్రేక్షకులు అడుగుతున్న కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలని జడ్జ్ ఇంద్రజ.. కొందరు టీమ్ లీడర్లను అడిగారు. ఇందులో భాగంగా రాంప్రసాద్‌కు స్కిట్లు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయన్న ప్రశ్న ఎదురైంది. దీనికతడు 'ఇప్పటికే 1000 స్కిట్ల వరకూ చేశాం. మాకు ఐడియాలు సరిగా రాకపోవడం వల్లే కొన్ని ఫెయిల్ అవుతున్నాయి' అన్నాడు.

అలాంటి రోజు వస్తే వెళ్లిపోతా

అలాంటి రోజు వస్తే వెళ్లిపోతా

ఆ ప్రశ్నకు సమాధానాన్ని చెప్పే క్రమంలో ఆటో రాంప్రసాద్.. 'ఇప్పటికే ఎన్నో రకాల స్కిట్లు చేశాం. కాబట్టి ఏదీ ప్లాన్ చేయడం లేదు. అప్పటికప్పుడు ఏది గుర్తుకు వస్తే అదే చేస్తూ వెళ్తున్నాం. అందుకే కొన్ని సక్సెస్ కావడం లేదు. ఇది ఒప్పుకోవడానికి నేనేమీ ఫీల్ అవడం లేదు. ఒకవేళ అసలు ఐడియాలు రాకపోతే.. ఆరోజే నేను జబర్ధస్త్ నుంచి వెళ్లిపోతాను' అని క్లారిటీ ఇచ్చేశాడు.

వాళ్లిద్దరూ వెళ్లిపోవడంపై ఇలా

వాళ్లిద్దరూ వెళ్లిపోవడంపై ఇలా

ఇటీవలే తమ టీమ్‌ నుంచి సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను వెళ్లిపోయిన విషయాన్ని గుర్తు చేసిన ఆటో రాంప్రసాద్.. 'వాళ్లిద్దరూ వెళ్లిపోయినా నా రైటింగ్ మీద ఉన్న నమ్మకంతో ఇందులో కొనసాగుతున్నాను. వాళ్లు లేకపోవడం లోటే. కానీ, నా టాలెంట్‌తో దాన్ని అధిగమించి మీ ముందుకు వస్తున్నాను. ఇందుకోసం మరింతగా శ్రమిస్తున్నాను' అంటూ చెప్పుకొచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X